Nani Mohan Babu: మోహన్ బాబుపై జోకులేస్తారు గానీ ఆయనతో పనిచేస్తే ప్రేమలో పడిపోతారు, చిన్న పిల్లాడి మనసు: నాని కామెంట్స్

Nani Comments On Mohan Babu The Paradise Press Meet: నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ది ప్యారడైజ్. దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్ ఉండదంటూ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్యారడైజ్ ప్రెస్ మీట్‌లో మోహన్ బాబుపై హీరో నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Published on: Sep 12, 2026, 14:34:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Nani Comments On Mohan Babu The Paradise Press Meet: నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా ‘ది ప్యారడైజ్’. దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ స్థాయిలో నిర్మించారు.

మోహన్ బాబుపై జోకులేస్తారు గానీ ఆయనతో పనిచేస్తే ప్రేమలో పడిపోతారు, చిన్న పిల్లాడి మనసు: నాని కామెంట్స్
మోహన్ బాబుపై జోకులేస్తారు గానీ ఆయనతో పనిచేస్తే ప్రేమలో పడిపోతారు, చిన్న పిల్లాడి మనసు: నాని కామెంట్స్

సెప్టెంబర్ 24న గ్రాండ్ రిలీజ్

ఇప్పటికే విడుదలైన ది ప్యారడైజ్‌లోని ఆయా షేర్, ఏష నాగుల సాంగ్స్, గ్లింప్స్, టీజర్ విడుదలై అద్భుతమైన రెస్పాన్స్‌తో భారీ అంచనాలు పెంచాయి. ది ప్యారడైజ్ సినిమాను సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా తాజాగా మేకర్స్ ది ప్యారడైజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్‌లో ది ప్యారడైజ్ ట్రైలర్ ఉండదని నాని స్పష్టం చేశారు. అలాగే, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో నటించడంపై హీరో నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మోహన్ బాబుతో వర్క్ చేయడం గురించి

మోహన్ బాబు గారితో వర్క్ చేయడం ఎలా ఉందని క్యూ అండ్ ఏ సెషన్‌లో ఓ రిపోర్టర్ అడిగారు. దానికి నాని స్పందిస్తూ.. "మోహన్ బాబు గారి గురించా.. మోహన్ బాబు గారు ఎడోరబుల్ అండి. ఎక్స్‌ట్రీమ్‌లీ ఎడోరబుల్ (ప్రేమించగల వ్యక్తి). ఎంతలా అంటే.. ఆయనకు శ్రీకాంత్ న్యూ ఫేవరెట్ పర్సన్" అని అన్నాడు.

"ఎంత ప్రేమంటే.. నా మీద కూడా చాలా ప్రేమ. నేను లొకేషన్‌కు వెళ్లిన వెంటనే.. ఆయన కూర్చోబెట్టి చెప్పే కబుర్లు గానీ అవి. మనం చాలా అనుకుంటాం కదా. బయట మోహన్ బాబు గారంటే ఇలా. ఆయన చాలా స్ట్రిక్ట్. పాపం ఇంకోటని అదోటని జోక్స్ వేస్తారు. కొన్నిసార్లు సోషల్ మీడియాలో మీమ్స్ అవి చూస్తారు" అని హీరో నాని చెప్పాడు.

పక్కన కూర్చుంటే తెలిసేది అదే

"మోహన్ బాబు గారితో కలిసి టైమ్ స్పెండ్ చేసి, కలిసి వర్క్ చేస్తే మీరు ఆయనతో ప్రేమలో పడిపోతారు (ప్రేమించేస్తారు). మీరు ఆయన గురించి ముందు ఏమైనా అనుకోండి.. మీకు ఎలాంటి అభిప్రాయం ఉన్నా సరే.. ఆయన కొప్పడతారనో.. కొడతాడనో.. ఇంకోటనో.. రకరకాలుగా ఎలాంటి ఒపినీయన్ ఉన్నా సరే ఆయనతో కలిసి పనిచేసి సెట్‌లో ఆయన పక్కన కూర్చుంటే తెలిసేదంటే చాలా.. చిన్నపిల్లాడి మనసు ఆయనది" అని నాని వెల్లడించాడు.

"మీకు ఆయనలోని కొత్త కోణం అర్థమైపోతుంది. అప్పుడు మీరు మోహన్ బాబుని మోహన్ బాబులా చూడలేరు" అని హీరో నాని చెప్పుకొచ్చాడు. దీంతో ప్రస్తుతం హీరో నాని కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

డ్యాన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు

అలాగే, "ఈ సినిమాలో మీరు ఎప్పుడూ లేనంతగా డ్యాన్స్ వేశారు కదా? దాని గురించి చెప్పండి?" అని అడిగినప్పుడు.. "‘ఆయా షేర్’లో ఫ్లోర్ మూమెంట్ కోసం చాలా కష్టపడ్డాను. ఇంతకుముందు నేను ఎప్పుడూ డాన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు. నా సినిమాల్లో డాన్సింగ్ సాంగ్స్ ఎక్కువ ఉండవు. అన్నీ సిచ్యువేషనల్ సాంగ్స్" అని నాని తెలిపాడు.

"ఇందులో రెండు డాన్స్ నంబర్స్‌కి ఆడియన్స్ అద్భుతంగా రిసీవ్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. పాటల విషయంలో శ్రీకాంత్‌కి చాలా మంచి టేస్ట్ ఉంది. సెలబ్రేట్ చేసుకునే పాటలు తీసుకోవడంలో తనది చాలా మంచి అభిరుచి ఉంది. ఈ రెండు పాటలు కూడా చాలా స్పెషల్ కేర్ తీసుకొని చేయించాడు" అని హీరో నాని పేర్కొన్నాడు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More