AK 47 Song: ముగ్గురు భామలతో వెంకీ మామ.. ఆదర్శ కుటుంబం నుంచి స్పెషల్ సాంగ్.. మరికొన్ని గంటల్లోనే.. పాటతో హైప్ వస్తుందా?
AK 47 Song: వరుసగా పోస్ట్ పోన్ డేట్లతో ఫ్యాన్స్ ను నిరాశపరుస్తున్న ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ముగ్గురు భామలతో వెంకీ మామ ఆడిపాడిన స్పెషల్ సాంగ్ కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సాంగ్ తో మూవీకి హైప్ వస్తుందని టీమ్ భావిస్తోంది.
AK 47 Song: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47' (AK47). ఈ మూవీ విడుదల తేది అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 9కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. సినిమా విడుదలలో మార్పు కారణంగా ఆలస్యమైన ఫస్ట్ సింగిల్ 'నారాయణమ్మ' సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ మరో ముహూర్తం పెట్టారు.

ఆదర్శ కుటుంబం రిలీజ్
త్రివిక్రమ్ శ్రీనివాస్ మేకింగ్, విక్టరీ వెంకటేష్ టైమింగ్ కలసి వస్తున్న 'ఆదర్శ కుటుంబం' సినిమాపై టాలీవుడ్‌లో విపరీతమైన హైప్ ఉంది. తొలుత అక్టోబర్ 2న దసరా బరిలో విడుదల చేయాలని భావించినప్పటికీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులలో నాణ్యత కోసం అక్టోబర్ 9కి వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు చినబాబు, ఎస్. రాధాకృష్ణ ప్రకటించారు.
నారాయణమ్మ సాంగ్
ఆదర్శ కుటుంబం మూవీ రిలీజ్ డేట్ మార్పు కారణంగా నారాయణమ్మ సాంగ్ కూడా వాయిదా పడింది. ఫస్ట్ ఈ స్పెషల్ సాంగ్ ను సెప్టెంబర్ 22న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ తర్వాత వాయిదా వేశారు. తాజాగా రేపు (సెప్టెంబర్ 27) ఈ పాటను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ మాస్ అండ్ ఎనర్జిటిక్ ట్రాక్‌ను రామ్ మిరియాల, ప్రభా ఆలపించారు.
ముగ్గురు భామలతో
నారాయణమ్మ స్పెషల్ సాంగ్ తో వెంకీ మామ ఏకంగా ముగ్గురు భామలతో ఆడిపాడనున్నారు. హీరోయిన్ శ్రీనిధి శెట్టితో పాటు నివేదా పేతురాజ్, డింపుల్ హయాతీలు వెంకటేష్ సరసన మెరవనున్న ఈ స్పెషల్ డాన్స్ నంబర్ పై ఆడియన్స్‌లో విపరీతమైన క్యూరియాసిటీ నెలకొంది.
హైప్ పెరిగేనా?
ఆదర్శ కుటుంబం రిలీజ్ వాయిదాతో వెంకీ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. అయితే తమన్ సంగీత దర్శకత్వంలో వస్తున్న ఈ పాట చార్ట్‌బస్టర్ అయ్యే రేంజ్‌లో ఉంటే, సినిమాపై ఉన్న అంచనాలు నెక్స్ట్ లెవెల్‌కి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఆదర్శ కుటుంబం సినిమాలో నారా రోహిత్ ఐపీఎస్ ఆఫీసర్‌గా ప్రత్యేక పాత్రలో కనిపిస్తుండగా పూజిత పొన్నాడ, రావు రమేష్, సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఆదర్శ కుటుంబం మూవీ నుంచి క్యారెక్టర్లు ఇంట్రడ్యూస్ చేస్తూ వరుసగా వీడియోలు రిలీజ్ చేశారు. ఇక ఆ తర్వాత వచ్చిన ఆదర్శ కుటుంబం టీజర్ కూడా అదిరిపోయింది. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, యాక్షన్ అన్ని ఉన్నాయని ఈ టీజర్ తో క్లారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో దసరా సెలవుల్లో వెంకీ మామ సందడి వేరే లెవల్ లో ఉంటుందనే కామెంట్లు వస్తున్నాయి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


