Veerabhadrudu: టీవీలోకి సూర్య లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా.. దేవుడే దిగివస్తే.. మూవీ వరల్డ్ ప్రీమియర్ ఎప్పుడో తెలుసా?
Veerabhadrudu Tv Premier: సినిమా, టీవీ లవర్స్ కు గుడ్ న్యూస్. స్టార్ హీరో సూర్య నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘వీరభద్రుడు’ టీవీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మరి ఈ మూవీ ఏ ఛానెల్ లో వస్తుంది? దీని కథ ఏంటో ఇక్కడ చూసేయండి.
Veerabhadrudu Tv Premier: తమిళ స్టార్ సూర్య ఫుల్ జోష్ లో ఉన్నారు. తాజాగా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అయితే అంతకంటే ముందు ‘కరుప్పు’ మూవీతో సూపర్ డూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు సూర్య. సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ కరుప్పు మూవీ తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో రిలీజైంది.

టీవీలోకి వీరభద్రుడు
కోలీవుడ్ స్టార్ సూర్య, త్రిష కృష్ణన్ జంటగా నటించిన‘వీరభద్రుడు’ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ఈ ఆదివారం,సెప్టెంబర్ 27న సాయంత్రం 6 గంటలకు ఈ మూవీ జీ తెలుగులో ప్రసారం కానుంది. తమిళంలో ‘కరుప్పు’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్ వేదికగా తెలుగు ప్రేక్షకులను సైతం మెప్పించింది.
వీరభద్రుడు కలెక్షన్లు
తమిళంలో కరుప్పుగా రిలీజైన సూర్య సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. తెలుగులో వీరభద్రుడిగా వచ్చి సత్తాచాటింది. మే 15, 2026న ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.350 కోట్ల కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది.
ఓటీటీలోనూ అదుర్స్
థియేట్రికల్ విండో తర్వాత ఓటీటీలోనూ వీరభద్రుడు మూవీ అదరగొట్టింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇది స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలోకి వచ్చిన తర్వాత కొన్ని వారాల పాటు వీరభద్రుడు మూవీ ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగింది.
స్టోరీ ఏంటంటే?
ఆర్.జే. బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన వీరభద్రుడు సినిమాని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్. ప్రకాశ్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో యాక్షన్, భావోద్వేగాలు, కుటుంబ అనుబంధాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలను కలిపి చూపించారు.
బీను అనే అమ్మాయికి లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి ఉంటుంది. ఆపరేషన్ కోసం బీనును తీసుకొని ఆమె తండ్రి కేరళ నుండి చెన్నైకి వస్తారు. అయితే, ఆపరేషన్ ఖర్చుల కోసం వాళ్లు తెచ్చుకున్న బంగారం దొంగతనానికి గురవుతుంది. సహాయం కోసం పోలీసులను, న్యాయవ్యవస్థను ఆశ్రయిస్తారు. అయినా అవినీతి, కాలయాపన కారణంగా సమయానికి వైద్యం అందక బీను ప్రాణాలు కోల్పోతుంది.
దేవుడే దిగివస్తే
కూతురిని కోల్పోయిన బాధలో ఉన్న ఆ తండ్రి.. తమకు అన్యాయం చేసిన వ్యవస్థపై ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోతుంటాడు. న్యాయం కోసం తమ కులదైవమైన ‘వెట్టై కరుప్పు స్వామి’ని వేడుకుంటూ ఒక ప్రత్యేక పూజ నిర్వహిస్తాడు. అప్పుడా వీరభద్రుడు లాయర్ శరవణన్ (సూర్య) రూపంలో భూమిపైకి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది వీరభద్రుడు సినిమాలో చూడాల్సిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


