Bigg Boss 10 Elimination: బిగ్ బాస్ 10 నుంచి సృష్టి ఎలిమినేట్‌.. సుధీర్‌తో గొడ‌వ‌.. నాలుగు వారాల రెమ్యునరేషన్ ఎంతంటే?

Bigg Boss 10 Elimination: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ హౌస్ నుంచి బిగ్ అప్డేట్. ఈ వారం సృష్టి వ్యాకరణం ఎలిమినేట్ అయినట్లు సమాచారం. బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో ఈ మోడల్ జర్నీ ముగిసిందని తెలిసింది. మరి ఈ నాలుగు వారాల్లో సృష్టి ఎంత సంపాదించిందో చూసేయండి. 

Published on: Oct 4, 2026, 07:53:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Bigg Boss 10 Elimination: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో మోడల్ సృష్టి వ్యాకరణం జర్నీ ముగిసిందని తెలిసింది. ఈ భామ నాలుగో వారంలో హౌస్ నుంచి ఎలిమినేట్ అయిందని సమాచారం. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన సృష్టి వ్యాకరణం.. అగ్నిపరీక్షలో సత్తాచాటి బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో అడుగుపెట్టింది.

బిగ్ బాస్ 10 నుంచి సృష్టి ఎలిమినేట్‌.. సుధీర్‌తో గొడ‌వ‌.. నాలుగు వారాల రెమ్యునరేషన్ ఎంతంటే? (instagram)
బిగ్ బాస్ 10 నుంచి సృష్టి ఎలిమినేట్‌.. సుధీర్‌తో గొడ‌వ‌.. నాలుగు వారాల రెమ్యునరేషన్ ఎంతంటే? (instagram)

బిగ్ బాస్ ఎలిమినేషన్

బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ నాలుగో వారంలో ఎలిమినేషన్ ట్విస్ట్ చోటు చేసుకుందని తెలిసింది. జనాల ఓటింగ్ ఆధారంగా సృష్టి వ్యాకరణం హౌస్ నుంచి ఎగ్జిట్ కావాల్సి వచ్చిందని అంటున్నారు. అయితే ఈ వారం ఓటింగ్ అంతా తారుమారు అవుతూ వచ్చిందనే టాక్ ఉంది. ఫస్ట్ సృష్టి వ్యాకరణం, ఆ తర్వాత దేబ్జానీ, అమన్ డేంజర్ జోన్లో ఉన్నారు.

కానీ ఇప్పడు చివరకు వచ్చేసరికి సృష్టి వ్యాకరణం బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయి వెళ్లిపోయిందని తెలిసింది. జనాలు ఆమెకు ఓట్లు వేయలేదని టాక్. దీంతో సృష్టి వ్యాకరణం హౌస్ నుంచి వెళ్లిపోక తప్పలేదు.

సుధీర్ తో గొడవ

కామనర్ గా అగ్నిపరీక్ష సీజన్ 2లో సృష్టి వ్యాకరణం పోటీ పడింది. అక్కడ సత్తాచాటి బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ కు ఎంపికైంది. హౌస్ లోకి అడుగుపెట్టి తనదైన స్టైల్లో ఆడింది. అయితే సెకండ్ వీక్ అంతా సృష్టి వ్యాకరణం ఆట డల్ గానే సాగింది. దీంతో వీకెండ్ లో పక్కన కూర్చోబెట్టి నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు.

ఆ తర్వాత మూడో వీక్ నామినేషన్లో సృష్టి వ్యాకరణం రెచ్చిపోయింది. సుధీర్ అంటే సృష్టి అనేలా కామెంట్లు రావడంతో ఆమె కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయింది. సుధీర్ ను నానా మాటలు అన్నది. గుద్దితే పళ్లు రాలిపోతాయని ఆవేశంతో ఊగిపోయింది. ఈ గొడవ సృష్టికి చేటు చేసిందనే టాక్ ఉంది.

రెమ్యునరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో సృష్టి వ్యాకరణం నాలుగు వారాలు ఉంది. అంతకుముందు అగ్నిపరీక్షలో పోటీపడింది. అగ్నిపరీక్ష నుంచి ఆమెకు రూ.50 వేలు వచ్చాయి. ఇక బిగ్ బాస్ హౌస్ లో వారానికి రూ.75 వేల చొప్పున ఆమెకు రెమ్యునరేషన్ ఫిక్స్ చేశారని తెలిసింది.

అంటే నాలుగు వారాలకు కలిపి బిగ్ బాస్ నుంచి సృష్టి వ్యాకరణం రూ.3 లక్షలు సంపాదించిందన్నమాట. ఇక అగ్నిపరీక్ష కూడా కలుపుకొంటే మరో రూ.50 వేలు అదనంగా ఖాతాలో చేరాయని చెప్పొచ్చు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More