OTT Horror: కూతురితో క్షుద్రపూజలు-పిల్లి మాయ చుట్టూ-ఇవాళ రెండు ఓటీటీల్లోకి వచ్చిన నవీన్ చంద్ర డార్క్ హారర్ థ్రిల్లర్

OTT Horror: ఫ్రైడే వచ్చిందంటే ఓటీటీలో కొత్త సినిమాలు, సిరీస్ ల జోష్ ఉంటుంది. ఈ రోజు కూడా అలాగే ఓటీటీలోకి ఓ తెలుగు డార్క్ హారర్ థ్రిల్లర్ వచ్చింది. నవీన్ చంద్ర లీడ్ రోల్ ప్లే చేసిన ఈ మూవీ ఇవాళ రెండు ఓటీటీల్లో రిలీజైంది. 

Published on: Feb 27, 2026, 10:15:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇవాళ ఓటీటీలోకి భయపెట్టే ఓ హారర్ థ్రిల్లర్ వచ్చేసింది. ఒకే రోజు రెండు ఓటీటీల్లో అడుగుపెట్టిన ఆ తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమానే ‘హనీ’. ఇందులో నవీన్ చంద్ర లీడ్ రోల్ ప్లే చేశాడు. కూతురితో క్షుద్రపూజలు చేసే సైకో తండ్రి కథ చుట్టూ హనీ మూవీ సాగుతుంది.

ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ (x)
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ (x)

హనీ ఓటీటీ

నవీన్ చంద్ర, దివ్య పిళ్లై జంటగా నటించిన తెలుగు హారర్ థ్రిల్లర్ ‘హనీ’. ఈ డార్క్ హారర్ మూవీ ఇవాళ (ఫిబ్రవరి 27) ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు సన్ నెక్ట్స్ ఓటీటీల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రైమ్ వీడియోలోనేమో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా చూడొచ్చు. సన్ నెక్ట్స్ లో తెలుగు, తమిళంలో అందుబాటులో ఉంది.

నెల రోజుల్లోపే

హారర్ థ్రిల్లర్ హనీ మూవీ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా ఫిబ్రవరి 2, 2026న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో నవీన్ చంద్ర, దివ్య పిళ్లై, బిగ్ బాస్ దివి, రాజా రవీంద్రన్, జయన్ని తదితరులు నటించారు. ఈ సినిమాకు కరుణ్ కుమార్ డైెరెక్టర్. అతను అంతకుముందు పలాస సినిమాకు దర్శకత్వం వహించాడు.

హనీ కథ

మూఢ నమ్మకాలు, క్షుద్ర పూజల చుట్టూ తిరిగే కథతో తెరకెక్కిన సినిమా హనీ. ఇందులో తన సొంత కూతురితోనే తండ్రి (ఆనంద్) క్షుద్ర పూజలు చేసి డబ్బులు సంపాదించాలని అనుకుంటాడు. ఆనంద్ (నవీన్ చంద్ర) మూఢ నమ్మకాల మాయలో పడిపోతాడు. అతను క్షుద్ర పూజలు, తాంత్రిక విద్యలు నేర్చుకుంటాడు. ఈ కారణంగానే తన ఉద్యోగం కోల్పోతాడు. పూర్తిగా క్షుద్రపూజలనే నమ్ముకుంటాడు.

పిల్లి మాయ

తన గురువు సారంగపాణి (రాజా రవీంద్ర)తో కలిసి ఈజీగా డబ్బు సంపాదించడం కోసం పిల్లి మాయను అమ్మాలనుకుంటాడు. అయితే పిల్లి మాయ సేకరించడం అంత ఈజీ కాదు. దీని కోసం ఆడపిల్లలతో పూజలు చేయాల్సి ఉంటుంది. అందుకు తన కూతురు మీరా (జయన్ని)ను ఆనంద్ సెలక్ట్ చేసుకుంటాడు. ఫస్ట్ మీరా తల్లి లలిత (దివ్య పిళ్లై) అందుకు ఒప్పుకోదు. కానీ ఆనంద్ బలవంతంతో లలిత ఒప్పుకోవాల్సి వస్తుంది.

సారంగపాణి ఇంట్లో గురువు, ఆనంద్ కలిసి క్షుద్ర పూజలు చేస్తారు. మరి దీని కారణంగా లలిత, మీరా ఎలాంటి ఇబ్బందులు పడ్డారు. అసలు పిల్లి మాయ అంటే ఏంటీ? దీనికి క్షుద్రపూజలకు సంబంధం ఏంటీ? అన్నది హనీ మూవీలో చూసి తెలుసుకోవాల్సిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More