Jailer 2 Review: జైలర్ 2 రివ్యూ.. టైగర్ ఈజ్ బ్యాక్.. నెల్సన్ మ్యాజిక్.. రజినీకాంత్ బ్లాక్ బస్టర్ సీక్వెల్ ఎలా ఉందంటే?

Jailer 2 Review: 2023లో వచ్చిన జైలర్ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రజినీకాంత్ స్వాగ్ వేరే లెవల్ లో కనిపించింది. ఇప్పుడా చిత్రానికి సీక్వెల్ గా జైలర్ 2 వచ్చేసింది. ఇవాళ థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఎలా ఉంది? అనేది జైలర్ 2 రివ్యూలో చూసేయండి.

Published on: Oct 15, 2026, 12:08:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Jailer 2 Review:

జైలర్ 2 రివ్యూ.. టైగర్ ఈజ్ బ్యాక్.. నెల్సన్ మ్యాజిక్.. రజినీకాంత్ బ్లాక్ బస్టర్ సీక్వెల్ ఎలా ఉందంటే? (x/sunpictures)
జైలర్ 2 రివ్యూ.. టైగర్ ఈజ్ బ్యాక్.. నెల్సన్ మ్యాజిక్.. రజినీకాంత్ బ్లాక్ బస్టర్ సీక్వెల్ ఎలా ఉందంటే? (x/sunpictures)

సినిమా : జైలర్ 2

నటీనటులు : రజినీకాంత్, ఎస్జే సూర్య, విద్యా బాలన్, మిథున్ చక్రవర్తి, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, సూరజ్ వెంజారముడు, ర‌మ్య‌కృష్ణ‌ తదితరులు

డైరెక్టర్ : నెల్సన్ దిలీప్ కుమార్

రిలీజ్ డేట్ : అక్టోబర్ 15, 2026

మ్యూజిక్ డైరెక్టర్ : అనిరుధ్ రవిచందర్

సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటించిన మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ 'జైలర్ 2' (Jailer 2) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేసింది. జైలర్ సృష్టించిన సంచలనం తర్వాత, డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ (Nelson Dilipkumar) ఈసారి ఎలాంటి ప్లాన్ చేశారు? అసలు టైగర్ ముత్తువేల్ పాండియన్ గా రజినీకాంత్ ఈసారి వేటాడిన నెట్‌వర్క్ ఏంటి? థియేటర్లలో ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో జైలర్ 2 రివ్యూలో చూసేద్దాం!

కథేంటంటే..

జైలర్ సినిమాలో తన కొడుకు అర్జున్‌ను కాపాడుకునే క్రమంలో విలన్ వర్మన్‌ను అంతం చేసిన టైగర్ ముత్తువేల్ పాండ్యన్ (రజినీకాంత్), ఆ తర్వాత తన కుటుంబంతో కలిసి ప్రశాంతమైన రిటైర్డ్ జీవితాన్ని గడుపుతుంటాడు. కానీ, ఆ ప్రశాంతత ఎంతో కాలం నిలవదు. వర్మన్ వెనుక ఉండి నడిపించిన ఒక అంతర్జాతీయ డార్క్ మాఫియా నెట్‌వర్క్.. ముత్తువేల్ పాండ్యన్ కుటుంబంపై పగ తీర్చుకోవడానికి ప్లాన్ చేస్తుంది.

ఈసారి విలన్ గ్రూప్ ముత్తువేల్ పాండ్యన్ మనవడిని టార్గెట్ చేసి కిడ్నాప్ చేస్తుంది. తన కుటుంబానికి మళ్లీ ముప్పు పొంచి ఉందని, ఈ గ్లోబల్ మాఫియాను రూట్ నుంచి పీకేయకపోతే తన వాళ్లు ప్రశాంతంగా బతకలేరని ముత్తువేల్ గ్రహిస్తాడు. దాంతో సైలెంట్‌గా ఉన్న టైగర్ మళ్లీ వేట మొదలుపెడతాడు.

తన పాత జైలర్ నెట్‌వర్క్, దేశవ్యాప్తంగా ఉన్న తన స్నేహితుల (మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్) సహాయంతో ఈ అంతర్జాతీయ ముఠా గుట్టును ఎలా రట్టు చేశాడు? ఈ క్రమంలో ముత్తువేల్ పాండ్యన్‌కు ఎదురైన కొత్త శత్రువులు ఎవరు? చివరకు తన మనవడిని రక్షించుకుని ఆ డార్క్ నెట్‌వర్క్‌ను ఎలా ముగించాడు? అనేదే ‘జైలర్ 2’ కథ.

