Rashmika Mandanna: అండ‌ర్‌వాట‌ర్‌లో 8 గంట‌లు.. నేనేమైనా చేప‌నా? సెట్స్‌కు వెళ్లాలంటే వ‌ణుకు పుట్టేది: రష్మిక మందన్న

Rashmika Mandanna: ఒక్కో సినిమాతో తన రేంజ్ పెంచుకుంటూ, ఫ్యాన్స్ అభిమానాన్ని రెట్టింపు చేసుకుంటూ దూసుకెళ్తోంది రష్మిక మందన్న. తాజాగా మైసా అంటూ పవర్ ఫుల్ యాక్షన్ తో థియేటర్లకు రాబోతుంది. ఈ మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్ సందర్భంగా రష్మిక మందన్న కామెంట్లు వైరల్ అవుతున్నాయి. 

Published on: Sep 20, 2026, 21:55:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న భారీ లేడీ ఓరియెంటెడ్ పీరియాడిక్ రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మైసా' (Mysaa). ఇవాళ (సెప్టెంబర్ 20) ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ లాంఛ్ ఈవెంట్ సందర్భంగా రష్మిక మందన్న స్పీచ్ వైరల్ గా మారింది.

అండ‌ర్‌వాట‌ర్‌లో 8 గంట‌లు.. నేనేమైనా చేప‌నా? సెట్స్‌కు వెళ్లాలంటే వ‌ణుకు పుట్టేది: రష్మిక మందన్న
అండ‌ర్‌వాట‌ర్‌లో 8 గంట‌లు.. నేనేమైనా చేప‌నా? సెట్స్‌కు వెళ్లాలంటే వ‌ణుకు పుట్టేది: రష్మిక మందన్న

రష్మిక మందన్న యాక్షన్ అవతార్

రష్మిక మందన్న కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న తొలి కంప్లీట్ లేడీ ఓరియెంటెడ్ పాన్-ఇండియా యాక్షన్ చిత్రం ‘మైసా’. అన్యాయానికి గురైన ఒక గిరిజన మహిళ తిరుగుబాటు నేపథ్యంలో ఈ చిత్రాన్ని దర్శకుడు రవీందర్ పుల్లే రూపొందిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీలో రష్మిక పవర్ ఫుల్ యాక్షన్ అవతార్ లో కనిపించనుంది.

సెట్స్ కు వెళ్లాలంటే వణుకు

'మైసా' షూటింగ్ ప్రతిరోజూ ఒక కొత్త సవాలుగా ఉండేదని, సెట్స్‌కు వెళ్లడానికే తనకు వణుకు పుట్టేదని మైసా టీజర్ లాంఛ్ ఈవెంట్లో రష్మిక సరదాగా వ్యాఖ్యానించింది. కొండ శిఖరాల నుండి దూకడం, పర్వత ప్రాంతాలలో చెప్పులు లేకుండా నడవడమే కాకుండా, రోజుకు దాదాపు 8 గంటల పాటు నీటి అడుగున ఉండి ఫైట్ సీన్స్ చేశానని చెప్పింది.

నేనేమైనా చేపనా?

"ఈత వచ్చు కదా అని అండర్ వాటర్ ఫైట్ తేలిక అనుకున్నాను. కానీ రోజుకు 8 గంటలు నీళ్లలోనే ఉండాలన్నారు. నేనేమైనా చేపనా?" అంటూ రష్మిక నవ్వేసింది. తన లాస్ట్ ఫిల్మ్ 'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమా కోసం తన ఎమోషన్ అంతా ఇస్తే, 'మైసా' కోసం తన లైఫ్‌నే ఇచ్చేశానని రష్మిక తెలిపింది.

ఇదే సమయంలో తెలంగాణ స్లాంగ్ ఉచ్ఛారణపై వస్తున్న ప్రశ్నలపై స్పందిస్తూ.. "నాకు స్లాంగ్ వ్యత్యాసాలు పెద్దగా తెలీవు.. స్లాంగ్ ఏదైతే ఏంటి, నేను చెప్పే భావం మీకు అర్థమవుతోంది కదా, అయితే సంతోషం!" అని ఎంతో స్పష్టంగా రష్మిక సమాధానమిచ్చింది.

రష్మిక మేకోవర్

ఇవాళ రిలీజైన మైసా టీజర్ వేరే లెవల్ లో ఉంది. ఇందులో రష్మిక మందన్న యాక్షన్ సీక్వెన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఈ సినిమా కోసం ఆమె నిజంగానే ప్రాణం పెట్టింది. రష్మిక మందన్న 'గ్లామర్/క్యూట్' ఇమేజ్ నుంచి 'మైసా' ద్వారా పూర్తిస్థాయి రా అండ్ రస్టిక్ యాక్షన్ నటిగా మారిందని చెప్పొచ్చు. మైసా మూవీ రష్మిక మందన్న కెరీర్ లోనే టాప్ సినిమాల్లో ఒకటిగా నిలిచే ఛాన్స్ ఉంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More