Nani Kayadu: ది ప్యారడైజ్ ప్రమోషన్లలో కనిపించని హీరోయిన్ కాయదు.. ఆ డైరెక్టర్ ఒప్పుకోలేదంటూ నాని ఇంట్రెస్టింగ్ కామెంట్లు

Nani Kayadu: ది ప్యారడైజ్ మూవీతో పాన్ ఇండియా బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి నేచురల్ స్టార్ నాని రెడీ అవుతున్నారు. రిలీజ్ దగ్గరపడుతుండటంతో సినిమా టీమ్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. అయితే ప్రమోషన్స్ లో హీరోయిన్ కాయదు లోహర్ కనిపించడం లేదు. దీనిపై నాని క్లారిటీనిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.

Published on: Sep 18, 2026, 06:10:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Nani Kayadu: నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పీరియడ్ యాక్షన్ డ్రామా 'ది పారడైజ్' (The Paradise). రిలీజ్ కు దగ్గరపడుతున్న ఈ మూవీ ప్రమోషన్లలో హీరోయిన్ కయాదు లోహర్ (Kayadu Lohar) కనిపించకపోవడం నెట్టింట చర్చనీయాంశమైంది. తాజాగా చెన్నై ప్రెస్ మీట్‌లో ఈ విషయంపై నాని చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

ది ప్యారడైజ్ ప్రమోషన్లలో కనిపించని హీరోయిన్ కాయదు.. ఆ డైరెక్టర్ ఒప్పుకోలేదంటూ నాని ఇంట్రెస్టింగ్ కామెంట్లు (x)
ది ప్యారడైజ్ ప్రమోషన్లలో కనిపించని హీరోయిన్ కాయదు.. ఆ డైరెక్టర్ ఒప్పుకోలేదంటూ నాని ఇంట్రెస్టింగ్ కామెంట్లు (x)

చెన్నై ప్రెస్ మీట్‌లో నాని క్లారిటీ

ది ప్యారడైజ్ మూవీ ప్రమోషన్లలో కాయదు లోహర్ కనిపించకపోవడంపై నాని క్లారిటీనిచ్చారు. "ఈ ప్రశ్నకు నా దగ్గర ఒక అద్భుతమైన సమాధానం ఉంది. కాయదు ప్రస్తుతం కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు మారి సెల్వరాజ్ సర్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది. తమిళ ప్రేక్షకుల కోసం ఒక గొప్ప చిత్రాన్ని తీస్తున్న మారి సెల్వరాజ్ సర్ ఆమెను ఈ ప్రెస్ మీట్‌కి పంపడానికి ఒప్పుకోలేదు. అందుకే ఆమె ఇక్కడకు రాలేకపోయింది" అని నాని చెప్పారు.

హైదరాబాద్ ఈవెంట్‌కు వస్తుందా?

ది ప్యారడైజ్ చిత్రంలో కాయదు లోహర్‌తో పాటు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సెప్టెంబర్ 21న హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. మరి ప్రమోషన్స్ కు దూరంగా ఉన్న కాయదు.. ఈ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అయినా వస్తుందో లేదో అని ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

నాని కామెంట్స్ తో

చెన్నై ప్రెస్ మీట్‌లో తమిళ మీడియా అడిగిన క్లిష్టమైన ప్రశ్నకు నాని ఇచ్చిన సమాధానం ఆయన సమయస్ఫూర్తిని, ఇతర దర్శకుల పట్ల ఆయనకున్న గౌరవాన్ని చాటుతోందని టాక్. సాధారణంగా ఒక హీరోయిన్ ప్రమోషన్లకు రాకపోతే నిర్మాణ సంస్థతో విభేదాలు ఉన్నాయనో లేదా పారితోషికం సమస్యలనో రకరకాల ఊహాగానాలు మొదలవుతాయి.

అయితే నాని తెలివిగా మారి సెల్వరాజ్ ప్రాజెక్ట్ ప్రస్తావన తీసుకురావడం ద్వారా ఆ పుకార్లకు చెక్ పెట్టడమే కాకుండా, తమిళ మీడియాలో సినిమాపై సానుకూల వాతావరణాన్ని సృష్టించారని చెప్పొచ్చు. తమిళంలో విపరీతమైన క్రేజ్ ఉన్న మారి సెల్వరాజ్ చిత్రంలో కాయదు లోహర్ నటించడం ఆమె కెరీర్‌కు మైలేజ్ ఇవ్వడమే కాకుండా, 'ది పారడైజ్' చిత్రానికి కోలీవుడ్‌లో అదనపు పబ్లిసిటీ తెచ్చిపెడుతుంది.

ది ప్యారడైజ్ రిలీజ్

నాని మరోసారి రా అండ్ రస్టిక్ యాక్టింగ్ తో థియేటర్లను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అతని అప్ కమింగ్ మూవీ ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24న పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానుంది. సాంగ్స్, టీజర్ తో ది ప్యారడైజ్ మూవీపై భారీ హైప్ నెలకొంది. అయితే ట్రైలర్ లేకుండానే ది ప్యారడైజ్ మూవీని రిలీజ్ చేయబోతుండటం గమనార్హం.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More