Narayanamma Song: డింపుల్ హయాతి గ్లామర్ ప్లస్ మాస్.. అదిరిపోయిన ‘ఆదర్శ కుటుంబం’ నారాయణమ్మ సాంగ్.. వెంకటేష్ ఏమన్నారంటే?

Narayanamma Song: ఆదర్శ కుటుంబంపై హైప్ పెంచేలా.. మూవీ క్రేజ్ మరో లెవల్ కు తీసుకెళ్లేలా కొత్త సాంగ్ వచ్చేసింది. ‘నారాయణమ్మ’ అంటూ సాగుతున్న మాస్ బీట్ ఇవాళ రిలీజైంది. ఇందులో డింపుల్ హయాతి తన గ్లామర్ ప్లస్ మాస్ డ్యాన్స్ తో అదరగొట్టింది. ఈ సాంగ్ లాంఛ్ ఈవెంట్లో వెంకటేష్ స్పీచ్ కూడా వైరల్ గా మారింది. 

Published on: Sep 27, 2026, 21:51:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Narayanamma Song: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఆదర్శ కుటుంబం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'నారాయణమ్మ' ఈ రోజు (సెప్టెంబర్ 27) విడుదలయ్యింది. ఈ సాంగ్ ఇన్ స్టంట్ హిట్ గా మారింది.

డింపుల్ హయాతి గ్లామర్ ప్లస్ మాస్.. అదిరిపోయిన ‘ఆదర్శ కుటుంబం’ నారాయణమ్మ సాంగ్.. వెంకటేష్ ఏమన్నారంటే? (x/haarikahassine)
డింపుల్ హయాతి గ్లామర్ ప్లస్ మాస్.. అదిరిపోయిన ‘ఆదర్శ కుటుంబం’ నారాయణమ్మ సాంగ్.. వెంకటేష్ ఏమన్నారంటే? (x/haarikahassine)

నారాయణమ్మ సాంగ్

ఆదర్శ కుటుంబం సినిమా నుంచి ‘నారాయణమ్మ’ సాంగ్ వచ్చేసింది. తమన్ మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు. రామ్ మిరియాల, ప్రభ బంగారిగల్ల పాడారు.

డింపుల్ హయాతి కిల్లర్ డ్యాన్స్ మూమెంట్స్, వెంకటేష్ ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్, శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్ గ్లామర్ ఈ పాటలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అక్టోబర్ 9న విడుదల కానున్న ఈ ఆదర్శ కుటుంబం సినిమాకు ఈ పాట భారీ హైప్‌ను తీసుకొచ్చింది.

డింపుల్ హయాతి ఊరమాస్ డ్యాన్స్

అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫస్ట్ సింగిల్ 'నారాయణమ్మ' లిరికల్ పాటను ఈ రోజు ఆదర్శ కుటుంబం మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలో డింపుల్ హయాతి తన అద్భుతమైన గ్రేస్‌తో, మాస్ డ్యాన్స్ మూమెంట్స్‌తో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది.

ఆమెతో పాటు హీరోయిన్ శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్‌లతో కలిసి విక్టరీ వెంకటేష్ చేసిన హుక్ స్టెప్పులు అభిమానులకు ఐ-ఫీస్ట్‌గా మారాయి. వెంకీ మామ తనదైన ఎనర్జీ అండ్ టైమింగ్‌తో పాటలో సందడి చేశారు.

త్రివిక్రమ్-తమన్ కాంబోకి మరో బ్లాక్‌బస్టర్

త్రివిక్రమ్ సినిమాల్లో మ్యూజిక్, ముఖ్యంగా ఫస్ట్ సింగిల్ ఆడియో హైప్‌ను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 'ఆదర్శ కుటుంబం' విడుదల తేది అక్టోబర్ 9కి మారిన నేపథ్యంలో, ఈ 'నారాయణమ్మ' ప్రమోషనల్ పాటతో చిత్ర బృందం ప్రచార హోరును పీక్స్‌కు తీసుకెళ్లింది.

విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్‌లోనే కాకుండా మాస్ ఆడియన్స్‌లోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో. డింపుల్ హయాతి గ్లామరస్ డ్యాన్స్ మూవ్స్, శ్రీనిధి, నివేదాల ప్రెజెన్స్ పాట గ్రాండ్‌నెస్‌ను పెంచాయి. తమన్ ఈ మధ్య కాలంలో అందించిన బెస్ట్ మాస్ ఫోక్ ట్రాక్స్‌లో ఒకటిగా 'నారాయణమ్మ' నిలిచిపోయే అవకాశం ఉంది. రామ్ మిరియాల వాయిస్ ఉండటం పాటలోని ఫోక్ ఫీల్‌ను మరింత ఎలివేట్ చేసింది.

ఇది మామూలు కుటుంబం కాదు

నారాయణమ్మ సాంగ్ లాంఛ్ ఈవెంట్లో మాట్లాడుతూ వెంకటేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. ‘‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి తర్వాత మళ్లీ త్రివిక్రమ్ తో కలిసి పని చేశా. అవన్నీ క్లాసిక్ లవ్ స్టోరీలు. అప్పుడు పెళ్లికాని ప్రసాద్. ఇప్పుడు పెళ్లయిపోయింది. ఆ రోజులు అయిపోయాయి.

ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు. ఫన్ తో పాటు ట్విస్టులుంటాయి. ఇది మామూలు కుటుంబం కాదు. వేరే లెవల్ లో ఉంటుంది ఆదర్శ కుటుంబం’’ అని వెంకటేష్ పేర్కొన్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More