థియేటర్లలో ప్యూర్ 'మాస్' జాతర

జైలర్ 2 సినిమా ఫస్ట్ హాఫ్ మాత్రం అరాచకం అని చెప్పాలి. నెల్సన్ మార్క్ డార్క్ హ్యూమర్, అదిరిపోయే కామెడీ టైమింగ్, అదుర్స్ అనిపించే ఎలివేషన్ సీన్స్ థియేటర్లలో పూనకాలు తెప్పిస్తాయి. ముఖ్యంగా రజినీకాంత్ మార్క్ స్టైల్, ఒక టీ స్టాల్ సీన్, ఇంటర్వెల్ బ్లాక్ అయితే థియేటర్లను షేక్ చేశాయి. ఫ్యాన్స్‌కు ఏం కావాలో అవన్నీ నెల్సన్ ఫస్ట్ హాఫ్‌లో పక్కాగా ప్లాన్ చేశారు.

స్లో స్క్రీన్‌ప్లే

ఫస్ట్ హాఫ్ ఇచ్చిన హై తర్వాత సెకండ్ హాఫ్‌లోజైలర్ 2 మూవీ కాస్త ట్రాక్ తప్పినట్లు అనిపించింది. స్క్రీన్‌ప్లే నెమ్మదించడం, కథ చాలా ప్రిడిక్టబుల్ గా మారడం సినిమాకు మైనస్ అని చెప్పాలి. కొన్ని ఎమోషనల్ సీన్లు సాగదీసినట్లు అనిపిస్తాయి. అయితే, సినిమా రన్‌టైమ్ కాస్త తక్కువగా ఉండటం వల్ల పెద్దగా బోర్ కొట్టకుండా, యాక్షన్ సీక్వెన్స్‌లతో నెల్సన్ కథను ముగించాడు. అలాగే జైలర్ 3పై హింట్ కూడా ఇచ్చి ఫ్యాన్స్ ను ఫుల్ ఖుష్ చేశాడు.

ఎవరెలా చేశారంటే?

టైగర్ ముత్తువేల్ పాండ్యన్ పాత్రలో రజినీకాంత్ వన్ మ్యాన్ షో చేశారు. 70 ప్లస్ ఏజ్‌లో కూడా ఆయన చూపించిన స్క్రీన్ ప్రెజెన్స్, స్వాగ్, డైలాగ్ డెలివరీ అద్భుతం. సినిమాను తన భుజాలపై మోశారు.

విలన్లుగా నటించిన ఎస్‌జే సూర్య (SJ Suryah), విద్యాబాలన్ (Vidya Balan), మిథున్ చక్రవర్తి పాత్రలు బాగున్నప్పటికీ, జైలర్ సినిమాలో విలన్ 'వర్మన్' రేంజ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయాయి.

అయితే సినిమాకు అసలైన మెరుపులు మాత్రం క్యామియోలే. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ మళ్లీ తమ పవర్‌ఫుల్ అప్పీయరెన్స్‌తో అలరించారు. ఈసారి బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, విజయ్ సేతుపతిల సర్ ప్రైజ్ ఎంట్రీలు థియేటర్లలో విజిల్స్ వేయించాయి. ఇక నమో నారాయణన్ తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు. అతని కెరీర్ లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు.

టెక్నికల్ గా ఎలా ఉందంటే?

ఈ జైలర్ 2 సినిమాకు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పిల్లర్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander). బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM)తో థియేటర్లను దద్దరిల్లేలా చేశాడు. "హుకుమ్" రీలోడెడ్ వెర్షన్ సీన్ల రేంజ్‌ను మార్చేసింది.

ఇక విజువల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. డార్క్ థీమ్, యాక్షన్ సీన్లను కెమెరామెన్ అద్భుతంగా క్యాప్చర్ చేశారు. ఎడిటింగ్ సెకండ్ హాఫ్‌లో ఇంకాస్త క్రిస్ప్‌గా ఉంటే బాగుండేది.

ఫైనల్ గా..

ఓవరాల్ గా చెప్పాలంటే.. ‘జైలర్ 2’ సినిమా జైలర్ మూవీ అంత ఎమోషనల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయినా, ఒక పక్కా కమర్షియల్ యాక్షన్ సీక్వెల్‌గా నిలబడుతుంది. కథలో కొత్తదనం లేకపోయినా రజనీకాంత్ స్వాగ్, నెల్సన్ ఫస్ట్ హాఫ్ కామెడీ, అనిరుధ్ బిజిఎమ్, క్రేజీ క్యామియోల కోసం ఈ సినిమాను ఖచ్చితంగా థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయొచ్చు!

రేటింగ్: 3/5

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More