Keerthy Suresh Paradise: నాని ది ప్యారడైజ్‌లో కీర్తి సురేష్ ఐటమ్ సాంగ్.. భారీ సెట్‌లో 100 మంది డ్యాన్సర్లతో షూటింగ్!
Keerthy Suresh Song In The Paradise: నేచురల్ స్టార్ నాని, మహానటి కీర్తి సురేష్ కాంబినేషన్ హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమైంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలోని పాన్ ఇండియా చిత్రం 'ది ప్యారడైజ్'లో కీర్తి సురేష్ స్పెషల్ ఐటమ్ సాంగ్‌లో సందడి చేయనుందని టాక్ నడుస్తోంది. ఇందుకోసం భారీ సెట్ వేసినట్లు సమాచారం.
Keerthy Suresh Song In Nani The Paradise: 'నేను లోకల్', 'దసరా' చిత్రాలతో వెండితెరపై తిరుగులేని కెమిస్ట్రీతో అలరించిన నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ కాంబో మరోసారి ప్రేక్షకులను మైమరిపించడానికి సిద్ధమవుతోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటిస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'ది ప్యారడైజ్' (The Paradise).

బాక్సాఫీస్ వద్ద దసరా సంచలనం
ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటున్న ది ప్యారడైజ్ సినిమాలో టాలీవుడ్ మహానటి కీర్తి సురేష్ ఒక ప్రత్యేక గీతంలో మెరవనుంది. గతంలో నాని, కీర్తి సురేష్, శ్రీకాంత్ ఓదెల ముగ్గురి కలయికలో వచ్చిన 'దసరా' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడంతో, ఈ సరికొత్త కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
హైదరాబాద్‌లో భారీ సెట్.. 1000 మందితో హంగామా!
హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్‌లో జూలై 28 నుంచి ఈ ఐటమ్ సాంగ్ షూటింగ్ ప్రారంభించనున్నారని సమాచారం. దాదాపు 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు, నృత్య కళాకారులతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మాస్ నెంబర్‌ను తెరకెక్కించేందుకు చిత్ర బృందం ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఆట సందీప్ కొరియోగ్రఫీ
ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ ఆట సందీప్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందిస్తుండగా, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఎనర్జిటిక్ ట్యూన్‌ను సమకూర్చారు. 'దసరా'లో 'చంకీల అంగీలేసి' పాటతో అలరించిన ఈ కాంబో, ఇప్పుడు మరోసారి థియేటర్లలో ఈనాటి మాస్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది.
నానితో స్నేహం.. ప్రాజెక్ట్‌లోకి కీర్తి ప్రవేశం
తెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ నాని, కీర్తి సురేష్ మంచి స్నేహితులు. ఇటీవల జరిగిన కీర్తి వివాహ వేడుకకు హాజరైన అతికొద్ది మంది సన్నిహితులలో నాని ఒకరు. వీరిద్దరి మధ్య ఉన్న ఆత్మీయ బంధం, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల విజన్ ఈ సినిమాలో ప్రత్యేక పాత్ర పోషించేందుకు కీర్తిని ఒప్పించాయి.
సెప్టెంబర్‌లో రిలీజ్
శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ది ప్యారడైజ్ సినిమా నాని కెరీర్‌లోనే అతిపెద్ద ప్రాజెక్ట్‌గా రాబోతోంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2026 సెప్టెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
టాలీవుడ్‌లో కీర్తి సురేష్ జోరు
ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో ఎంతో బిజీగా ఉన్నారు. విజయ్ దేవరకొండ సరసన 'రౌడీ జనార్దన' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో రాబోతున్న మల్టీస్టారర్ చిత్రంలోనూ కీర్తి సురేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
హీరోయిన్‌గా చేస్తూనే
ఒకవైపు నాయిక ప్రాధాన్యమున్న సినిమాలు చేస్తూనే, మరోవైపు స్టార్ హీరోల చిత్రాల్లో ప్రత్యేక మెరుపులు మెరిపిస్తూ టాలీవుడ్‌లో తన హవా కొనసాగిస్తున్నారు బ్యూటిఫుల్ కీర్తి సురేష్.
నాని, కీర్తి సాంగ్ క్రేజ్
ఇదిలా ఉంటే, నాని ప్యారడైజ్ సినిమాలోని ఆయా షేర్ సాంగ్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. ఏకంగా 200 మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్ ట్రెండింగ్ సాంగ్స్‌లో ఆయా షేర్ పాట స్థానం సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో నాని, కీర్తి సురేష్ కాంబోతో వచ్చే ఐటమ్ సాంగ్ ఎలాంటి క్రేజ్, రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


