Hanuman Ansh Telugu: రూ.300 కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ తెలుగు వెర్షన్ రిలీజ్ వాయిదా.. త్రివిక్రమ్ సమర్ఫణలో వస్తున్న సినిమా
Hanuman Ansh Telugu Release Date: బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ.300 కోట్ల వసూళ్లు సాధించిన బ్లాక్‌బస్టర్ మూవీ హనుమాన్ అంశ్ తెలుగు వెర్షన్ రిలీజ్ వాయిదా పడింది. సెప్టెంబర్ 18న రిలీజ్ కావాల్సి ఉండగా.. రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
Hanuman Ansh Telugu Release Date: బాలీవుడ్‌లో బాక్సాఫీస్ వద్ద మంచి సెన్సేషన్ క్రియేట్ చేసిన డివైన్ స్పిరిచువల్ డ్రామా 'హనుమాన్ అంశ్' (Hanuman Ansh) తెలుగు థియేట్రికల్ రిలీజ్‌కు సడెన్‌గా బ్రేకులు పడ్డాయి. ఈ వారం అంటే సెప్టెంబర్ 18న గ్రాండ్‌గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా సడెన్‌గా రిలీజ్ డేట్ దగ్గరపడటంతో గత కొన్ని రోజులుగా వస్తున్న రూమర్స్ నిజమయ్యాయి.

తెలుగు డబ్బింగ్ పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడమే ఈ వాయిదాకు ప్రధాన కారణమని మేకర్స్ వెల్లడించారు. క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని, డబ్బింగ్ పనులు పూర్తిగా పూర్తయిన తర్వాతే సరికొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ సంస్థ 'ప్రత్యంగిర సినిమాస్' సోషల్ మీడియా వేదికగా అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసింది.
డబ్బింగ్ పనులు ఆలస్యం.. రేసు నుంచి త్రివిక్రమ్ అవుట్
అయితే హనుమాన్ అంశ్ రిలీజ్ వాయిదా వెనుక ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణికి చెందిన సమర్పణ సంస్థ 'ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్' ఈ చిత్రం తెలుగు వర్షన్‌ను ప్రెజెంట్ చేయడానికి ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. కానీ లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి 'హనుమాన్ అంశ్'కు సంబంధించిన అన్ని పోస్టులను సైలెంట్‌గా డిలీట్ చేసేయడం హాట్ టాపిక్‌గా మారింది. డబ్బింగ్ ఆలస్యం కావడం తో పాటు ప్రమోషన్ ప్లానింగ్ సరిగ్గా కుదరకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
నీమ్ కరోలీ బాబా జీవిత కథతో తెరకెక్కిన సినిమా
ఉత్తర భారతంలో ఎంతోమంది భక్తుల ఆరాధ్యదైవంగా పూజలందుకుంటున్న ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు 'నీమ్ కరోలీ బాబా' (Neem Karoli Baba) జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. స్టీవ్ జాబ్స్, మార్క్ జుకర్‌బర్గ్, విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ దంపతుల లాంటి గ్లోబల్ సెలబ్రిటీలు నీమ్ కరోలీ బాబా ఆశ్రమాన్ని సందర్శించి ఆయన భక్తులుగా మారిన సంగతి తెలిసిందే.
ఆయన మహిమలు, ఆధ్యాత్మిక ప్రయాణాన్ని దర్శకుడు విశాల్ చతుర్వేది ఎంతో అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించారు. ఈ సినిమాలో శోభినవ్ సత్య, చందన్ ఆనంద్ ప్రధాన పాత్రల్లో జీవించగా.. నిఖిల్ దూబే, ఉదయ్‌సింహ్ రాజ్‌పుత్, పూర్ణిమ తివారి కీలక పాత్రల్లో మెరిశారు. స్వయంభూ మీడియా నెట్‌వర్క్ ప్రైవేట్ లిమిటెడ్, రాగిణి ఎస్, నమ్రత జి.ఎస్, విశాల్ చతుర్వేది, అనుప్రియ ఎ. నాగర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్
ప్రస్తుతం సౌత్ ఇండియాలో భక్తిరస చిత్రాలు, డివైన్ కాన్సెప్ట్ సినిమాలకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ దక్కుతోంది. ‘హనుమాన్’, ‘కాంతార’ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సాధించిన వండర్స్ చూశాక, ఈ సినిమాను కూడా తెలుగులో సరైన డిజిటల్, థియేట్రికల్ ప్రమోషన్స్‌తో తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు.
తెలుగు డబ్బింగ్ పనులు పక్కాగా పూర్తయిన తర్వాత మేకర్స్ అనౌన్స్ చేసే కొత్త రిలీజ్ డేట్ కోసం టాలీవుడ్ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


