Teja Sajja OTT: సినిమా కంటే ఎక్కువ.. ఓటీటీ రియాలిటీ షో కోసం తేజ సజ్జాకు దిమ్మతిరిగే రెమ్యునరేషన్.. హోస్ట్ గా న్యూ జర్నీ!
Teja Sajja OTT: టాలీవుడ్ యంగ్ అండ్ సెన్సేషనల్ హీరో తేజ సజ్జా తన కెరీర్ లో కొత్త జర్నీ స్టార్ట్ చేయబోతున్నాడు. ఓటీటీ రియాలిటీ షో కోసం హోస్ట్ గా మారుతున్నాడు. ప్రైమ్ వీడియోలో రాబోతున్న ట్రేటర్స్ షో కు తేజ హోస్ట్ గా వ్యవహరించనున్నాడు. ఈ షో కోసం అతనికి దిమ్మతిరిగే రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు టాక్.
Teja Sajja OTT Remuneration: 'హనుమాన్', 'మిరాయ్' చిత్రాలతో పాన్ ఇండియా వ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్న యంగ్ హీరో తేజ సజ్జా ఇప్పుడు ఓటీటీ హోస్ట్‌గా సరికొత్త అవతారమెత్తుతున్నాడు. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న 'ది ట్రేటర్స్' (The Traitors Telugu) రియాలిటీ షోకు యాంకర్ గా వ్యవహరించనున్నాడు.

'ది ట్రేటర్స్' హోస్ట్‌గా తేజ సజ్జా
'హనుమాన్' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా రికార్డు వసూళ్లు సాధించి, 'మిరాయ్' చిత్రంతో రూ.2 కోట్ల వరకు పారితోషికం అందుకున్న యంగ్ హీరో తేజ సజ్జా ఇప్పుడు డిజిటల్ స్పేస్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రైమ్ వీడియోలో త్వరలోనే ప్రసారం కానున్న అంతర్జాతీయ హిట్ రియాలిటీ ఫార్మాట్ 'ది ట్రేటర్స్' (The Traitors) తెలుగు వెర్షన్ ఓటీటీలో రాబోతుంది. దీంతో అతను హోస్ట్ గా కొత్త జర్నీ స్టార్ట్ చేయనున్నాడు.
సినిమా లెవెల్ రెమ్యూనరేషన్!
ఈ ట్రేటర్స్ షో కోసం మేకర్స్ తేజకు భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు టాక్. సాధారణంగా ఒక పూర్తి స్థాయి ఫీచర్ ఫిలిం కోసం అతను ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో, అంతకు సమానంగా లేదా కాస్త ఎక్కువగానే రూ. 2 కోట్లకు పైగా అందించి ఈ షోకు ఒప్పించినట్లు సమాచారం. షోను అత్యంత గ్రాండ్‌గా విజయవంతం చేయడం కోసం ప్రైమ్ వీడియో బడ్జెట్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదని తెలుస్తోంది.
20 మంది సెలబ్రిటీలు, 10 ఎపిసోడ్లు
నమ్మకం, మోసం (Trust and Deception) అనే మైండ్ గేమ్ కాన్సెప్ట్‌తో సాగే ఈ ట్రెటర్ షోలో టాలీవుడ్, సోషల్ మీడియాలో గుర్తింపు పొందిన 20 మంది ప్రముఖులు పాల్గొనబోతున్నారు. అక్టోబర్ 15 నుంచి ఈ షో స్ట్రీమింగ్ కానుంది. 4 వారాల పాటు మొత్తం 10 ఎపిసోడ్లుగా షో ఉంటుంది. ప్రతి గురువారం మధ్యాహ్నం 12:00 గంటలకు కొత్త ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.
యంగ్ హీరోల ఓటీటీ ఎంట్రీ
తెలుగు డిజిటల్, బుల్లితెర స్పేస్‌లో నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, నాని, రానా వంటి అగ్ర తారలు బిగ్ బాస్, మీలో ఎవరు కోటీశ్వరుడు, నంబర్ 1 యారీ వంటి షోలకు హోస్టింగ్ చేసిన అనుభవం ఉంది. అయితే, ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో తేజ సజ్జాను ఎంచుకోవడం వెనుక అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాన్ కనిపిస్తోంది. 'హనుమాన్' విజయం తర్వాత తేజకు లభించిన మాస్, ఫ్యామిలీ ఇమేజ్‌ను ఈ షో గ్రాండ్ సక్సెస్ కోసం ఓటీటీ వాడుకోనుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


