Hanuman Ansh Trailer Telugu: 2 కోట్ల బడ్జెట్, 420 కోట్ల కలెక్షన్స్- ఇవాళ విడుదలైన హనుమాన్ అంశ్ తెలుగు ట్రైలర్

Hanuman Ansh Trailer Telugu Released Today: రూ. 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా రూ.423 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించిన ఆధ్యాత్మిక చిత్రం 'హనుమాన్ అంశ్ తెలుగు ట్రైలర్‌ను తాజాగా ఇవాళ విడుదల చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయనుంది.

Published on: Oct 5, 2026, 17:37:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Hanuman Ansh Trailer Telugu Released Today: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో భారీ విజయాలు సాధించిన ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ టాలీవుడ్ ప్రేక్షకులకు మరో అద్భుత చిత్రాన్ని పరిచయం చేయడానికి సిద్ధమైంది. బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి సంచలనం సృష్టించిన ఆధ్యాత్మిక డ్రామా 'హనుమాన్ అంశ్' తెలుగు వెర్షన్‌ను తీసుకురానుంది.

2 కోట్ల బడ్జెట్, 420 కోట్ల కలెక్షన్స్- ఇవాళ విడుదలైన హనుమాన్ అంశ్ తెలుగు ట్రైలర్
2 కోట్ల బడ్జెట్, 420 కోట్ల కలెక్షన్స్- ఇవాళ విడుదలైన హనుమాన్ అంశ్ తెలుగు ట్రైలర్

అక్టోబర్ 9న తెలుగులో విడుదల

అక్టోబర్ 9న హనుమాన్ అంశ్ సినిమాను తెలుగులో విడుదల చేయనున్నట్లు హోంబలే ఫిల్మ్స్ సంస్థ ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ పంపిణీ బాధ్యతలను విజయవంతంగా నిర్వహించిన హోంబలే ఫిల్మ్స్, ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఈ దైవిక అనుభూతిని అందించబోతోంది.

అంతేకాకుండా తాజాగా ఇవాళ (అక్టోబర్ 5) హనుమాన్ అంశ్ తెలుగు ట్రైలర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఇందులో బాబా సన్యాసిగా మారిన విధానం, బ్రిటషర్స్ ఆయన్ను రైలు నుంచి దింపేయడం, మనుషులకు మోటివేషన్ ఇవ్వడం వంటి సన్నివేశాలు చూపించారు.

హనుమాన్ అంశ్ తెలుగు ట్రైలర్

దైవత్వంతో నిండి ఉన్న ఆయన్ను భార్య వదిలేస్తాననడం, ఇతురలతో బాబా సంతోషంగా, చమత్కారంగా ఉండటం వంటి సీన్లు ఉన్నాయి. అలాగే, హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్టించడం, హనుమాన్‌ను జాగ్రత్తగా చూసుకోమ్మని ఊరి జనానికి చెప్పి ఎక్కడో వెళ్లడానికి సిద్ధమయ్యే సీన్లతో హనుమాన్ అంశ్ తెలుగు ట్రైలర్‌ను కట్ చేశారు.

బాక్సాఫీస్ వద్ద రూ.423 కోట్ల సునామీ

కాగా, హనుమాన్ అంశ్ సినిమాను తెలుగులోకి తీసుకురావడంపై.. “ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఈ దైవిక చిత్రాన్ని వెండితెరపై వీక్షించేలా 'హనుమాన్ అంశ్' తెలుగు వెర్షన్‌ను తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉంది” అని హోంబలే ఫిల్మ్స్ సామాజిక మాధ్యమాల్లో వెల్లడించింది.

విశాల్ చతుర్వేది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఊహించని రీతిలో ఇప్పటికీ రికార్డు వసూళ్లు రాబడుతోంది. విడుదలై 59 రోజులు పూర్తయినా బాక్సాఫీస్ వద్ద జోరు తగ్గలేదు. ఆదివారం (అక్టోబర్ 4న) ఒక్క రోజే ఈ సినిమా రూ.3 కోట్ల కలెక్షన్లు సాధించింది. కేవలం 2 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 423.26 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది.

నీమ్ కరోలీ బాబా జీవిత గాథ

ఈ కథ లక్ష్మీ నారాయణ్ అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. తల్లి మరణం తర్వాత అతడు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుని, కాలక్రమంలో పూజ్యనీయమైన 'నీమ్ కరోలీ బాబా'గా ఎలా మారాడో దర్శకుడు విశాల్ చతుర్వేది ఎంతో గుండెలకు హత్తుకునేలా తెరకెక్కించారు. లక్ష్మీ నారాయణ్ పాత్రలో శోభినావ్ సత్య జీవించగా.. చందన్ కె ఆనంద్, పూర్ణిమ తివారి, అనిల్ రస్తోగి, గుల్షన్ పాండే, భగవాన్‌దాస్ పటేల్ కీలక పాత్రల్లో మెప్పించారు.

ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11న నీమ్ కరోలీ బాబా 53వ మహాసమాధి దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయంగా విడుదల చేశారు. “విశ్వాసంలో పుట్టిన కథ.. సరిహద్దులు దాటిన ప్రయాణం” అని హోంబలే ఓవర్సీస్ విభాగం పేర్కొంది. కాగా, దర్శకుడు విశాల్ చతుర్వేది తన తదుపరి చిత్రంగా ప్రసిద్ధ కవి-సంతు గోస్వామి తులసీదాస్ జీవితాధారంగా 'రామ్‌బోలా' అనే బయోపిక్‌ను ఇప్పటికే ప్రకటించారు.

హోంబలే ఫిల్మ్స్ భారీ ప్రణాళికలు

కేజీఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్టర్ 2, కాంతార, సలార్: పార్ట్ 1 - సీజ్‌ఫైర్ వంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్, కన్నడ చిత్రసీమ దాటి అన్ని భాషల్లోనూ తన ముద్ర వేస్తోంది. భవిష్యత్తులో హృతిక్ రోషన్ కథానాయకుడిగా ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్, తమిళ స్టార్ సూర్యతో మరొక చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More