Telugu Web Series: తెలుగులో మరో క్రేజీ వెబ్ సిరీస్.. బ్యాచిలర్ మోడ్‌లోకి వైవా హర్ష.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
Telugu Web Series: తెలుగులో మరో క్రేజీ వెబ్ సిరీస్ రాబోతోంది. వైవా హర్ష లీడ్ రోల్లో నటించిన లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే ఈ సిరీస్ సెప్టెంబర్ 18 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది.
Telugu Web Series: టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ చేతుల మీదుగా కమెడియన్, హీరో వైవా హర్ష లేటెస్ట్ వెబ్ సిరీస్ 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' (Least Eligible Bachelor) పోస్టర్, స్ట్రీమింగ్ డేట్ గ్రాండ్‌గా లాంచ్ అయ్యాయి. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఈటీవీ విన్' (ETV Win) నిర్మిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ క్యూట్ అండ్ క్రేజీ ఎంటర్‌టైనర్ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 18వ తేదీ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్‌కు రాబోతోంది.

బ్యాచ్‌లర్ లైఫ్‌లోని కామెడీ, కన్ఫ్యూజన్, పెళ్లి చూపుల డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ ఒరిజినల్ వెబ్ సిరీస్ పోస్టర్‌ను 'డీజే టిల్లు' ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. "సింగిల్‌గా ఉన్నాడు.. రెడీగా ఉన్నాడు.. కానీ మనోడు పెళ్లికి ఎలిజిబులేనా?" అంటూ ఈటీవీ విన్ టీమ్ వదిలిన క్యాప్షన్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
'టిల్లు' చేతుల మీదుగా బ్యాచ్‌లర్ హంగామా
ఈ మధ్యకాలంలో విభిన్నమైన కథాంశాలతో వస్తున్న తెలుగు ఓటీటీ కంటెంట్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ బ్యాచిలర్ లైఫ్ కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. అందుకే ఈ 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సిరీస్ డేట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను సిద్ధుతో లాంచ్ చేయించడం ప్రాజెక్ట్‌పై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.
తాజాగా స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ కూడా ఇంట్రెస్టింగా ఉంది. పెళ్లి కోసం ఫ్రస్ట్రేట్ అవుతున్న హర్షను ఈ పోస్టర్ లో చూడొచ్చు.
యూట్యూబ్ నుంచి హీరో వరకు.. వైవా హర్ష క్రేజ్
వైవా అనే యూట్యూబ్ షార్ట్ ఫిలింతో టాలీవుడ్‌లో ఓవర్‌నైట్ పాపులర్ అయిన హర్ష చెముడు.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా డజన్ల కొద్దీ సినిమాల్లో నవ్వించారు. 'కలర్ ఫోటో' సినిమాలో సీరియస్ రోల్‌తో మెప్పించిన హర్ష.. రీసెంట్‌గా 'సుందరం మాస్టర్' సినిమాతో సోలో హీరోగా మారి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నారు.
ఇప్పుడు 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'తో మరోసారి పూర్తిస్థాయి కామెడీ రోల్‌లో అలరించేందుకు సిద్ధమయ్యారు. పెళ్లి ఈడు వచ్చిన ఒక యంగ్ కుర్రాడు పడే తిప్పలు, సమాజం నుంచి ఎదురయ్యే ప్రశ్నలు, పెళ్లి సంబంధాల చుట్టూ తిరిగే పక్కా మిడిల్ క్లాస్ హ్యూమర్‌తో ఈ సిరీస్ రూపుదిద్దుకుంది.
ఈటీవీ విన్ సక్సెస్ గ్రాఫ్.. నెక్ట్స్ లెవెల్ ఎంటర్‌టైన్‌మెంట్
తెలుగు నేటివిటీ ఉన్న విలేజ్ అండ్ యూత్‌ఫుల్ డ్రామాలతో 'ఈటీవీ విన్' ఓటీటీ మార్కెట్‌లో తనదైన ముద్ర వేస్తోంది. '90s: ఎ మిడిల్ క్లాస్ బయోపిక్', 'వీరాంజనేయులు విహారయాత్ర', 'మాన్షన్ హౌస్ మల్లేష్' ఈ మధ్యే వచ్చిన గుర్తుకొస్తున్నాయి లాంటి వెబ్ సిరీస్‌లు, ఒరిజినల్ ఫిల్మ్స్ అక్కడ బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి.
అదే జోరును కొనసాగిస్తూ సెప్టెంబర్ 18న వస్తున్న 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' కూడా ఆడియన్స్‌కు అన్‌లిమిటెడ్ ఫన్ అందించడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్టర్, స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్‌మెంట్ విపరీతంగా ట్రెండింగ్‌లో నిలిచాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


