The Paradise Record: ది ప్యారడైజ్ రికార్డు..చిరంజీవి, ప్రభాస్, రామ్ చరణ్ కు సాధ్యం కానిది సాధించిన నాని..రూ.100 కోట్లు!
The Paradise Record: నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన 'ది ప్యారడైజ్' చిత్రం రికార్డులు తిరగరాస్తోంది. 2026లో చిరంజీవి, రామ్ చరణ్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలకు సాధ్యం కాని రికార్డును ఈ మూవీతో నాని అందుకున్నాడు. ఆ రికార్డు వివరాలపై ఓ లుక్కేయండి.
The Paradise Record: ది ప్యారడైజ్ మూవీ థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. 'దసరా' వంటి భారీ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత నాని- శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ రిపీట్ కావడంతో ఈ సినిమాపై ముందస్తుగానే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే విడుదలైన మొదటి రోజే ఈ మూవీ రికార్డులు ఖాతాలో వేసుకుంటోంది.

ది ప్యారడైజ్ రికార్డు
బుక్ మై షో (Book My Show), డిస్ట్రిక్ట్ యాప్‌లలో ముందస్తు టికెట్ బుకింగ్స్‌లో 'ది ప్యారడైజ్' సరికొత్త చరిత్ర సృష్టించింది. బుక్ మై షో, డిస్ట్రిక్ట్ వేదికల్లో కలిపి ఏకంగా 1.8 మిలియన్ల (18 లక్షలు) కంటే ఎక్కువ టిక్కెట్లు అడ్వాన్స్ గా అమ్ముడయ్యాయి. ఈ ఘనతతో 2026లో అత్యధిక ప్రీ-సేల్స్ సాధించిన తెలుగు చిత్రంగా 'ది ప్యారడైజ్' మొదటి స్థానంలో నిలిచింది.
నాని జోరు
2026లో చిరంజీవి (మన శంకర వరప్రసాద్ గారు), ప్రభాస్ (ది రాజాసాబ్), రామ్ చరణ్ (పెద్ది)కు సాధ్యం కాని రికార్డును ది ప్యారడైజ్ మూవీతో నాని అందుకున్నాడు. ఈ ఏడాది అత్యధిక ప్రీ సేల్స్ సాధించిన సినిమాకు హీరోగా నాని రికార్డు ఖాతాలో వేసుకున్నాడు.
ప్రస్తుతం ది ప్యారడైజ్ సినిమాకు బుక్ మై షోలో గంటకు దాదాపు 24 వేల టిక్కెట్లు అమ్ముడవుతుండటం విశేషం. ఈ సినిమాకి నమోదైన అత్యధిక గంటల బుకింగ్ రేటు ఇదే కావడం గమనార్హం. మిగిలిన ప్రాంతాల్లో కూడా ప్రదర్శనల సంఖ్య పెరిగే కొద్దీ ఈ సంఖ్య మరింతగా పుంజుకునే అవకాశం ఉంది.
రూ.100 కోట్లు ఖాయమేనా?
ఎస్‌ఎల్‌వి సినిమాస్ (SLV Cinemas) బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ ది ప్యారడైజ్ చిత్రాన్ని నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించిన ప్రీమియర్ షోల నుంచే ఈ సినిమాపై బజ్ పెరిగింది. తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవిదేశాల్లోని ప్రధాన కేంద్రాల్లో థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ బోర్డులతో దర్శనమిచ్చాయి.
నిర్మాతలు వెల్లడించిన ప్రారంభ వివరాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రీ-సేల్స్ ద్వారానే ఇప్పటికే రూ.60 కోట్ల మార్కును అధిగమించింది. ఇక ప్రీమియర్ షోలు, ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్స్ కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసే దిశగా పయనిస్తోందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఓవర్సీస్ లోనూ
ఓవర్సీస్‌లోనూ నాని తన బాక్సాఫీస్ స్టామినాను మరోసారి నిరూపించుకున్నారు. కేవలం ఉత్తర అమెరికాలోనే ముందస్తు బుకింగ్స్ ద్వారా $1.4 మిలియన్ల (దాదాపు రూ.11 కోట్లకు పైగా) గ్రాస్ వసూలు చేసిన ది ప్యారడైజ్ సరికొత్త మైలురాయిని అందుకుంది.
నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్
ఈ స్థాయిలో భారీ వసూళ్లను రాబట్టడంతో ది ప్యారడైజ్ నాని సినీ కెరీర్‌లోనే అత్యంత పెద్ద థియేట్రికల్ ఓపెనింగ్‌గా నిలవనుంది. వైవిధ్యమైన కథాంశం, భారీ నటీనటులు, ఉత్కంఠభరితమైన సన్నివేశాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి. మొదటి రోజే ఊహించని రేంజ్‌లో వసూళ్లు సాధించిన ‘ది ప్యారడైజ్’కు మిక్స్ డ్ టాక్ వినిపిస్తోంది. రాబోయే వీకెండ్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


