ఓటీటీలోకి నిన్నే వచ్చిన తెలుగు డాక్యుమెంటరీ చిత్రం- దసరా పండుగపై 40 నిమిషాల సమాచారం- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలోకి తెలుగు డాక్యుమెంటరీ సినిమా ప్రొద్దుటూరు దసరా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. దసరా పండుగ విశిష్టతను, సంస్కృతిని చాటిచెబుతూ తెరకెక్కించిన డాక్యుమెంటరీ ఇది. 40 నిమిషాల రన్‌టైమ్‌తో బాల్కనీ ఒరిజినల్స్ ప్రేమ్ కుమార్ వలపల నిర్మించిన ప్రొద్దుటూరు దసరా ఓటీటీ రిలీజ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Nov 8, 2025, 20:40:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలో డిఫరెంట్ కంటెంట్ సినిమాలు ప్రతివారం స్ట్రీమింగ్ అవుతూనే ఉన్నాయి. ఇక తెలుగులో అన్ని రకాల జోనర్స్‌ను టచ్ చేస్తూ మేకర్స్ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అయితే, సినిమాలు, వెబ్ సిరీస్‌లు మాత్రమే కాకుండా డాక్యుమెంటరీ సినిమాలు సైతం తెలుగులో ఓటీటీ ప్రీమియర్ అవుతున్నాయి.

ఓటీటీలోకి నిన్నే వచ్చిన తెలుగు డాక్యుమెంటరీ చిత్రం- దసరా పండుగపై 40 నిమిషాల సమాచారం- స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి నిన్నే వచ్చిన తెలుగు డాక్యుమెంటరీ చిత్రం- దసరా పండుగపై 40 నిమిషాల సమాచారం- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఘనంగా జరుపుకునే పండుగ

తెలుగు వారి సంస్కృతి, పండుగలు, వైవిధ్యం, విశిష్టతను చాటి చెప్పేందుకు ఈ డాక్యుమెంటరీలను మేకర్స్ రూపొందిస్తున్నారు. అలా తాజాగా ఓటీటీలోకి ఓ తెలుగు డాక్యుమెంటరీ సినిమా వచ్చేసింది. అది కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా జరుపుకునే దసరా పండుగపైన ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించారు.

ప్రొద్దుటూరుకు ప్రత్యేక స్థానం

అయితే, తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ప్రాంతంలో దసరా ఉత్సవాలను కన్నుల పండుగగా జరుపుకుంటారు. అలా దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకునే ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రొద్దుటూరుకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే దసరా ఉత్సవాలు కళాత్మకంగా, భక్తి శ్రద్ధలో నిండిపోయి ప్రజలందరని ఆకర్షిస్తుంటాయి.

ఓటీటీ డాక్యుమెంటరీ

ఇలాంటి ఉత్సవాన్ని మరింత మందికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో తెరకెక్కించిన ఓటీటీ డాక్యుమెంటరీనే ప్రొద్దుటూరు దసరా. ఈ డాక్యుమెంటరీకి డైరెక్టర్ మురళీ కృష్ణ తుమ్మ దర్శకత్వం వహించారు. బాల్కనీ ఒరిజినల్స్ బ్యానర్‌పై ప్రేమ్ కుమార్ వలపల నిర్మించారు.

అక్టోబర్ 31న థియేటర్లలో

కేవలం 40 నిమిషాలు పాటు సాగే ఈ డాక్యుమెంటరీ ప్రొద్దుటూరులో జరిగే దసరా వైభవాన్ని తెలియజేసేలా చిత్రీకరించారు. అయితే, అక్టోబర్ 31న ఈ ప్రొద్దుటూరు దసరా సినిమాను థియేటర్లలో రిలీజ్ చేశారు. దానికి మంచి స్పందన లభించింది. దసరా సంబురాలు, ప్రజల సాంప్రదాయాలు, సంస్కృతి అన్నింటి సమాచారాన్ని 40 నిమిషాల్లో చూపించారు.

ఓటీటీ ఆడియెన్స్‌కు చేరేలా

ఇలాంటి ప్రొద్దుటూరు దసరా డాక్యుమెంటరీని ఓటీటీ ఆడియెన్స్‌కు చేరువ చేసేందుకు తాజాగా డిజిటల్ స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చారు మేకర్స్.ప్రముఖ తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో ప్రొద్దుటూరు దసరా ఓటీటీ రిలీజ్ అయింది.

ప్రొద్దుటూరు దసరా ఓటీటీ రిలీజ్

నవంబర్ 7 అంటే నిన్నటి నుంచి తెలుగులో ఈటీవీ విన్‌లో ప్రొద్దుటూరు దసరా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. హై టెక్నికల్ క్వాలిటీతో ఈ డాక్యుమెంటరీని చిత్రీకరించారు. అందమైన విజువల్స్‌తో వేడుకలను చూపించారు. ఇక దసరా వైభవం గురించి ఒక్కొక్కరు చెప్పడం ఇంట్రెస్ట్‌ను కలుగ జేస్తుంది.

మరిన్ని ఓటీటీ సినిమాలు

ఇకపోతే బాల్కని ఒరిజినల్ బ్యానర్‌పై రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలు డాక్యుమెంటరీలు రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ డాక్యుమెంటరీ సినిమాకు స్టార్ సర్కిల్స్ డిజిటల్ ప్రమోషన్స్ చేస్తుండగా కిలారి సుబ్బారావు పీఆర్‌వోగా చేస్తున్నారు. ప్రొద్దుటూరు దసరా ఓటీటీ డాక్యుమెంటరీని మరింత మందికి చేరేలా పీఆర్‌వో నుంచి మేకర్స్ వరకు ప్రయత్నిస్తున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More