Jailer 2: బాక్సాఫీస్‌పై తలైవా దండయాత్ర.. జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ విధ్వంసం.. రికార్డులు బద్దలే.. జవాన్, యానిమల్ ఔట్!
Jailer 2 Advance Bookings Record: ఇదీ తలైవా అంటే.. ఇదీ రజనీకాంత్ క్రేజ్ అంటే! అవును.. జైలర్ 2 మూవీతో బాక్సాఫీస్ విధ్వంసానికి రజినీకాంత్ రెడీ అయ్యారు. ఈ సినిమా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఫస్ట్ డేనే రికార్డు ఓపెనింగ్స్ సాధించే దిశగా దూసుకెళ్తోంది.
Jailer 2 Advance Bookings Record: తలైవర్ ఈజ్ బ్యాక్! రజినీకాంత్ తన కెరీర్లోనే అత్యంత అరుదుగా చేస్తున్న సీక్వెల్ మూవీ ‘జైలర్ 2’ (Jailer 2) తో థియేటర్లలోకి అడుగుపెట్టేందుకు సర్వం సిద్ధమైంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్, ఈ గురువారం (అక్టోబర్ 15) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ట్రెండ్స్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద మరో తలైవర్ తుఫాన్ రాబోతోందని స్పష్టమవుతోంది.

వరల్డ్‌వైడ్ బుకింగ్స్ అరాచకం
ఇండియాలో అక్టోబర్ 10న ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా, అంతకు ఒక రోజు ముందే ఓవర్సీస్లో టికెట్ల అమ్మకాలు షురూ అయ్యాయి. టికెట్ విండోస్ వద్ద ఈ సినిమా బుకింగ్స్ రన్నింగ్ స్టార్ట్ అందుకున్నాయి. బుధవారం (అక్టోబర్ 14) ఉదయానికి ఈ సినిమా వీకెండ్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.80 కోట్ల మార్కును దాటడం విశేషం.
హిందీ డబ్బింగ్ వెర్షన్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేనప్పటికీ, ఈ సినిమాలో హాలీవుడ్, టాలీవుడ్, శాండల్‌వుడ్ తారల కలయిక, హృతిక్ రోషన్ క్యామియో రోల్ ఉందనే రూమర్స్ సినిమాను పాన్-ఇండియా రేంజ్‌కు తీసుకెళ్తున్నాయి.
తొలిరోజే ₹125 కోట్లకు పైగా
విడుదలకు మరో రోజు మాత్రమే సమయం ఉన్న వేళ, మొదటి రోజు (డే 1) అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఇండియాలో రూ.27 కోట్ల గ్రాస్ వసూలైంది. రజినీకాంత్ కెరీర్లో ‘కూలీ’ (రూ.46 కోట్లు) తర్వాత ఇదే అత్యధికం. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ రూ.35 కోట్లు దాటే అవకాశం ఉంది.
దీని ప్రకారం భారతదేశంలో తొలిరోజే రూ.50 కోట్ల కంటే ఎక్కువ నెట్ వసూళ్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే 2023 లో వచ్చిన పార్ట్ 1 (మొదటి రోజు రూ.48 కోట్లు) రికార్డును ‘జైలర్ 2’ బ్రేక్ చేస్తుంది.
ఓవర్సీస్లోనూ రికార్డుల వేట
విదేశాల్లో సైతం ‘జైలర్ 2’ కలెక్షన్ల జోరు కనిపిస్తోంది. పార్ట్ 1 ‘జైలర్’, విజయ్ ‘లియో’, రజినీకాంత్ ‘కూలీ’ చిత్రాల రికార్డులను సైతం ఇది దాటేసింది. ఓవర్సీస్ ప్రీ-సేల్స్ లోనే ఇప్పటికే ఈ సినిమా 3 మిలియన్ డాలర్లను దాటేసింది. విడుదల రోజున విదేశాల్లోనే 7 నుంచి 8 మిలియన్ డాలర్లు వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు లెక్కలు వేస్తున్నారు. అంటే, ప్రపంచవ్యాప్తంగా ‘జైలర్ 2’ మొదటి రోజు సులభంగా రూ.125 కోట్ల నుంచి రూ.140 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉంది.
పెద్ద సినిమాల రికార్డులు
ప్రపంచవ్యాప్తంగా తొలిరోజే రూ.120 కోట్ల మార్కును దాటితే.. తమిళ సినిమా చరిత్రలోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన మూడో చిత్రంగా ‘జైలర్ 2’ నిలుస్తుంది. ఇది రజినీకాంత్ గత బ్లాక్‌బస్టర్స్ ‘జైలర్’ (రూ.91 కోట్లు), ‘2.0’ (రూ.93 కోట్లు) రికార్డులను సులువుగా అధిగమిస్తుంది.
ఒకవేళ మొదటి రోజు వసూళ్లు రూ.140 కోట్లు దాటితే.. షారుఖ్ ఖాన్ ‘జవాన్’ (రూ.129 కోట్లు), రణ్‌బీర్ కపూర్ ‘యానిమల్’ (రూ.116 కోట్లు), యష్ ‘టాక్సిక్’ (రూ.136 కోట్లు) వంటి బిగ్గెస్ట్ ఇండియన్ సినిమాల రికార్డులను తలైవర్ తిరగరాయడం ఖాయం.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


