Paradise Tickets: నాని ఫ్యాన్స్ గెట్ రెడీ.. బుకింగ్స్ ఎప్పటి నుంచంటే? పెరిగిన ప్యారడైజ్ టికెట్ ధరలు.. ప్రీమియర్స్ కూడా!
Paradise Tickets: నాని ఫ్యాన్స్ గెట్ రెడీ. ఇక జడల్ జమానా అఫీషియల్ గా స్టార్ట్ కానుంది. నాని హీరోగా నటించిన ది ప్యారడైజ్ టికెట్ అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయ్యాయి. అలాగే తెలంగాణలో టికెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.
Paradise Tickets: నేచురల్ స్టార్ నాని, మాస్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ మూవీ టికెట్ రేట్లను తెలంగాణ ప్రభుత్వం పెంచింది. టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇస్తూ జీవో జారీ చేసింది.

ది ప్యారడైజ్ టికెట్ రేట్లు
సెప్టెంబర్ 24న విడుదల కానున్న 'ది ప్యారడైజ్' చిత్రానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జీఎస్‌టీతో కలిపి టికెట్ ధరల పెంపునకు అనుమతించింది. మొదటి విడతగా సెప్టెంబర్ 24 నుంచి సెప్టెంబర్ 27 వరకు సింగిల్ స్క్రీన్లలో ప్రతి టికెట్‌పై రూ.48 పెంచగా, మల్టీప్లెక్స్‌లు, స్పెషల్ థియేటర్లలో జిఎస్‌టీతో కలిపి రూ.95 అదనంగా పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది.
అనంతరం రెండో విడతగా సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకు టికెట్ ధరలలో కాస్త తగ్గించారు. ఈ వ్యవధిలో సింగిల్ స్క్రీన్లలో ప్రతి టికెట్‌పై రూ.23, మల్టీప్లెక్స్‌లు మరియు ప్రత్యేక థియేటర్లలో రూ.45 వరకు మాత్రమే అదనపు ధరలు అమల్లో ఉంటాయి.
ప్రీమియర్స్ ఇలా
ఇక నాని ఫ్యాన్స్, సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రీమియర్ షో వివరాలను కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. సెప్టెంబర్ 23 సాయంత్రం రూ.6.30 గంటలకు వేసే ఈ స్పెషల్ షో టికెట్ రేటును రూ.500 గా ఖరారు చేశారు.
ప్రభుత్వ జీవో ప్రకారం ఈ ధరలన్నీ జీఎస్‌టీతో కలిపి ఉన్నాయని మేకర్స్ స్పష్టం చేశారు. బాక్సాఫీస్ వద్ద తొలి రోజు గ్రాండ్ ఓపెనింగ్స్ సాధించడంతో పాటు వీకెండ్ వసూళ్లను గరిష్ట స్థాయికి తీసుకెళ్లడానికి ఈ పెంపు ఎంతగానో ఉపయోగపడనుంది.
అడ్వాన్స్ బుకింగ్స్
ఇక నైజాం ఏరియాలో అడ్వాన్స్ బుకింగ్స్ పై కూడా మూవీ టీమ్ అదిరే న్యూస్ చెప్పింది. ఇవాళ రాత్రి 7 గంటల 17 నిమిషాల నుంచి ది ప్యారడైజ్ అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ స్టార్ట్ అవుతున్నాయని ప్రకటించింది. డిస్ట్రిక్ట్ యాప్ లో బుక్ చేసుకోవచ్చని డిస్ట్రిబ్యూటర్ అయిన మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎక్స్ లో పోస్టు చేసింది.
ఏపీలో ఎప్పుడో మరి?
ది ప్యారడైజ్ టికెట్ రేట్ల పెంపు విషయంపై ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పిస్తూ జీవో జారీ చేసింది. దీంతో నైజాం ఏరియాలో టికెట్ బుకింగ్స్ షురూ అయ్యాయి. ఇప్పటికే ఓవర్సీస్ లోనూ బుకింగ్స్ ఓపెన్ అయిన సంగతి తెలిసిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


