OTT Series: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కొత్త ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. వైవా హర్ష పెళ్లి కష్టాలు.. ట్రైలర్ అదుర్స్

OTT Series: ఓటీటీలోకి మరో కామెడీ డ్రామా సిరీస్ రాబోతుంది. ఇప్పటికే ఓ సారి స్ట్రీమింగ్ వాయిదా పడ్డ ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వెబ్ సిరీస్ ఓటీటీ కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఇవాళ రిలీజైన ఈ సిరీస్ ట్రైలర్ కూడా అదిరిపోయింది.

Published on: Oct 3, 2026, 20:41:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

OTT Series: ఓటీటీలోకి డిఫరెంట్ జోనర్ల వెబ్ సిరీస్ లు వస్తూనే ఉన్నాయి. తెలుగులో వేర్వేరు స్టోరీలతో వచ్చిన సిరీస్ లకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఇప్పుడు తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సిరీస్ వచ్చేస్తోంది.

లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కొత్త ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. వైవా హర్ష పెళ్లి కష్టాలు.. ట్రైలర్ అదుర్స్ (x)
లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కొత్త ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. వైవా హర్ష పెళ్లి కష్టాలు.. ట్రైలర్ అదుర్స్ (x)

లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఓటీటీ

సరికొత్త సినిమాలు, ఒరిజినల్ కంటెంట్ తో ఓటీటీ లవర్స్ కు వినోదాల విందు అందిస్తున్న ఈటీవీ విన్ లో ఈ లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సిరీస్ రాబోతుంది. ఇప్పటికే ఒకసారి ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 30న ఓటీటీలోకి వస్తుందని అన్నారు. కానీ తర్వాత వాయిదా వేశారు.

కొత్త డేట్ ఇదే

లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వెబ్ సిరీస్ కొత్త స్ట్రీమింగ్ డేట్ ను మేకర్స్ ఇవాళ (అక్టోబర్ 3) అనౌన్స్ చేశారు. ఈ కామెడీ డ్రామా వెబ్ సిరీస్ అక్టోబర్ 9 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ఈ సిరీస్ లో కమెడియన్ వైవా హర్ష లీడ్ రోల్ ప్లే చేశాడు.

అదిరిన ట్రైలర్

రీసెంట్ గా రిలీజ్ చేసిన లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్రైలర్ అదిరిపోయింది. ఓ బ్యాచిలర్ పెళ్లి కష్టాలను ఇందులో ప్రధానంగా చూపించారు. తన కొడుకును లవ్ చేయమని అమ్మాయిలను ఆ తండ్రి అడగడం డిఫరెంట్ గా ఉంది.

ఇక ఐటీ కంపెనీలో చేరితే అమ్మాయిలు ఎక్కువగా ఉంటారని, వాళ్లలో ఒకరిని లవ్ చేయొచ్చని ఫ్రెండ్ ఇచ్చిన సలహాతో హీరో జాబ్ లో చేరతాడు. కానీ అక్కడ అతణ్ని ఎవరూ లవ్ చేయరు.

ఎమోషనల్ టచ్ కూడా

చివరకు హీరోకు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. ఆ అమ్మాయితో కలిసి హీరో ఒకే ప్లాట్ లో ఉంటాడు. కానీ ఆ అమ్మాయికి అతనంటే ఇష్టం ఉండదు. ఈ నేపథ్యంలో వచ్చే ఎమోషనల్ సీన్లు టచింగ్ గా ఉన్నాయి. మొత్తంగా కామెడీతో పాటు ఎమోషనల్ గానూ ఆడియన్స్ ను అలరించేలా ఈ సిరీస్ ను రెడీ చేశారని అర్థమవుతోంది.

ఈ లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వెబ్ సిరీస్ లో వైవా హర్షతో పాటు హైపర్ ఆది, జీవన్ తదితర కమెడిన్లు కూడా కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా హైపర్ ఆది పంచ్ లు బాగా పేలుతాయనిపిస్తోంది. యూత్, ఫ్యామిలీకి ఈ లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వెబ్ సిరీస్ మంచి ఆప్షన్ కానుందని చెప్పొచ్చు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More