OTT Romantic: ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ మూవీ.. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్ఫణలో.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
OTT Romantic: ఈటీవీ విన్ ఓటీటీ మరో ఒరిజినల్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ రొమాంటిక్ మూవీ పేరు బాలు గీత. అక్టోబర్ 15 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఆ వివరాలేంటో చూడండి.
OTT Romantic: డిజిటల్ ఆడియన్స్ కు సరికొత్త అనుభూతిని పంచడానికి ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ మరో క్రేజీ ఒరిజినల్ మూవీని అనౌన్స్ చేసింది. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో రూపొందిన ఫీల్ గుడ్ లవ్ అండ్ కామెడీ డ్రామా 'బాలు గీత' (Balu Geetha) అక్టోబర్ 15 నుంచి గ్రాండ్ గా స్ట్రీమింగ్ కాబోతోంది.

ప్రేమ, నవ్వుల కలబోతగా ‘బాలు గీత’
యంగ్ టాలెంట్ సందీప్ సరోజ్, కేయూరి జంటగా నటించిన ఈ క్యూట్ లవ్ స్టోరీ ఫస్ట్ లుక్ గ్లింప్స్ అండ్ పోస్టర్స్ ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. "కొన్ని కథలు చిన్న చిరునవ్వుతో మొదలై గుండెల్లో శాశ్వతంగా ఉండిపోతాయి.. ప్రేమ, నవ్వులతో నిండిన ఒక అందమైన ప్రయాణమే ఈ బాలు గీత" అంటూ క్యాప్షన్ జోడించి మూవీపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశారు.
కథలో నిజాయితీ, మనసును తాకేలా ఉండే ఎమోషన్స్ ఈ సినిమాకు ప్రధాన బలం అని తెలుస్తోంది. యంగ్ ఏజ్ లో కలిసే ఇద్దరు వ్యక్తులు తమ జీవిత భాగస్వామిని వెతుక్కునే క్రమంలో ఎదురయ్యే సరదా సంఘటనలతో ఈ డ్రామాను డిజైన్ చేశారు.
అన్నపూర్ణ స్టూడియోస్ గ్రాండ్ ప్రొడక్షన్
టాలీవుడ్ లెజెండరీ ప్రొడక్షన్ హౌస్ 'అన్నపూర్ణ స్టూడియోస్' బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ ఈ ప్రాజెక్ట్ ను ప్రెజెంట్ చేస్తున్నారు. మార్క్ మై వర్డ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ తో కలసి ప్రతాప్ కొల్లా రెడ్డి, దర్శకుడు హరా నిర్మించిన ఈ చిత్రం టెక్నికల్ గా కూడా చాలా రిచ్ గా ఉండబోతోందని టాక్.
గతంలో ఈటీవీ విన్ ద్వారా వచ్చిన '90s ఎ మిడిల్ క్లాస్ బయోపిక్', 'అన్నపూర్ణ ఫోటో స్టూడియో' వంటి కంటెంట్ తరహాలోనే ఈ మూవీ కూడా హోమ్లీ ఫీల్ ఇస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ను తెరకెక్కించారు.
బాలు గీత నటీనటులు
ఈ సినిమాలో కామిక్ టైమింగ్ తో అలరించే సీనియర్ నటుడు కృష్ణుడు ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తున్నారు. చాలా కాలం తర్వాత ఆయన ఓటీటీ స్పాట్‌లైట్ లోకి రావడం విశేషం. హీరో సందీప్ సరోజ్, హీరోయిన్ కేయూరిల కెమిస్ట్రీ ఈ రొమాంటిక్ కామెడీకి హైలైట్ గా నిలవనుంది.
మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ నాయక్ అందించిన స్వరాలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ ప్రేమకథకు ప్రాణం పోశాయని యూనిట్ చెబుతోంది. రేహన్ సినిమాటోగ్రఫీ విజువల్స్ ని ఎంతో సహజంగా, కలర్ ఫుల్ గా చూపించనుంది.
అక్టోబర్ 15 నుంచి ఈటీవీ విన్ లో ఎక్స్‌క్లూజివ్
ఇటీవలి కాలంలో డిజిటల్ స్పేస్ లో డిఫరెంట్, నేచురల్ తెలుగు కంటెంట్ కు విశేష ఆదరణ లభిస్తోంది. పండుగ వాతావరణాన్ని మరింత రెట్టింపు చేసేలా అక్టోబర్ 15న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు.
రొటీన్ మాస్, యాక్షన్ సినిమాలకు భిన్నంగా మైండ్ రిలాక్స్ చేసే ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ ని కోరుకునే వారికి 'బాలు గీత' ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ కానుంది. ఈటీవీ విన్ సబ్‌స్క్రైబర్లు ఈ పండుగ సీజన్ లో ఎంజాయ్ చేయడానికి మరో క్లీన్ ఎంటర్‌టైనర్ రెడీ అయిపోయింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


