Geethanjali Re Release: మూవీ లవర్స్ గెట్ రెడీ.. మళ్లీ వచ్చేస్తున్న క్లాసిక్ లవ్ స్టోరీ.. గీతాంజలి రీ రిలీజ్ డేట్ ఇదే!
Geethanjali Re Release: అక్కినేని నాగార్జున, దిగ్దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌లో వచ్చిన ఆల్ టైమ్ కల్ట్ క్లాసిక్ ‘గీతాంజలి’ రీ రిలీజ్‌పై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. గతంలో రెండుసార్లు వాయిదా పడి అభిమానులను నిరాశపరిచిన ఈ చిత్రం 37 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ కు రెడీ అయింది. మూవీ లవర్స్ కు థియేటర్లో పండగే.
Geethanjali Re Release: తెలుగు సినీ చరిత్రలో ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ సినిమాల్లో ‘గీతాంజలి’ ఒకటి. 1989లో విడుదలైన ఈ మూవీ తెలుగు సినిమా చరిత్రలోనే మోస్ట్ ఎఫెక్టివ్ లవ్ స్టోరీస్ లో ఒకటిగా నిలిచింది. ఈ క్లాసిక్ మ్యాజిక్‌ను ఈ జనరేషన్ సినీ లవర్స్ కు అందించడం కోసం మూవీ టీమ్ రీ రిలీజ్ ప్లాన్ చేసింది.

రెండు సార్లు వాయిదా
గీతాంజలి సినిమాను 4K సాంకేతికతతో అందించేందుకు అన్నపూర్ణ స్టూడియోస్ శ్రీకారం చుట్టింది. నిజానికి ఈ చిత్రాన్ని అక్టోబర్ 2025 ప్రకటన ప్రకారం నవంబర్ 14, 2025న రీ రిలీజ్ చేయాలని భావించారు. కానీ అనివార్య కారణాల వల్ల అది సాధ్యపడలేదు. ఆ తర్వాత ఆగస్టు 28, 2026న విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ మళ్లీ వాయిదా పడింది.
గీతాంజలి రీ రిలీజ్ డేట్
తాజాగా ఈ వాయిదాల సస్పెన్స్‌కు తెరదించుతూ మేకర్స్ గీతాంజలి రీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. నాగార్జున హీరోగా నటించిన ఈ మూవీని నవంబర్ 13, 2026న సినిమాను గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. శ్రీ పద్మిని సినిమాస్ సంస్థ ఈ చిత్రాన్ని థియేటర్లలో పంపిణీ చేయనుంది.
మణిరత్నం విజన్
భాగ్యలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్ లో వచ్చిన గీతాంజలి చిత్రం నాగార్జున కెరీర్‌లోనే కాకుండా టాలీవుడ్ లవ్ స్టోరీస్ శైలిని పూర్తిగా మార్చివేసింది. మణిరత్నం విజన్ కు ఇప్పటికీ ప్రశంసలు దక్కుతూనే ఉన్నాయి.
- డెబ్యూ నటి గిరిజా షెట్టర్: హీరోయిన్‌గా పరిచయమైన గిరిజా షెట్టర్ తన చురుకైన నటనతో, క్యూట్‌నెస్‌తో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
- ఇళయరాజా స్వరాలు: 'జగడ జగడ', 'ఓ పాపా లాలి', 'ఓ ప్రియా ప్రియా', 'ఆమని పాడవే కోయిలా' వంటి ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్ పాటలు, ఆత్మను తాకే నేపథ్య సంగీతం ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.
రీ రిలీజ్ ట్రెండ్
ప్రస్తుతం టాలీవుడ్‌లో పాత హిట్ సినిమాలను 4Kలో రీ-రిలీజ్ చేయడం పరిపాటిగా మారింది. అయితే ఎక్కువ శాతం యాక్షన్, మాస్ సినిమాలే రీ-రిలీజ్ అవుతున్న తరుణంలో, 'గీతాంజలి' వంటి క్లాసికల్ రోమాంటిక్ డ్రామా 4K రెస్టోరేషన్‌తో రావడం చాలా ప్రత్యేకమైనది.
గతంలో రెండుసార్లు రీ-రిలీజ్ డేట్లు మారినప్పటికీ, అన్నపూర్ణ స్టూడియోస్ క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా విజువల్స్, ఫ్రేమ్ గ్రాన్యులారిటీ, ఆడియో మిక్సింగ్‌ను పర్‌ఫెక్ట్‌గా రీ-మాస్టర్ చేయడానికే సమయం తీసుకున్నట్లు సమాచారం. ఈ రోజుల్లో వస్తున్న రొటీన్ లవ్ స్టోరీలకు భిన్నంగా ఎమోషన్స్, ప్యూర్ లవ్ తో సాగే ఈ మూవీ నేటి నయా ట్రెండ్ ఓటీటీ లవర్స్‌కి కూడా థియేటర్లలో విజువల్ ట్రీట్‌గా నిలిచే ఛాన్స్ ఉంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


