Endhayya Saami Lyrics: ఏం రాశావయ్యా.. రామజోగయ్య! మనసును తాకేలా ‘ఏందయ్య సామి’ సాంగ్.. ఫుల్ లిరిక్స్ చూసి మీరూ పాడేయండి!
Endhayya Saami Lyrics: చాలా పాటలు అసలు ఎప్పుడు రిలీజ్ అయ్యాయో కూడా తెలియకుండా పోతాయి. ఇంకొన్ని పాటలేమో చెవులకు నచ్చుతాయి. కానీ కొన్ని మాత్రమే మనసుకు తాకుతాయి. అలాంటిది రణబాలి మూవీ నుంచి వచ్చిన ‘ఏందయ్య సామి’ సాంగ్. తెగ ట్రెండ్ అవుతున్న ఈ ఫుల్ సాంగ్ లిరిక్స్ ఇక్కడ చూసేయండి.
Endhayya Saami Lyrics: రియల్ కపుల్ రీల్ రొమాన్స్ కు వేదికగా నిలిచింది ‘ఏందయ్యా సామి’ సాంగ్. విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న జంటగా నటించిన ‘రణబాలి’ మూవీ నుంచి లేటెస్ట్ గా ఈ ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజైంది. గతంలో ఈ పాటలోని కొన్ని లైన్స్ రిలీజ్ చేసినప్పుడే ఇది ట్రెండింగ్ గా మారింది. ఇప్పుడు ఫుల్ సాంగ్ మరో లెవల్ లో ఉంది.

ఏందయ్యా సామి సాంగ్
రణబాలి మూవీలోని ఏందయ్యా సామి సాంగ్ మంచి ఫీల్ తో సాగుతోంది. ఇందులోని అక్షరాలు మనసును తాకుతున్నాయి. కొత్తగా పెళ్లయిన దంపతుల మధ్య రొమాన్స్ ను ఈ సాంగ్ చాటుతోంది. ఈ పాటను సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి అద్భుతంగా రాశారు. అజయ్ గోగావలే, శ్వేత మోహన్ అమోఘంగా పాడారు. ఫుల్ లిరిక్స్ ఇక్కడున్నాయి.
సాంగ్ లిరిక్స్
పల్లవి:
ఫిమేల్ వాయిస్
ఏందయ్య సామీ ఇట్ట గాస్తాంది ఎన్నెలా
ఊపేస్తా ఉంది సిత్తరాల ఉయ్యాలా
వీచే గాలికి అత్తరద్దిందెవ్వరు
మారేజాముకి మందు పెట్టిందెవ్వరు
మాయదారి మనస్సాగక జాగారమయ్యారా
తడిసిపోయారా
తడి మెరిసిపోయారా
నీ చిలిపి కలల్లో ఒళ్ళు మరిసిపోయారా (2)
చరణం 1:
మేల్ వాయిస్
సాటుగా ఇచ్చిన గిలిసక్కిలి గింతైనా
మీసమే గుచ్చినా సలిసక్కేర ముద్దైనా
సురుకుమంటాదే నాతోటి సావాసం
చిన్ననాటి ఆవేశం మనదంటా నీకోసం
ఫిమేల్ వాయిస్
కండలే పెంచిన సీమకారమే తిన్నా
గుండెలో మెత్తని వెన్నపూసల కన్నా
నడిమి నా మెళ్ళో నల్లపూస నీ సరసం
అది గుచ్చుకుంటాన్నా మెచ్చుకుంటా నీ కోసం
మేల్ వాయిస్
పుట్టుకే మల్లెపూవు తట్టుకో రంత నువ్వు
ఎట్టాగో గుట్టుగా నన్ను నువ్వే ఓర్చుకో
ఫిమేల్ వాయిస్
కడియాలసి తలగడై రేయి తెల్లారిపో
తడిసిపోయారా
తడి మెరిసిపోయారా
నీ చిలిపి కలల్లో ఒళ్ళు మరిసిపోయారా (2)
చరణం 2:
మేల్ వాయిస్
అమ్మవో ఆలివో నువ్వు ఎవరో గానీ
జన్మనే ఏలవే రణబాలుని రాణి
చిగురు పాదాల సిరిమువ్వనై ఉంటా
నడుపుకో నన్ను జగమంతా నీ జంట
ఫిమేల్ వాయిస్
సూర్యుడా చంద్రుడా నీ రెండు ముఖాల్ని
సూటిగా చూసినా నీ ఇంటి ఇల్లాల్ని
ఉడుకు నాదంటా సిరి చలవ నాదంటా
నీ వెలువ నీడల్లో చెరి సగం నేనుంటా
మేల్ వాయిస్
ఎట్టనే ఇంత కంట ప్రేమనే చెప్పుకుంటా
నువ్వు నా నేనుగా జత చేరిపోతానే
ఫిమేల్ వాయిస్
అమ్మ పోలికయ్యే బొమ్మకు ఆయువునైతాలే
తడిసిపోయారా
తడి మెరిసిపోయారా
నీ చిలిపి కలల్లో ఒళ్ళు మరిసిపోయారా (2)
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


