Adarsha Kutumbam: కారు మెకానిక్‌తో ప్రేమలో చిట్టిబాబు కూతురు..వెంకటేష్ ఆదర్శ కుటుంబం నుంచి అమ్మాయి గ్లింప్స్ రిలీజ్
Adarsha Kutumbam AK47: ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47' (AK 47) చిత్రం నుంచి మరో వీడియో వచ్చేసింది. యువీనా పార్థవి పోషించిన 'సంపూర్ణ' క్యారెక్టర్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. నవ్వులు పూయించేలా ఉన్న ఈ క్యారెక్టర్ ప్రోమో వైరల్ గా మారింది.
Adarsha Kutumbam AK47: విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కు, మార్క్ కామెడీ టైమింగ్‌కు తెలుగు బాక్సాఫీస్ వద్ద ఉన్న క్రేజ్ వేరే లెవల్. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వెంకీ చేస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47' (AK 47). ఇటీవల వెంకటేష్, శ్రీనిధి శెట్టి పాత్రలకు సంబంధించిన గ్లింప్స్‌లతో ఆకట్టుకున్న ఈ చిత్ర యూనిట్, తాజాగా ఈ కుటుంబంలోని మరొక విచిత్రమైన పాత్ర 'సంపూర్ణ' (యువీనా పార్థవి) క్యారెక్టర్ గ్లింప్స్‌ను విడుదల చేసింది.

'సంపూర్ణ' లవ్ ట్రాక్
తాజాగా విడుదలైన ఆదర్శ కుటుంబం గ్లింప్స్ లో చిట్టిబాబు (వెంకటేష్) కూతురు సంపూర్ణగా యువీనాను పరిచయం చేశారు మేకర్స్. వెంకటేష్, రఘుబాబు ఒక ఇంటి విషయమై సీరియస్‌గా మాట్లాడుకుంటుండగా.. 'సంపూర్ణ' ఎంతో ఉత్సాహంగా ఇంటి లోపలికి వస్తుంది. "నేను ప్రేమలో పడ్డాను నాన్న" అని అమ్మాయి చెప్పడంతోనే చిట్టిబాబు ముఖం మాడిపోతుంది.
కార్ మెకానికేనా?
వెంకటేష్ ముఖంలో నిరాశ స్పష్టంగా కనిపిస్తుంది. "ఈ సారి ఎవడే? కార్ మెకానికా’’ అని చిట్టిబాబు అడుగుతాడు. నీకెలా తెలుసు? అని కూతురు షాకిస్తుంది. ప్రేమకు అర్థం తెలుసా అంటే.. ‘‘నాకు ఏమవుతుందోననే బాధ కన్నా, వాడికి ఏమవుతుందోననే భయం ఎక్కువైతే.. అదే ప్రేమ’’ అని గురూజీ స్టైల్లో డైలాగ్ చెప్తుంది సంపూర్ణ.
ఈ విచిత్రమైన కుటుంబంలో జరిగే గందరగోళాన్ని, అస్తవ్యస్తమైన ప్రేమకథలను ప్రతిబింబించేలా ఉన్న ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రమోషనల్ ట్రెండ్
'ఆదర్శ కుటుంబం' సినిమా ప్రమోషన్ విషయంలో మేకర్స్ డిఫరెంట్ ట్రెండ్ సెట్ చేస్తున్నారు. రొటీన్ గా క్యారెక్టర్లను ఇంట్రడ్యూస్ చేయకుండా వరుసగా గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నారు. ఈ ఫార్ములాతో ఆడియన్స్ తో క్యూరియాసిటీ బిల్డ్ చేస్తున్నాడు డైరెక్టర్ త్రివిక్రమ్.
ఆదర్శ కుటుంబం రిలీజ్ డేట్
ఆదర్శ కుటుంబం చిత్రంలో వెంకటేష్, శ్రీనిధి శెట్టి కాకుండా నివేథా పేతురాజ్, రాజ్ ప్రాజ్వల్, రావు రమేష్‌లతో పాటు కామెడీ విభాగాన్ని ఏలే సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఉదయ్‌బీర్ సంధూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దసరా పండగ కానుకగా అక్టోబర్ 2, 2026 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
పండగ సీజన్‌లో ఫ్యామిలీ ఆడియన్స్‌ను, మల్టీప్లెక్స్ ప్రేక్షకులను ఒకేసారి థియేటర్లకు రప్పించే సత్తా ఉన్న సరైన క్లీన్ కామెడీ సబ్జెక్ట్‌గా ఈ ఆదర్శ కుటుంబం నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


