Teja Sajja Traitors: మోసం ఇక్కడ న్యూ రూల్.. అందరూ మోసపోతారు: తేజ సజ్జా ఓటీటీ ఎంట్రీ.. అదిరిపోయిన ట్రెయిటర్స్ ప్రోమో

Teja Sajja Traitors: హనుమాన్ స్టార్ తేజ సజ్జా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ప్రైమ్ వీడియో రియాలిటీ షో ట్రెయిటర్స్ తెలుగు షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా వచ్చిన ప్రోమో చాలా ఇంట్రెన్స్ గా సాగింది.

Published on: Sep 29, 2026, 17:16:01 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Teja Sajja Traitors: 'హనుమాన్' సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో సంచలనం సృష్టించిన యంగ్ హీరో తేజ సజ్జా ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్‌ను అలరించడానికి సిద్ధమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న మైండ్ గేమ్ రియాలిటీ షో 'ది ట్రెయిటర్స్' (The Traitors) తెలుగు వెర్షన్‌కి ఆయనే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రసిద్ధ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అక్టోబర్ 15 నుంచి ఈ క్రేజీ షో డిజిటల్ ప్రసారం కానుంది.

Teja Sajja Traitors: మోసం ఇక్కడ న్యూ రూల్.. అందరూ మోసపోతారు: తేజ సజ్జా ఓటీటీ ఎంట్రీ.. అదిరిపోయిన ట్రెయిటర్స్ ప్రోమో
Teja Sajja Traitors: మోసం ఇక్కడ న్యూ రూల్.. అందరూ మోసపోతారు: తేజ సజ్జా ఓటీటీ ఎంట్రీ.. అదిరిపోయిన ట్రెయిటర్స్ ప్రోమో

నమ్మకం, వ్యూహాలు, మోసం, వెన్నుపోటు బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ అన్‌స్క్రిప్టెడ్ షో కోసం టాలీవుడ్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో రాబోతున్న ఈ ఇంటెన్స్ డ్రామా సీటు అంచున కూర్చోబెట్టే అనుభవాన్ని ఇస్తుందని మేకర్స్ చెబుతున్నారు.

తేజ సజ్జా హోస్టింగ్.. ప్రైమ్ వీడియో సంచలన అనౌన్స్‌మెంట్

ప్రైమ్ వీడియో తాజాగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌లో తేజ సజ్జా తనదైన ఎనర్జీతో అలరించారు. ప్రతీ మనిషిలో ఉండే రకరకాల మనస్తత్వాలను, 'ట్రెయిటర్స్' (ద్రోహులు) ఎలా ఆలోచిస్తారో ఆయన వివరించిన తీరు ఆకట్టుకుంటోంది. రియాలిటీ షోలలో ఇప్పటివరకు చూడని కొత్త డైమెన్షన్‌ను తేజ తన స్పాంటేనిటీతో ప్రెజెంట్ చేస్తున్నారు.

ఈ షో ప్రొడక్షన్ బాధ్యతలను ఎస్ఓఎల్ ప్రొడక్షన్స్ (SOL Productions) చూసుకుంటోంది. వివిధ రంగాలకు చెందిన 20 మంది పాపులర్ సెలబ్రిటీలు ఈ కాంటెస్ట్‌లో పోటీపడబోతున్నారు. ఒకరిని ఒకరు నమ్మలేని వాతావరణంలో, పొరపాటున తప్పుడు వ్యక్తిని నమ్మితే గేమ్‌ నుంచి అవుట్ అయిపోవడం ఖాయం.

అసలు ఏంటి ఈ 'ది ట్రెయిటర్స్' కాన్సెప్ట్?

మొత్తం 10 ఎపిసోడ్లుగా రాబోతున్న ఈ షో మెయిన్ థీమ్ 'అమాయకులు' వర్సెస్ రహస్యంగా ఎంపిక చేసిన 'ట్రెయిటర్స్' మధ్య జరిగే మైండ్ గేమ్. తమ మధ్య దాక్కున్న ద్రోహులు ఎవరో అమాయకులు కనిపెట్టాల్సి ఉంటుంది. మరోవైపు ఆ ద్రోహులు తమ ఐడెంటిటీ బయటపడకుండా అమాయకులను గేమ్‌ నుంచి ఎలిమినేట్ చేస్తూ ముందుకు సాగాలి.

అక్టోబర్ 15న గ్రాండ్‌గా ప్రారంభమయ్యే ఈ సిరీస్ మొత్తం నాలుగు వారాల పాటు ప్రసారం కానుంది. ప్రతీ వారం గురువారం మధ్యాహ్నం 12 గంటలకు కొత్త ఎపిసోడ్లు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతాయి. ప్రతీ ఎపిసోడ్‌లో ఉండే ఊహించని ట్విస్టులు, సీక్రెట్ అలయన్సెస్ ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్ ఇస్తాయి.

ప్రపంచవ్యాప్త హిట్ ఫ్రాంచైజ్.. హిందీ తర్వాత ఇప్పుడు తెలుగులో..

'ది ట్రెయిటర్స్' అనేది గ్లోబల్ లెవెల్‌లో విపరీతమైన పాపులారిటీ సాధించిన ఫ్రాంచైజ్. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా దేశాల్లో ఈ షో విభిన్న భాషల్లో రూపుదిద్దుకుని బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇటీవల హిందీలో కరణ్ జోహార్ హోస్ట్‌గా వచ్చిన వర్షన్‌కి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వచ్చింది.

ఆ సక్సెస్ తర్వాత ఇప్పుడు సౌత్ ఆడియన్స్ కోసం, ముఖ్యంగా తెలుగు వినోద ప్రపంచంలోకి ఈ ఫార్మాట్‌ను తీసుకొస్తున్నారు. ప్లానింగ్, సైకలాజికల్ వార్, నమ్మకద్రోహాల చుట్టూ తిరిగే ఈ కాన్సెప్ట్ తెలుగు ఆడియన్స్‌కి సరికొత్త ఓటీటీ ఎక్స్‌పీరియన్స్ అందించడం ఖాయంగా కనిపిస్తోంది.

'హనుమాన్' విజయం నుంచి 'మిరాయి' వరకు తేజ జోరు

చైల్డ్ ఆర్టిస్ట్‌గా 'ఇంద్ర', 'ఠాగూర్', 'కలిసుందాం రా' వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించిన తేజ సజ్జా.. హీరోగా మారిన తర్వాత వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. 'జాంబీ రెడ్డి'తో డిఫరెంట్ అటెంప్ట్ చేసిన ఆయన, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'హనుమాన్' సినిమాతో ఏకంగా గ్లోబల్ వైడ్‌గా వందల కోట్ల వసూళ్లు సాధించి పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆ తర్వా మిరాయ్ మూవీతోనూ సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు ప్రైమ్ వీడియో బిగ్గెస్ట్ రియాలిటీ షోకి హోస్ట్‌గా మారడం తేజ సజ్జా కెరీర్‌లో మరొక మైలురాయిగా నిలవనుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More