Hanuman Ansh: ఆదర్శ కుటుంబం వర్సెస్ హనుమాన్ అంశ్..ఒకే రోజు థియేటర్లకు..రిలీజ్ చేసేది త్రివిక్రమ్ కాదు..అసలేం జరిగింది?

Hanuman Ansh: చిన్న సినిమాగా రిలీజై బాక్సాఫీస్ ను షేక్ చేస్తూనే ఉన్న మూవీ ‘హనుమాన్ అంశ్’. కేవలం రూ.2 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే రూ.400 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. తాజాగా ఈ మూవీ తెలుగు రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. ఆదర్శ కుటుంబం సినిమాతో ఇది తలపడనుంది.

Published on: Oct 2, 2026, 13:38:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Hanuman Ansh Telugu Release Date: తెలుగు సినీ లవర్స్ కు ఓ గుడ్ న్యూస్. కానీ త్రివిక్రమ్, వెంకటేష్ ఫ్యాన్స్ కు మాత్రం బ్యాడ్ న్యూస్. తెలుగు జనాలు చాలా కాలం నుంచి బ్లాక్ బస్టర్ మూవీ ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ తెలుగు రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది.

ఆదర్శ కుటుంబం వర్సెస్ హనుమాన్ అంశ్..ఒకే రోజు థియేటర్లకు..రిలీజ్ చేసేది త్రివిక్రమ్ కాదు..అసలేం జరిగింది?
ఆదర్శ కుటుంబం వర్సెస్ హనుమాన్ అంశ్..ఒకే రోజు థియేటర్లకు..రిలీజ్ చేసేది త్రివిక్రమ్ కాదు..అసలేం జరిగింది?

హనుమాన్ అంశ్ తెలుగు రిలీజ్ డేట్

కేవలం రూ.2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన హనుమాన్ అంశ్ రూ.400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఆగస్టు 7న హిందీలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 9న తెలుగులో రిలీజ్ చేస్తున్నట్లు హోంబలే ఫిల్మ్స్ ఇవాళ (అక్టోబర్ 2) ప్రకటించేసింది.

ఆదర్శ కుటుంబంతో ఢీ

హనుమాన్ అంశ్ తెలుగు రిలీజ్ డేట్ ఎట్టకేలకు వచ్చింది. కానీ, ఆ మూవీ త్రివిక్రమ్- వెంకటేష్ కాంబినేషన్లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’తో బాక్సాఫీస్ దగ్గర తలపడనుంది. భారీ అంచనాలతో వస్తున్న ఆదర్శ కుటుంబం కూడా అక్టోబర్ 9న థియేటర్లకు రాబోతుంది.

ఫస్ట్ త్రివిక్రమే

హనుమాన్ అంశ్ తెలుగు రిలీజ్ కోసం ఫస్ట్ ట్రై చేసింది డైరెక్టర్ త్రివిక్రమే. ఆయన ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తన సొంత ప్రొడక్షన్ హౌస్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై ఈ మూవీని తెలుగులో సెప్టెంబర్ 18న రిలీజ్ చేస్తామని ప్లాన్ చేశారు.

టీజర్ రిలీజ్, మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా త్రివిక్రమ్ ప్లాన్ చేశారు. కానీ ఏమైందో తెలీదు సడెన్ గా ఈ ఈవెంట్లను క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు చూస్తే అసలు ఈ ప్రాజెక్టులోనే త్రివిక్రమ్ పేరు లేదు.

హోంబలే ఫిల్మ్స్

ఇప్పుడు హనుమాన్ అంశ్ సినిమాను తెలుగులో హోంబలే ఫిల్మ్స్ రిలీజ్ చేయనుంది. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి త్రివిక్రమ్ తప్పుకోవడం వెనుక ఆదర్శ కుటుంబం మూవీనే కారణమనే టాక్ వినిపిస్తోంది. తన సొంత సినిమా అయిన ఆదర్శ కుటుంబం మీద ఎఫెక్ట్ పడుతుందని త్రివిక్రమ్ భావించారని తెలిసింది.

కానీ, ఇప్పుడేమో అసలుకే ఎసరన్నట్లు ఆదర్శ కుటుంబం రిలీజ్ రోజే హనుమాన్ అంశ్ ను విడుదల చేస్తున్నారు. చిన్న సినిమాగా వచ్చి సంచలనం క్రియేట్ చేసిన హనుమాన్ అంశ్ మూవీపై తెలుగు ఆడియన్స్ లోనూ మంచి బజ్ ఉంది. ఈ నేపథ్యంలో హనుమాన్ అంశ్ కారణంగా ఆదర్శ కుటుంబం మూవీకి గట్టి దెబ్బ తగిలే ప్రమాదం ఉందనే టాక్ వినిపిస్తోంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More