OTT Ban: పోర్న్ కంటెంట్, న్యూడ్ సీన్లు స్ట్రీమింగ్.. ప్రభుత్వం సీరియస్.. 5 ఓటీటీ ప్లాట్ ఫామ్స్ బ్యాన్

OTT Ban: పోర్న్ కంటెంట్, న్యూడ్ సీన్లను స్ట్రీమింగ్ చేస్తున్న ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై భారత కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. ఇలాంటి 5 ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై బ్యాన్ విధించింది. ఎలాంటి కంటెంట్ స్ట్రీమింగ్ చేయకుండా వీటిని నిషేధించింది. 

Published on: Feb 25, 2026, 09:22:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పోర్న్ కంటెంట్, న్యూడ్ సీన్లు, అశ్లీల సన్నివేశాలు స్ట్రీమింగ్ చేస్తున్న ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. ఏకంగా అయిదు ఓటీటీలను బ్యాన్ చేసింది. ఏ కంటెంట్ స్ట్రీమింగ్ చేయకుండా వీటిని నిషేధించింది. ఈ మేరకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేసింది.

ఓటీటీ యాప్స్ పై బ్యాన్ (Pixabay/Representative image)
ఓటీటీ యాప్స్ పై బ్యాన్ (Pixabay/Representative image)

5 ఓటీటీలు బ్యాన్

ఓటీటీల పేరుతో పోర్న్ కంటెంట్, అశ్లీల సీన్లు స్ట్రీమింగ్ చేస్తున్న ప్లాట్ ఫామ్స్ పై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. 5 ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ను బ్యాన్ చేసింది. మూడ్ ఎక్స్ వీఐపీ (MoodXVIP), కోయల్ ప్లే ప్రో (Koyal Playpro), డిజి మూవీప్లెక్స్ (Digi Movieplex), ఫీల్ (Feel), జుగ్ను (Jugnu) ఓటీటీలను ప్రభుత్వం నిషేధించింది.

యాక్సెస్ నిలిపివేయాలని

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021, అశ్లీలతకు వ్యతిరేక చట్టాల కింద ఈ ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్ కు యాక్సెస్‌ను నిలిపివేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000లోని సెక్షన్ 69A ప్రకారం ఆన్ లైన్ కంటెంట్ ను వివిధ కారణాలతో నిలిపివేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది.

2025లో కూడా

2025లో కూడా పోర్నోగ్రాఫిక్, పోర్న్ కంటెంట్ ను స్ట్రీమింగ్ చేస్తున్నాయనే కారణంతో 25 ఓటీటీ యాప్స్, వెబ్ సైట్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఇందులో ALTBalaji, ULLU, Big Shots App, Des Flix, Boomex, Navarasa Lite, Gulab App లాంటివి ఉన్నాయి. ఈ ప్లాట్‌ ఫామ్స్ లోని కంటెంట్ భారతీయ చట్టాలను తీవ్రంగా ఉల్లంఘించినట్లు తేలిన తర్వాత ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

వేరే డొమైన్లతో

ఐ&బీ మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 2024లో ఈ 25 ప్లాట్‌ఫారమ్‌లకు హెచ్చరికలు జారీ చేసింది. అయినా చాలామంది నోటీసులను పట్టించుకోకుండా ప్రత్యామ్నాయ డొమైన్‌లను ఉపయోగించి అభ్యంతరకరమైన కంటెంట్ స్ట్రీమింగ్ ను కొనసాగించారు. బ్యాన్ చేసిన ఓటీటీలు కూడా డొమైన్ మార్చి పోర్న్ కంటెంట్ ను స్ట్రీమింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో వీటిపై కఠిన చర్యలు తీసుకున్నారు.

Ullu ఓటీటీలో ఇలాంటి 100కి పైగా వెబ్ సిరీస్‌లను తొలగించారు. కానీ తర్వాత వీటిని మళ్లీ అప్ లోడ్ చేశారని తెలిసింది. ప్రభుత్వం సీరియస్ గా చెప్పడంతో ఉల్లు ఓటీటీలోని "హౌస్ అరెస్ట్" అనే వెబ్ సిరీస్ ను మే 2025లో తొలగించారు. ఇలాంటి ఓటీటీ కంటెంట్ కారణంగా తీవ్రమైన దుష్పరిణామాలు ఎదురవుతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More