Nani: చిన్నోడు.. బక్కోడు.. మీవోడు.. అనిరుధ్ లాంటోడు ఇంతకుముందు లేరు, ఇకముందు ఉండరు.. దిష్టి తీయాలి.. నాని కామెంట్స్
Nani Comments In Yesha Nagula Song Launch: నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ది ప్యారడైజ్. తాజాగా అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన అనిరుధ్ రవిచందర్ కాన్సర్ట్‌లో ది ప్యారడైజ్ సినిమాలోని ఏష నాగుల సాంగ్‌ను విడుదల చేశారు. ఈ ఈవెంట్‌లో నాని చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Nani Comments In Yesha Nagula Song Launch: నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ది ప్యారడైజ్. ఈ సినిమాకు దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. దసరా తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ది ప్యారడైజ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.

విలన్‌గా కలెక్షన్ కింగ్
అందులోనూ ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విలన్‌గా చేస్తున్నారనే విషయం తెలియడంతో మరింత హైప్ పెరిగింది. అంతేకాకుండా కాసర్ల శ్యామ్ రాసిన ఆయా షేర్ సాంగ్ విడుదల అయ్యాక నెక్ట్స్ లెవెల్ రేంజ్‌లో ది ప్యారడైజ్ మూవీపై అంచనాలు పెరిగాయి.
ఆకాశాన్ని తాకేలా అంచనాలు
ఇవేకాదు సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, ది ప్యారడైజ్ టీజర్, గ్లింప్స్, డైలాగ్స్, అన్ని ఈ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ ఆకాశాన్ని తాకేలా చేశాయి. ఇక గత కొద్ది రోజుల నుంచి తెలంగాణలో సూపర్ హిట్ అయిన మరో ఫోక్ సాంగ్ ఏష నాగుల కట్ట మీద పాటను ది ప్యారడైజ్‌లో పెట్టారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ఏష నాగుల కట్ట మీద సాంగ్ రిలీజ్
తాజాగా ఆ సాంగ్‌ను విడుదల కూడా చేశారు. అమెరికాలోని డల్లాస్‌లో అనిరుధ్ రవిచందర్ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ జరిగింది. ఈ ఈవెంట్‌లో ది ప్యారడైజ్ రెండో సింగిల్ ఏష నాగుల కట్ట మీద సాంగ్‌ను అనిరుధ్ విడుదల చేశాడు. అంతేకాకుండా స్టేజీపై పాట పాడుతూ, డ్యాన్స్ చేస్తూ అభిమానులను తెగ ఎంటర్‌టైన్ చేశాడు అనిరుధ్.
నాని మాస్ ఎంట్రీ
సాంగ్ లాంచ్ తర్వాత హీరో నాని స్టేజీపైకి సడెన్ ఎంట్రీ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. రెండు రెక్కలు ఉన్న బ్లాక్ జాకెట్‌తో మాసీగా స్టేజీపైకి హీరో నాని ఇచ్చిన ఎంట్రీ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఏష నాగుల కట్ట మీద పాటకు అనిరుధ్ రవిచందర్‌తో కలిసి నాని మాస్ డ్యాన్స్ వేశాడు.
నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దాంతో స్టేజ్ అంతా హోరెత్తిపోయింది. ఏష నాగుల కట్ట మీద సాంగ్ లాంచ్, నాని డ్యాన్స్ తర్వాత అందరిని ఉద్దేశించి నేచురల్ స్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇప్పుడు అమెరికా స్టేజీపై నాని చేసిన కామెంట్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.
మనది చాలా లక్కీ జెనరేషన్
"అనిరుధ్ లాంటి వాళ్లు ఇంతకుముందు లేరు, ఇకముందు ఉండరు. కేవలం మనకు మాత్రమే అనిరుధ్ ఉన్నాడు. మనది చాలా లక్కీ జెనరేషన్" అని నాని అన్నాడు. దాంతో స్టేజ్ అంతా హోరెత్తిపోయింది. నాని కాళ్లకు అనిరుధ్ నమస్కారం చేయబోయాడు.
చిన్నోడు.. బక్కోడు..
"శ్రీకాంత్.. అని.. నేను.. ప్యారడైజ్‌తో థియేటర్లలో కలుసుకుందాం. చిన్నోడు (శ్రీకాంత్ ఓదెల).. బక్కోడు (అనిరుధ్ రవిచందర్).. మీవోడు (నాని)" అని నాని అనగానే డల్లాస్ స్టేజ్ అంతా అరుపులతో హోరెత్తింది. నాని మాటలకు అనిరుధ్ నవ్వాడు.
మనందరికి దిష్టి తీయాలి
"నేను ఇప్పుడు ఒక పని చేస్తాను. నాతోపాటు చేస్తారా. ఇంత బ్యూటిఫుల్ ఈవెనింగ్ ఎంజాయ్ చేసిన మనందరికి దిష్టి తీయాలి. అంతే కదా" అని నాని అన్నాడు. దానికి అంతా సరేనని కేకలు పెట్టారు. నాతోపాటు మీరందరూ చెప్పండి అని.. ది ప్యారడైజ్ సినిమాలోని దిష్టి తీసే డైలాగ్ చెప్పించాడు హీరో నాని.
నల్లికుట్లోని దిష్టి
నల్లికుట్లోని దిష్టి అన్నప్పుడు అనిరుధ్ తలపై చేత్తో నాని అనడంతో అంతా నవ్వారు. బెదురుగుడ్లోని దిష్టి అన్నప్పుడు తనపై తిప్పుకున్నాడు నాని. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


