Naga Vamsi AK47: డేట్ మార్చేదే లేదు..వెంకీ-త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం రిలీజ్‌పై నాగవంశీ క్లారిటీ..ఆ రోజు నుంచే బుకింగ్స్!
Naga Vamsi AK47: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఆదర్శ కుటుంబం - AK47'. ఈ మూవీ రిలీజ్ డేట్ పై ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అలాగే అడ్వాన్స్ బుకింగ్స్ డేట్ ను కూడా ప్రకటించారు.
Naga Vamsi AK47: 'ఆదర్శ కుటుంబం' సినిమా విడుదల తేదీ మారుతుందంటూ వస్తున్న పుకార్లకు నిర్మాత నాగవంశీ సోషల్ మీడియా వేదికగా చెక్ పెట్టారు. తమ సంస్థ విడుదల విషయంలో పంక్చువాలిటీ పాటిస్తుందని, అక్టోబర్ 9న ఈ సినిమా థియేటర్లలోకి రావడం పక్కా అని స్పష్టం చేశారు.

నాగవంశీ కౌంటర్
త్రివిక్రమ్ దర్శకత్వంలో ఫస్ట్ టైమ్ వెంకటేష్ హీరోగా చేస్తున్న మూవీ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47’. ఈ మూవీని అక్టోబర్ 2కు రిలీజ్ చేస్తామని ఫస్ట్ ప్రకటించారు. ఆ తర్వాత అక్టోబర్ 9కి పోస్ట్ పోన్ చేశారు. ఇక ఇప్పుడేమో అక్టోబర్ 9కి కూడా రిలీజ్ కాదనే ప్రచారం సాగుతోంది. దీనిపై నాగవంశీ తన ట్వీట్ తో కౌంటర్ ఇచ్చారు.
అదే రోజున
‘‘మా రిలీజ్ పంక్చువాలిటీ మీద మీకు డౌట్ ఉండొచ్చు. కానీ ఈ సారి అలాంటి డౌట్స్ ఏం వద్దు. మేం అక్టోబర్ 9నే వస్తున్నాం. అందులో ఎలాంటి మార్పు లేదు. అక్టోబర్ 6న ట్రైలర్, 7 నుంచి తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఉంటాయి.
‘‘ఫ్యామిలీస్ అందరూ మీ పిల్లలతో ఎగ్జామ్స్ బాగా రాయించి, హాలీడేస్ కు సూట్ అయ్యే మా చక్కని కామెడీ యాక్షన్ ఫ్యామిలీ ఫిల్మ్ తో స్టార్ట్ చేయండి. హ్యాపీగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేయడానికి థియేటర్లకు రండి. అక్టోబర్ 9న డైరెక్ట్ గా థియేటర్లలో కలుద్దాం. ప్రీమియర్స్ లేవు’’ అని నాగవంశీ ఎక్స్ లో పోస్టు చేశారు.
వెంకటేష్ - త్రివిక్రమ్ కాంబో
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఆదర్శ కుటుంబం చిత్రానికి ఎస్.తమన్ సంగీతం అందిస్తున్నారు. వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి, నివేథా పేతురాజ్ కథానాయికలుగా నటిస్తుండగా, నారా రోహిత్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు.
'మల్లీశ్వరి', 'నువ్వు నాకు నచ్చావ్' వంటి ఆల్ టైమ్ క్లాసిక్స్ సినిమాలకు త్రివిక్రమ్ రైటర్ గా పని చేశారు. ఇప్పుడు డైరెక్టర్ గా వెంకటేష్ తో ఆదర్శ కుటుంబం తీశారు. దీంతో ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో, ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి.
పండగ సెలవులు
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దసరా, సంక్రాంతి పండుగ సీజన్లలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లకు లభించే ఆదరణ చాలా ప్రత్యేకమైంది. వెంకటేష్ - త్రివిక్రమ్ కాంబో అనేది కుటుంబ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో తిరుగులేని బ్రాండ్. పండుగ సెలవులను లక్ష్యంగా చేసుకుని అక్టోబర్ 9న రిలీజ్ డేట్ ఖరారు చేయడం ఆదర్శ కుటుంబం సినిమాకు బిజినెస్ పరంగా చాలా పెద్ద ప్లస్ పాయింట్.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


