The Paradise Tickets: లక్ష టికెట్లు సైలెంట్‌గా ఖాళీ- నైజాంలో నాని ఆల్ టైమ్ బాక్సాఫీస్ రికార్డ్.. ది ప్యారడైజ్ బుకింగ్స్!
The Paradise Tickets: నేచురల్ స్టార్ నాని అప్ కమింగ్ మూవీ ‘ది ప్యారడైజ్’ అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డులు తిరగరాస్తోంది. ఈ సినిమా నైజాం ఏరియా అడ్వాన్స్ బుకింగ్స్‌లో సునామీ సృష్టిస్తోంది. పరిమిత రేట్లతో ఓపెన్ అయిన బుకింగ్స్‌లో కేవలం కొద్ది సమయంలోనే 1 లక్షకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి.
The Paradise Tickets: సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న 'ది ప్యారడైజ్' మూవీ బాక్సాఫీస్ వద్ద రిలీజ్‌కు ముందే రికార్డుల వేట మొదలుపెట్టింది. నైజాం రీజియన్‌లో ప్రభుత్వం కేటాయించిన పరిమిత టికెట్ ధరల పెంపుతో అడ్వాన్స్ బుకింగ్స్ షురూ అవ్వగా, ఆడియన్స్ నుంచి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వచ్చింది.

ది ప్యారడైజ్ అడ్వాన్స్ బుకింగ్స్
నేచురల్ స్టార్ నాని మాస్ క్రేజ్‌తో ది ప్యారడైజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జోరు కొనసాగుతోంది. ఓపెన్ అయిన క్షణాల్లోనే హౌస్‌ఫుల్ బోర్డులు పడ్డాయి.
ఇప్పటివరకు ఏకంగా 1 లక్షకు పైగా టికెట్లు సోల్డ్ అవుట్ కావడం విశేషం. అంతే కాకుండా ఒక్క నైజాం ప్రాంతంలోనే రూ.10 కోట్ల అడ్వాన్స్ గ్రాస్ కలెక్షన్స్ నమోదు చేసి నాని తన ఆల్ టైమ్ బాక్సాఫీస్ స్టామినాని మరోసారి నిరూపించుకున్నారు.
నేడే గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్
సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో, ప్రతిష్టాత్మక కాన్వాస్‌పై నిర్మించిన ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో కాయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడటంతో ప్రమోషన్స్ జోరు పెంచిన మేకర్స్, ఇవాళ (సెప్టెంబర్ 21) సాయంత్రం భారీ ఎత్తున ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు.
ఈ ప్రమోషనల్ హడావుడికి మరింత హైప్ ఇస్తూ, మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ కంపోజ్ చేసిన మూడో సింగిల్ "అంజనా అంజని" మెలోడీ ట్రాక్‌ను ఈరోజు ఈవెంట్‌లో అధికారికంగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన యాక్షన్ ప్రోమోలకు తోడు ఈ లవ్ మెలోడీ కూడా తోడైతే సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లడం ఖాయం.
రికార్డు ఓపెనింగ్స్
అతిగా పెంచిన టికెట్ ధరల వల్ల మాస్ ఆడియన్స్ థియేటర్లకు దూరం అవుతున్న ఈ రోజుల్లో, 'ది ప్యారడైజ్' చిత్రబృందం ఎంచుకున్న రీజనబుల్ టికెట్ ప్రైసింగ్ మోడల్ అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. ఆకాశాన్ని తాకే రేట్లు పెట్టకుండా లిమిటెడ్ హైక్స్ ఇవ్వడం వల్ల ఆడియన్స్ థియేటర్లో మూవీ చూసేందుకు ఎగబడుతున్నారు.
మాస్ పవర్
'దసరా' సినిమాతో తెలంగాణ పల్లె నేపథ్యం ఉన్న రా అండ్ రస్టిక్ మాస్ సినిమాలకు నాని ఒక పవర్ హౌస్‌గా మారారు. ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల వరల్డ్ బిల్డింగ్, అనిరుధ్ హై-వోల్టేజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కాయదు లోహర్ స్క్రీన్ ప్రెజెన్స్ కలసి ది ప్యారడైజ్ ను మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చాయి.
ప్రస్తుత ట్రెండ్ చూస్తే ది ప్యారడైజ్ మూవీ నైజామ్ బిజినెస్ నెట్‌వర్క్‌లో మునుపెన్నడూ లేని బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే నంబర్స్‌ను రాబట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మొదటి రోజే నిజాంలోనే కాకుండా ఓవర్సీస్, పాన్-ఇండియా మార్కెట్లలో 'ది ప్యారడైజ్' రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టడం ఖాయమని చెప్పొచ్చు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


