Jailer 2 Twitter Review: జైలర్ 2 ట్విట్టర్ రివ్యూ.. కేక పెట్టించే ఫస్టాఫ్.. మరి సెకండాఫ్? నెటిజన్ల షాకింగ్ రియాక్షన్!
Jailer 2 Twitter Review: సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్, సినీ లవర్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా వెయిట్ చేసిన జైలర్ 2 మూవీ ఇవాళ థియేటర్లకు వచ్చేసింది. ఈ సినిమా స్పెషల్ షోలు చూసిన నెటిజన్ల తమ రివ్యూలను ఎక్స్ లో పోస్టు చేస్తున్నారు. ఫస్టాఫ్ కేక అంటున్నారు. జైలర్ 2 పూర్తి ట్విట్టర్ రివ్యూ ఇక్కడ చూసేయండి.
Jailer 2 Twitter Review: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth), సెన్సేషనల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ 'జైలర్ 2' (Jailer 2) నేడు (అక్టోబర్ 15) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేసింది. ముత్తువేల్ పాండియన్‌గా తలైవర్ మళ్లీ వెండితెరపై విశ్వరూపం చూపించారు. సినిమా చూసిన ఆడియన్స్, నెటిజన్లు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తమ రివ్యూలను పంచుకుంటున్నారు. సోషల్ మీడియా టాక్ ప్రకారం సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

అదిరిపోయిన ఫస్టాఫ్
జైలర్ 2 సినిమా ఫస్టాఫ్ మాత్రం ప్రేక్షకుల చేత ఈలలు వేయించేలా ఉందంటూ నెటిజన్లు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నెల్సన్ మార్క్ ట్రేడ్‌మార్క్ డార్క్ కామెడీ, రాకింగ్ స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన మైండ్ బ్లోయింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM), సూపర్ స్టార్ ఎలివేషన్ సీన్స్ థియేటర్లలో పూనకాలు తెప్పించాయని పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ సినిమాకు ఒక పెద్ద హైలైట్ అని చెప్తున్నారు.
సెకండాఫ్‌లో తగ్గిన జోరు
ఫస్టాఫ్ ఇచ్చిన హైప్ తర్వాత.. సెకండాఫ్ ఆ స్థాయిని అందుకోలేకపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. బలహీనమైన కథనం, సాగదీసినట్లు ఉండే ఎమోషనల్ సీన్స్ వల్ల ద్వితీయార్థంలో సినిమా కాస్త స్లో అయిందని నెటిజన్లు అంటున్నారు. విలన్ ట్రాక్స్ ఆశించినంత ఇంపాక్ట్ చూపించలేకపోయాయని, కామెడీ కూడా సెకండాఫ్‌లో చాలా లిమిటెడ్‌గా మారి సినిమా గ్రాఫ్‌ను తగ్గించిందని ట్విట్టర్ రివ్యూలు ఇస్తున్నారు.
నటుడు 'నమో' అరాచకం
ఈ జైలర్ 2 సినిమాలో కామెడీ యాక్టర్ నమో నారాయణ తన కామెడీ టైమింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. రజినీకాంత్, యోగి బాబు కాంబినేషన్లో నమో చేసిన కామెడీ సినిమాకు ఒక మేజర్ ప్లస్ పాయింట్ అని, ఆయన కెరీర్లోనే ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు.
క్యామియోలు, యాక్షన్ బ్లాక్స్ వర్కవుట్ అయ్యాయా?
జైలర్ సినిమాతో పోలిస్తే జైలర్ 2 మూవీలో క్యామియో రోల్స్ కేవలం కథను ముందుకు నడిపించే పాత్రల్లాగే అనిపించాయని కొందరు అంటుండగా, మరికొందరు మాత్రం క్యామియోలు బాగున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఓవరాల్‌గా కొన్ని యాక్షన్ బ్లాక్స్, రజినీకాంత్ అన్మ్యాచ్డ్ ఆరా సినిమాను సేఫ్ జోన్లోకి తీసుకెళ్లాయని ట్వీట్లు చేస్తున్నారు.
యావరేజ్ టు హిట్!
నెటిజన్ల రివ్యూల ప్రకారం.. 'జైలర్ 2' ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్. అక్కడక్కడా కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, ఈ దసరా పండగ సీజన్‌కు థియేటర్లలో ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పొచ్చు. కొందరు దీనికి 3.25/5 రేటింగ్ ఇస్తూ దసరా బ్లాక్‌బస్టర్ అని కొనియాడుతుండగా, మరికొందరు మాత్రం ఫస్టాఫ్ హిట్.. సెకండాఫ్ యావరేజ్ అంటూ పోస్టులు పెడుతున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


