Teja Sajja: ఓటీటీలోకి తేజ సజ్జా ఎంట్రీ.. ప్రైమ్ వీడియోలో షోకి హోస్ట్‌గా.. ఐశ్వర్య రాజేష్, సుధీర్ బాబు వెబ్ సిరీస్ కూడా..
Teja Sajja: స్టార్ హీరో తేజ సజ్జా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి తెలుగులో రాబోయే ఇంటర్నేషనల్ షో ట్రైటర్స్ కు అతడు హోస్ట్ గా ఉండనున్నాడు. ఇదే కాకుండా మరెన్నో కొత్త తెలుగు వెబ్ సిరీస్ లను కూడా ఈ ఓటీటీ అనౌన్స్ చేసింది.
ప్రైమ్ వీడియో తమ ప్లాట్‌ఫామ్‌లో 2026 సంవత్సరానికి సంబంధించిన సౌత్ టైటిల్స్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఇన్‌స్పెక్టర్ రిషి సీజన్ 2 లాంటి సూపర్ హిట్ తమిళ వెబ్ సిరీస్‌లు తిరిగి వస్తుండగా.. కొత్తగా కొన్ని తెలుగు వెబ్ సిరీస్ లు కూడా రాబోతున్నాయి. అంతేకాదు టాలీవుడ్ యంగ్ స్టార్ తేజ సజ్జా ట్రైటర్స్ తెలుగు షోకి హోస్ట్‌గా రాబోతుండటం అసలు హైలైట్. ఈ ఏడాది ముఖ్యంగా తెలుగు, తమిళ టైటిల్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు ప్రైమ్ వీడియో అనౌన్స్ చేసిన ఈ సౌత్ వెబ్ సిరీస్‌ల లిస్ట్ చూస్తే క్లియర్‌గా అర్థమవుతోంది.

ట్రైటర్స్ తెలుగు (Traitors Telugu)
ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయిన షో ట్రైటర్స్. అల్టిమేట్ గేమ్ ఆఫ్ బిట్రేయల్ గా పిలిచే ఈ షోలో చాలా క్లెవర్‌గా ఉన్నవాళ్లు మాత్రమే సర్వైవ్ అవుతారు. ఇప్పుడు ఈ గ్లోబల్ షో తెలుగు వెర్షన్ ప్రైమ్ వీడియోలోకి రాబోతోంది. అయితే ఈ అప్‌కమింగ్ షోకి మన టాలీవుడ్ యంగ్ స్టార్ తేజ సజ్జా హోస్ట్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. హిందీలో రాబోతున్న ట్రైటర్స్ షోను బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్నాడు. జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో ఈ షో జరగనుంది.
ఇన్‌స్పెక్టర్ రిషి సీజన్ 2
నవీన్ చంద్ర మెయిన్ లీడ్‌గా ప్రైమ్ వీడియోలో వచ్చిన హారర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది. రిలీజ్ అయిన రెండేళ్ల తర్వాత ఇప్పుడు సీజన్ 2 తో రాబోతోంది. కొన్ని కిడ్నాప్స్ వెనుక ఉన్న సూపర్ నేచురల్ ఫోర్స్ గురించి ఇన్వెస్టిగేట్ చేయడానికి ఇన్‌స్పెక్టర్ రిషి మళ్లీ వస్తున్నాడు. నందిని జేఎస్ క్రియేట్ చేసిన ఈ అప్‌కమింగ్ తమిళ వెబ్ సిరీస్ ఆడియన్స్‌కు మరో గ్రిప్పింగ్ వాచ్ ఇస్తుందని మేకర్స్ ప్రామిస్ చేస్తున్నారు. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది.
