Allu Arjun: కేరళలో మల్లు అర్జున్ ఫ్యాన్స్ రచ్చ- హ్యాపీ రీ రిలీజ్ థియేటర్లలో డ్యాన్స్‌లు- 20 ఏళ్ల నాటి క్రేజ్ రిపీట్!
Allu Arjun Kerala Fans Celebrates Happy Re Release 4K: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ కేరళలో మరోసారి సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. సుమారు 20 ఏళ్ల నాటి రొమాంటిక్ క్లాసిక్ చిత్రం హ్యాపీ 4K వర్షెన్ కేరళ థియేటర్లలో రీ-రిలీజ్ కావడంతో మల్లు ఫ్యాన్స్ థియేటర్లను పండుగ వేదికలుగా మార్చేశారు.
Allu Arjun Kerala Fans Celebrates Happy Re Release 4K: తెలుగు రాష్ట్రాల్లో మన స్టార్ హీరోలకు ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉంటుందో అందరికీ తెలిసిందే. కానీ, సరిహద్దులు దాటి పక్క రాష్ట్రంలో కూడా ఒక సొంత ఊరి హీరోలా ఆరాధించే క్రేజ్ ఒక్క ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు మాత్రమే సొంతం అయింది.

కేరళ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన
కేరళ జనాలు ఆయన్ను ప్రేమగా 'మల్లు అర్జున్' (Mallu Arjun) అని పిలుచుకుంటారు. ఇటీవల విడుదలైన 'పుష్ప 2' చిత్రంతో కేరళ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఐకాన్ స్టార్ బన్నీ ఇప్పుడు తన పాత సినిమాతో అక్కడ మరోసారి సంచలనం సృష్టిస్తున్నారు.
థియేటర్లలో కేరళ ఫ్యాన్స్ జాతర
దశాబ్దాల నాటి తన సూపర్ హిట్ చిత్రం 'హ్యాపీ' (2006) 4K రీ-రిలీజ్‌తో కేరళ థియేటర్లు ప్రస్తుతం హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి. చాలా కాలం తర్వాత థియేటర్లలోకి వచ్చిన 'హ్యాపీ' సినిమాకు కేరళ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
థియేటర్లలో సినిమా స్క్రీన్‌పై అల్లు అర్జున్ ఎంట్రీ ఇస్తుంటే ఫ్యాన్స్ కాగితాలు చల్లుతూ, కేకలు వేస్తూ గోల చేస్తున్నారు. సినిమాలోని సూపర్ హిట్ పాటలు, బన్నీ వేసిన అదిరిపోయే స్టెప్పులకు థియేటర్లలో ప్రేక్షకులు సీట్లలో కూర్చోకుండా స్క్రీన్ ముందుకు వచ్చి డ్యాన్స్‌లు వేస్తున్నారు.
కేరళ ఫ్యాన్స్ రచ్చ
ఓస్సారే అనే పాటకు స్క్రీన్ స్టేజీ ఎక్కి మరి పాట పాడుతూ, డ్యాన్స్ చేస్తూ అల్లు అర్జున్ కేరళ ఫ్యాన్స్ రచ్చ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. అవి చూస్తుంటే థియేటర్ కాదు మ్యూజిక్ కాన్సర్ట్‌ను తలపిస్తున్నాయని క్యాప్షన్, కామెంట్స్ పెడుతున్నారు.
మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన 'ఛోటా ముంబై' సినిమా రీ-రిలీజ్ అయినప్పుడు కేరళలో ఎలాంటి పండగ వాతావరణం కనిపించిందో, ఇప్పుడు మన తెలుగు హీరో సినిమాకు కూడా అదే స్థాయి రెస్పాన్స్ రావడం విశేషం. హ్యాపీ రీ రిలీజ్ సినిమా చూసి బయటకు వస్తున్న ఫ్యాన్స్ "బన్నీ కీ జై" అంటూ స్లోగన్స్ ఇస్తూ సందడి చేస్తున్నారు.
'ఆర్య'తో మొదలైన మల్లు అర్జున్ ప్రయాణం
నిజానికి అల్లు అర్జున్ నటించిన మొదటి సినిమా 'గంగోత్రి' కేరళలో 'సింహకుట్టి' పేరుతో విడుదలైంది. అయితే, అక్కడ బన్నీకి విపరీతమైన స్టార్‌డమ్ తెచ్చిపెట్టిన చిత్రం మాత్రం 'ఆర్య'. ఆ సినిమాతో కేరళ యువతకు అల్లు అర్జున్ డ్యాన్స్‌లు, స్టైల్స్ పిచ్చిపిచ్చిగా నచ్చేశాయి.
ఆ తర్వాత వచ్చిన హ్యాపీ, బన్నీ (కేరళలో కృష్ణ), దేశముదురు (హీరో), ఆర్య 2 చిత్రాలు అక్కడ భారీ వసూళ్లను సాధించాయి. ఇతర భాషల చిత్రాలకు కేరళలో పర్‌ఫెక్ట్ డబ్బింగ్ క్వాలిటీతో థియేట్రికల్ మార్కెట్ ఓపెన్ చేసింది కచ్చితంగా అల్లు అర్జున్ సినిమాలేనని చెప్పాలి.
అప్పట్లోనే 150 రోజుల రికార్డు!
ప్రేమకథా చిత్రాల దర్శకుడు ఎ. కరుణాకరణ్ తెరకెక్కించిన 'హ్యాపీ' సినిమాలో అల్లు అర్జున్ 'బన్నీ భాస్కర్' అనే పిజ్జా డెలివరీ బాయ్ పాత్రలో సరదాగా నవ్వించారు. జెనీలియా దేశ్‌ముఖ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ పోలీస్ ఆఫీసర్‌గా కీలక పాత్ర పోషించారు.
20 ఏళ్ల తర్వాత
హ్యాపీ సినిమా 2006లో మొదటిసారి కేరళలో విడుదలైనప్పుడు ఏకంగా 150 రోజులు ఆడి అప్పట్లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత మళ్లీ అదే క్రేజ్‌తో ఈ చిత్రం అక్కడ ప్రదర్శితం అవుతుండటం బన్నీకి ఉన్న తిరుగులేని ఇమేజ్‌కు నిదర్శనం అని చెప్పుకోవచ్చు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


