Nani Esha Nagula Katta Meedha: నాని ది ప్యారడైజ్‌లో మరో తెలంగాణ ఫోక్ సాంగ్- కీర్తి సురేష్‌తోనే ఏష నాగుల కట్ట మీద పాట?

Nani The Paradise Esha Nagula Katta Meedha Song: నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న 'ది ప్యారడైజ్' సినిమాలో ఇప్పటికే ఆయా షేర్ సాంగ్ బీభత్సం సృష్టించింది. ఇప్పుడు మరో తెలంగాణ నాటు రా ఫోక్ సాంగ్ "ఏష నాగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల" కూడా ఈ మూవీలో ఉందని క్లారిటీ వచ్చేసింది.

Published on: Aug 20, 2026, 13:48:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Nani The Paradise Esha Nagula Katta Meedha Song With Keerthy Suresh: ‘దసరా’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల జాతర సృష్టించిన నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న రెండో ప్రతిష్టాత్మక చిత్రం 'ది ప్యారడైజ్'. మాస్, రా అండ్ రస్టిక్ యాక్షన్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రకటన వెలువడిన నాటి నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

నాని ది ప్యారడైజ్‌లో మరో తెలంగాణ ఫోక్ సాంగ్- కీర్తి సురేష్‌తోనే ఏష నాగుల కట్ట మీద పాట?
నాని ది ప్యారడైజ్‌లో మరో తెలంగాణ ఫోక్ సాంగ్- కీర్తి సురేష్‌తోనే ఏష నాగుల కట్ట మీద పాట?

'ఏష నాగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల'.. జానపద టచ్!

ఇటీవల విడుదలైన దసరా టీజర్, ఫస్ట్ సింగిల్ సాంగ్ 'ఆయా షేర్' (Aaya Sher) సోషల్ మీడియాలో వ్యూస్ తుఫాను సృష్టిస్తున్నాయి. పక్కా తెలంగాణ మాండలికంలో కంపోజ్ చేసిన ఆయా షేర్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. అయితే, ఇప్పుడు దసరా సినిమాలో మరో తెలంగాణ ఫోక్ సాంగ్‌ను రెండో పాటగా విడుదల చేయనున్నారు మేకర్స్.

ఈ సినిమాలో తెలంగాణ నెటివిటీ, నేటివ్ కల్చర్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అందులో భాగంగానే "ఏష నాగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల" అంటూ సాగే తెలంగాణ నాటు జానపద యాసతో ఉన్న సాంగ్‌ను దసరాలో పెడుతున్నట్లు సమాచారం.

ఆడియో లీక్

అంతేకాకుండా ది ప్యారడైజ్ సినిమా నుంచి ఈ ఏష నాగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల పాటకు సంబంధించిన ఆడియో లీక్ అయిందని నెట్టింట్లో జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో తెలంగాణ ఆడియెన్స్, ఫోక్ సాంగ్ లవర్స్ అంతా తెగ వైబ్ అవుతున్నారు. కానీ, ఇంతలా అంచనాలు పెట్టుకుంటున్న ఈ సాంగ్ దసరాలో ఉందా లేదే అనే డౌట్ కూడా అందరిని వెంటాడుతోంది.

"రాంగ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఏమైనా సెట్ చేశామా?" అని ప్రముఖ లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్‌కు ఓ ఫ్యాన్ ట్వీట్ చేశాడు. దానికి ఆయన రిప్లై ఇవ్వడం ఇప్పుడు వైరల్‌గా మారింది. "ఈ సాంగ్ ఉంది కానీ మొత్తం పాట ఇది కాదు. నేను సొంతగా రాసిన లిరిక్స్‌తో ఉంటుంది. నన్ను నమ్మండి మీరంతా ఒక నెక్ట్స్ లెవెల్‌లో వైబ్ అయ్యేలా ఉంటుంది. కిర్రెక్కించే లిరిక్స్ వేరేలా ఉన్నాయి" అని గేయ రచయిత కాసర్ల శ్యామ్ క్లారిటీ ఇచ్చారు.

హుక్ లైన్ మాత్రమే

ప్యారడైజ్ మూవీకి, సిచ్యువేషన్‌కు తగినట్లు లిరిక్స్ మార్చేసి కేవలం ఆ ఏష నాగుల కట్ట మీద అనే హుక్ లైన్ మాత్రమే తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, లీకైన ఆ ఆడియోలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ నెక్ట్స్ లెవెల్ బీట్స్ కొట్టాడని అంటున్నారు. అంతెకాకుండా ఆ ఆగస్ట్ నెల చివరి లోపు ఆ పాటపై అప్డేట్ కూడా ఇస్తారని కూడా మేకర్స్ చెప్పారు.

ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ది ప్యారడైజ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2026 సెప్టెంబర్ 24న థియేటర్లలోకి రానుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో అత్యంత గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఏష నాగుల కట్ట మీద సాంగ్‌పై పాటల రచయిత కాసర్ల శ్యామ్ ట్వీట్
ఏష నాగుల కట్ట మీద సాంగ్‌పై పాటల రచయిత కాసర్ల శ్యామ్ ట్వీట్

కీర్తి సురేష్ ఐటమ్ సాంగ్

ఇక ది ప్యారడైజ్ సినిమాలో నానితోపాటు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, కయాదు లోహర్, సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాకుండా మహానటి కీర్తి సురేష్ ఓ ఐటమ్ సాంగ్‌లో ఆడిపాడనుందని టాక్ వినిపించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఏష నాగుల కట్ట మీద వేసిన ఊయల అనే పాట కీర్తి సురేష్‌తోనే ఉంటుందని కొత్త ఊహగాహానాలు వ్యక్తమవుతున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More