Srikanth Odela: ప్యారడైజ్ డైెరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్ స్టోరీ తెలుసా? చిరంజీవి స్పెషల్.. రామ్ చరణ్ గిఫ్ట్!

Srikanth Odela: ది ప్యారడైజ్ సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచాడు ఈ డైరెక్టర్. ఈ క్రమంలోనే ఓ డిఫరెంట్ ఇంటర్వ్యూలో తన మెడలోని లాకెట్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు.

Published on: Sep 15, 2026, 06:16:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Srikanth Odela: ‘దసరా' వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న 'ది పారడైజ్' సినిమాపై అంచనాలు పీక్స్ కు చేరాయి. మూవీ రిలీజ్ దగ్గరపడుతుండటంతో టీమ్ ప్రమోషన్లలో స్పీడ్ పెంచింది. ఈ క్రమంలోనే ఓ డిఫరెంట్ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ ఓదెల ఓ విషయాన్ని బయటపెట్టాడు.

ప్యారడైజ్ డైెరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్ స్టోరీ తెలుసా? చిరంజీవి స్పెషల్.. రామ్ చరణ్ గిఫ్ట్!
ప్యారడైజ్ డైెరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్ స్టోరీ తెలుసా? చిరంజీవి స్పెషల్.. రామ్ చరణ్ గిఫ్ట్!

కారులో విలన్ తో

ది ప్యారడైజ్ మూవీలో ప్రముఖ నటుడు, డ్యాన్సర్ రాఘవ్ జుయల్‌ విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అతనితో కలిసి కార్ డ్రైవ్ చేస్తూ శ్రీకాంత్ ఓదెల ఇంటర్వ్యూ షూట్ చేశాడు. ఈ ఇంటర్వ్యూలో రాఘవ్ జుయల్‌తో కలిసి సినిమా విశేషాలే కాకుండా తన సినీ ప్రయాణంలో జరిగిన ఆసక్తికరమైన సంఘటనలను శ్రీకాంత్ పంచుకున్నాడు.

శ్రీకాంత్ ఓదెల లాకెట్ స్టోరీ

డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తన మెడలోని లాకెట్ స్టోరీ గురించి వెల్లడించాడు. 'రంగస్థలం' సినిమాకు సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా కాస్ట్యూమ్స్ విభాగాన్ని పర్యవేక్షించిన శ్రీకాంత్ ఓదెల.. ఆ సినిమా షూటింగ్ చివరి రోజున రామ్ చరణ్ తనకు గిఫ్ట్ ఇచ్చాడని తెలిపాడు.

"రామ్ చరణ్ అన్న కోసం మెగాస్టార్ చిరంజీవి చెన్నైలో ప్రత్యేకంగా ఒక లాకెట్ చేయించారు. రంగస్థలం లాస్ట్ డే షూట్ రోజు చరణ్ అన్న ఆ లాకెట్‌ను నాకు బహుమతిగా ఇచ్చారు. ఆ రోజు నుంచి నేను దానిని ఇప్పటివరకు మెడలో నుంచి తీయలేదు’’ అని శ్రీకాంత్ పేర్కొన్నాడు.

వైరల్ వీడియో

‘‘అయితే, ఈ మధ్యే నేను చరణ్ అన్నను కలిసి ఆ లాకెట్ గురించి మాట్లాడితే.. 'నేను నీకు అది ఇచ్చానా?' అని ఆయన పూర్తిగా మరచిపోయి ఆశ్చర్యపోయారు" అని శ్రీకాంత్ ఓదెల నవ్వుతూ వెల్లడించాడు. శ్రీకాంత్ అభిమానం, చరణ్ ప్రేమతో కూడిన ఈ సరదా ముచ్చట ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

హైప్ పెంచేలా

ఒక యంగ్ డైరెక్టర్ సాధారణ ప్రెస్ మీట్‌లకు భిన్నంగా తన విలన్ (రాఘవ్ జుయల్) తో కలిసి కార్ డ్రైవ్ చేస్తూ క్యాజువల్ ముచ్చట పెట్టడం డిజిటల్ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ఇంటర్వ్యూతో ది ప్యారడైజ్ మూవీపై మరింత హైప్ పెరిగిందనే చెప్పొచ్చు.

రాఘవ్ గురించి

బాలీవుడ్‌లో 'కిల్' (Kill) సినిమాతో విలన్‌గా మెప్పించిన రాఘవ్ జుయల్ ది ప్యారడైజ్ తో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో నానికి విలన్ గా అతను నటించాడు. ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More