ఎగ్జామ్
పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్ చుట్టూ జరిగే ఒక భారీ స్కామ్ నేపథ్యంలో ఈ అప్‌కమింగ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతోంది. ఎంతోమంది స్టూడెంట్స్ భవిష్యత్తు గాల్లో దీపంలా మారిన టైమ్‌లో.. ఒక యువతి ఆ పేపర్ లీక్ నెట్‌వర్క్‌ను, ఆ స్కామ్ వెనుక ఉన్న పెద్ద తలకాయలను బయటపెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఈ తమిళ వెబ్ సిరీస్‌లో దుషార విజయన్ మెయిన్ లీడ్ చేయగా.. 1990లలో పాపులర్ యాక్టర్‌గా ఉన్న అబ్బాస్ కూడా ఇందులో నటిస్తున్నాడు. ఫేమస్ ఫిల్మ్ మేకర్ జోడీ పుష్కర్, గాయత్రి ఈ ప్రాజెక్ట్‌కు క్రియేటివ్ ప్రొడ్యూసర్స్.
ఇసకపట్నం
పవర్‌ఫుల్ నాయుడు నిర్మించిన పోర్ట్ టౌన్ ఇసకపట్నం చుట్టూ తిరిగే మరో ఇంట్రెస్టింగ్ తెలుగు వెబ్ సిరీస్ ఇది. 1990ల బ్యాక్‌డ్రాప్‌లో సెట్ అయిన ఈ సిరీస్‌ను గ్యారీ బిహెచ్ డైరెక్ట్ చేస్తున్నాడు. న్యాయం కోసం పోరాడే ఒక మహిళగా ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్ ఇందులో ఒక కీ రోల్ చేస్తోంది. సముద్రఖని, సునీల్, నరేష్ అగస్త్య లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ కూడా ఈ సిరీస్‌లో భాగమయ్యారు.
జగమే సంగీతం
క్లాసికల్ మ్యూజిక్ ప్యాట్రన్ అయిన సీనియర్ యాక్టర్ ప్రకాష్ రాజ్ మెయిన్ లీడ్‌గా వస్తున్న తెలుగు వెబ్ సిరీస్ జగమే సంగీతం. పవిత్రమైన ఆలయ నగరం వైకుంఠపురం నేపథ్యంలో ఈ స్టోరీ నడుస్తుంది. తన మ్యూజికల్ లెగసీని ముందుకు తీసుకెళ్లడానికి ఒక సరైన వారసుడిని వెతికే ప్రక్రియలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఎలా సాగిందనేది ఈ సిరీస్ స్టోరీ. పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో మధుబాల, శ్రీకాంత్ మేక కూడా కీ రోల్స్ చేస్తున్నారు.
వదంతి సీజన్ 2
టూరిస్ట్ ఫ్యామిలీ యాక్టర్ ఎం. శశికుమార్ మెయిన్ లీడ్‌గా మరో తమిళ ఒరిజినల్ వెబ్ సిరీస్ వదంతి తిరిగి వస్తోంది. మధురై అవుట్‌స్కర్ట్స్‌కు బదిలీ అయిన ఎస్ఐ మూసా రజా ఒక పాత కోల్డ్ కేస్‌ను క్లోజ్ చేస్తాడు. కానీ తాను ఒక అమాయకుడికి జీవిత ఖైదు పడేలా చేశానేమో అని నిజం తెలుసుకొని షాక్ అవుతాడు. ఎస్జే సూర్య మెయిన్ లీడ్‌గా చేసిన దీని ఫస్ట్ పార్ట్ వదంతి: ద ఫేబుల్ ఆఫ్ వెలోని 2022లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది.
గల్లీ
హైదరాబాద్ ఓల్డ్ సిటీలో జరిగే ఒక గల్లీ క్రికెట్ మ్యాచ్ చుట్టూ ఈ తెలుగు వెబ్ సిరీస్ తిరుగుతుంది. చాలా ఫ్రెండ్లీగా జరగాల్సిన ఒక గేమ్.. ప్లేయర్స్, క్రిమినల్స్, పోలీసులను ఒకే చోటికి ఎలా తీసుకొచ్చింది అనేది ఇందులో చూపించారు. ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తున్న ఈ తెలుగు వెబ్ సిరీస్‌లో సుధీర్ బాబుతో పాటు జేడీ చక్రవర్తి, హన్సిక, శ్రద్ధా శ్రీనాథ్, ఆదర్శ్ బాలకృష్ణ యాక్ట్ చేస్తున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


