Jiohotstar Releases: రూ.5 వేల కోట్ల హారర్ థ్రిల్లర్ నుంచి జయసుధ వెబ్ సిరీస్ వరకు.. ఈవారం జియోహాట్‌స్టార్ టాప్ 6 ఇవే
Jiohotstar Releases: జియోహాట్‌స్టార్ అక్టోబర్ 26 నుంచి 30 మధ్య పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లను విడుదల చేస్తోంది. హాలీవుడ్ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ 'అబ్సెషన్' నుంచి తమిళ ఫాంటసీ లవ్ డ్రామా 'లవ్ ఆల్వేస్' వరకు విభిన్న జానర్లు అందుబాటులోకి రానున్నాయి.
Jiohotstar Releases: ఈ అక్టోబర్ చివరి వారం ఓటీటీ ప్రియులకు వినోదాల పండుగ కానుంది. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ ప్రేక్షకుల అభిరుచులకు తగినట్లుగా సరికొత్త కంటెంట్‌ను సిద్ధం చేసింది. అక్టోబర్ 26 నుంచి అక్టోబర్ 30 మధ్య విడుదలయ్యే ఈ టైటిల్స్ లో యాక్షన్, సైకలాజికల్ థ్రిల్లర్స్, డ్రామా, రొమాన్స్, కిడ్స్ ఎంటర్టైన్మెంట్ కేటగిరీలకు సంబంధించిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు అందుబాటులో ఉంటాయి. మీ వీకెండ్ వాచ్‌లిస్ట్‌ను ప్లాన్ చేసుకోవడానికి జియో హాట్‌స్టార్‌లో రాబోతున్న ఆ 6 ప్రధాన శీర్షికల పూర్తి వివరాలు ఇవే.

1. జబ్ జిద్ద్ పర్ ఆయీ పార్వతి (మైథాలజీ సిరీస్) — అక్టోబర్ 26
ఇటీవల థియేటర్లలో విడుదలైన 'హనుమాన్ అంశ్' చిత్రంలోని 'పార్వతి' పాట సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడమే కాకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఆ పాట తెచ్చిన క్రేజ్‌తో ప్రేరణ పొంది, పురాణాలలో పార్వతీ దేవి మహత్యం, ఆమె విశిష్టమైన కథల ఆధారంగా రూపొందించిన ఐకానిక్ మైథాలజికల్ సిరీస్ 'జబ్ జిద్ద్ పర్ ఆయీ పార్వతి'.
పార్వతీ దేవి పట్టుదల, ఆమె చూపిన శక్తివంతమైన రూపాలను ఆవిష్కరించే ఈ షో అక్టోబర్ 26 నుంచి జియోహాట్‌స్టార్‌లో వీక్షకులకు అందుబాటులోకి వచ్చింది.
2. కర్వాచౌత్: సాత్ జన్మోంకా ఉత్సవ్ (Karwa Chauth: 7 Janmon Ka Utsav) —అక్టోబర్ 29
దంపతుల ప్రేమానురాగాలకు నిదర్శనంగా భావించే కర్వాచౌత్ పండుగ సందర్భంగా జియోహాట్‌స్టార్ ప్రత్యేక ఈవెంట్ సిరీస్‌ను తీసుకువస్తోంది. 'కర్వాచౌత్: సాత్ జన్మోంకా ఉత్సవ్' పేరుతో రూపొందిన ఈ స్పెషల్ షోలో బుల్లితెర పాపులర్ జంటలైన కార్తీక్-నైరా, రమణ్-ఇషిత తదితర పాత్రల ప్రయాణాన్ని, పెళ్లి బంధంలోని అందమైన జ్ఞాపకాలను చూపిస్తారు. అక్టోబర్ 29న ఈ పండుగ ప్రత్యేక సిరీస్ డిజిటల్ ప్రీమియర్ కానుంది.
3. లవ్ ఆల్వేస్ (Love Always ) — అక్టోబర్ 30
తమిళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న వినూత్నమైన ఫాంటసీ రొమాంటిక్ డ్రామా సిరీస్ 'లవ్ ఆల్వేస్'. తెలుగు సీనియర్ నటి జయసుధ నటించిన సిరీస్ కావడం విశేషం. విభిన్న వయసులకు చెందిన జంటల మధ్య ఉండే ప్రేమ, అనుబంధాలు, వారి జీవితాల్లో ఎదురయ్యే ఊహించని మలుపుల ఆధారంగా దర్శకురాలు మధుమిత సుందరరామన్ దీనిని తెరకెక్కించారు. ఫాంటసీ, ఎమోషనల్ కథాంశాలను ఇష్టపడే వారికి ఈ సిరీస్ అక్టోబర్ 30 నుంచి అందుబాటులో ఉంటుంది.
4. అబ్సెషన్ (Obsession) — అక్టోబర్ 30
అమెరికన్ థియేటర్లలో విమర్శకుల ప్రశంసలు పొందిన హాలీవుడ్ సూపర్ నేచురల్ సైకలాజికల్ థ్రిల్లర్ 'అబ్సెషన్'. ఒక యువకుడి వన్ సైడ్ లవ్ ఎలా విపరీతమైన ఆరాధనగా, ఆపై భయంకరమైన సైకలాజికల్ మిస్టరీగా మారింది అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. సీట్-ఎడ్జ్ థ్రిల్‌ను పంచే ఈ హాలీవుడ్ మూవీ అక్టోబర్ 30 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్కు రానుంది.
5. ది ప్యాట్రిక్ స్టార్ షో (The Patrick Star Show) — అక్టోబర్ 30
చిన్నారులను విశేషంగా అలరించే ప్రసిద్ధ యానిమేటెడ్ సిరీస్ 'ది ప్యాట్రిక్ స్టార్ షో'. గత 5 సీజన్లు ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించగా.. ఇప్పుడు సరికొత్త సీజన్‌తో పిల్లలను అలరించేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 30 నుంచి ఈ కిడ్స్ షో జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
6. ఘోస్ట్స్: సీజన్ 6 (Ghosts: Season 6)
బీబీసీ (BBC) మాతృకగా అంతర్జాతీయంగా విశేష ఆదరణ పొందిన కామెడీ-హారర్ సిరీస్ 'ఘోస్ట్స్' 6వ సీజన్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. ఒక పాత ఇల్లు, దానిలో నివసించే దంపతులు, అక్కడ ఉన్న వింత ఆత్మల నడుమ సాగే నవ్వుల జాతర ఈ సిరీస్ ప్రత్యేకత.
ఈ వారం మీ ఓటీటీ బింజ్-వాచ్ ప్లాన్స్ కోసం జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయ్యే ఈ సరికొత్త సినిమాలు, సిరీస్‌లను మీ వాచ్‌లిస్ట్‌లో ప్లాన్ చేసుకోండి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


