Mahesh Babu Ramayana Review: రామాయణంపై మహేశ్ బాబు రివ్యూ- రణ్‌బీర్, సాయి పల్లవి, యశ్ మ్యాజిక్- మా రాముడి కోసం వెయిటింగ్!

Mahesh Babu Ramayana Movie Review: నితేష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'రామాయణం' సినిమాపై సూపర్ స్టార్ మహేశ్ బాబు రివ్యూ ఇస్తూ ప్రశంసల జల్లు కురిపించారు. రణ్‌బీర్ కపూర్, యశ్, సాయి పల్లవిల నటన మ్యాజికల్ అని కొనియాడారు. మహేశ్ బాబు రివ్యూకి నెటిజన్లు పలు విధాలుగా కామెంట్స్ పెడుతున్నారు.

Published on: Nov 6, 2026, 13:22:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Mahesh Babu Ramayana Movie Review: భారతీయ ఇతిహాసం రామాయణాన్ని అపూర్వమైన విజువల్ వండర్‌గా వెండితెరపైకి తీసుకొచ్చిన దర్శకుడు నితేష్ తివారీ డ్రీమ్ ప్రాజెక్ట్ 'రామాయణం' థియేటర్లలో సందడి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాపై సినీ దిగ్గజాలు స్పందిస్తున్నారు.

రామాయణంపై మహేశ్ బాబు రివ్యూ- రణ్‌బీర్, సాయి పల్లవి, యశ్ మ్యాజిక్- మా రాముడి కోసం వెయిటింగ్!
రామాయణంపై మహేశ్ బాబు రివ్యూ- రణ్‌బీర్, సాయి పల్లవి, యశ్ మ్యాజిక్- మా రాముడి కోసం వెయిటింగ్!

రామాయణంపై మహేశ్ బాబు రివ్యూ

తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు రామాయణం చిత్రంపై ప్రశంసలు కురిపిస్తూ రివ్యూ ఇచ్చారు. విజువల్ స్కేల్, నటీనటుల ప్రతిభను ఆకాశానికెత్తుతూ సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా ఒక ప్రత్యేకమైన పోస్ట్ పెట్టారు మహేశ్ బాబు.

రామాయణ కథపై చిన్ననాటి జ్ఞాపకాలు

భారతీయ పాఠకులకు, సగటు సినిమాభిమానికి చిన్నతనం నుంచే రామాయణంతో విడదీయరాని అనుబంధం ఉంటుంది. ఇదే విషయాన్ని మహేశ్ బాబు తన సందేశంలో ప్రస్తావించారు.

చిన్ననాటి నుంచి వింటూ పెరిగిన కథలు

"చిన్ననాటి నుంచి మనం వింటూ పెరిగిన కథలు వెండితెరపై ఇంత అద్భుతంగా జీవం పోసుకోవడం చూస్తుంటే మనసు ఎంతో సంతోషంతో నిండిపోతోంది" అని మహేశ్ బాబు తన ఎమోషన్‌ను పంచుకున్నారు.

రణ్‌బీర్, యశ్, సాయి పల్లవి నటనపై ప్రశంసలు

రామాయణ పార్ట్ 1 సినిమాలో నటించిన ప్రధాన తారాగణంపై మహేశ్ బాబు ప్రత్యేకంగా పొగడ్తలు కురిపించారు. రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా కన్నడ రాకింగ్ స్టార్ యశ్ తమ పాత్రల్లో ఒదిగిపోయిన తీరును అభినందించారు. "రణ్‌బీర్ కపూర్, యశ్, సాయి పల్లవి.. వీళ్ల నటన నిజంగా మ్యాజికల్" అని పేర్కొన్నారు.

నిర్మాత, దర్శకుడిని కొనియాడిన మహేశ్

భారీ బడ్జెట్‌తో రామాయణం చిత్రాన్ని తెరకెక్కించిన నిర్మాత నమిత్ మల్హోత్రా, దర్శకుడు నితేష్ తివారీ శ్రమను మహేశ్ కొనియాడారు. "ఇంత భారీ ఎత్తున సినిమాను రూపొందించేందుకు మీరు పడిన శ్రమకు హాట్సాఫ్. ఈ ప్రాజెక్ట్ సాధించిన విజయానికి 'రామాయణ్' చిత్రబృందం మొత్తానికి నా అభినందనలు" అని మహేశ్ బాబు రాసుకొచ్చారు.

మా రాముడు కోసం వెయిటింగ్

అయితే, మహేశ్ బాబు ట్వీట్ వైరల్ కావడంతో నెటిజన్స్ పలు విధాలుగా స్పందిస్తున్నారు. "వారణాసిలో రాముడిగా చేస్తున్న మహేశ్ బాబు తన పాత్రపైనే ప్రశంసలు కురిపించారు", "తన పాత్ర చేసిన రణ్‌బీర్ కపూర్‌ను పొగడటం భలే ఉంది", "మేము మా రాముడి కోసం ఎదురుచూస్తున్నాం" అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

రెండు భాగాలుగా పౌరాణిక దృశ్యకావ్యం

కాగా, రామాయణ సినిమాలో లక్ష్మణుడిగా రవి దూబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, సూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రల్లో అలరించారు. భారతీయుల సాంస్కృతిక ముద్రగా నిలిచిన రామాయణాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దృశ్యకావ్యంగా మలిచిన తీరు విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.

రెండు భాగాలుగా రామాయణం

దర్శకుడు నితేష్ తివారీ ఈ కథను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మొదటి భాగం ఇప్పుడు థియేటర్లలో సందడి చేస్తుండగా, రెండవ భాగాన్ని 2028లో విడుదల చేయడానికి చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేసింది.

'వారాణాసి' రేంజ్‌లో మహేశ్ బాబు నెక్ట్స్ ప్రాజెక్ట్

మరోవైపు సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా భారతీయ పౌరాణిక, అడ్వెంచర్ ఇతివృత్తంతో రూపుదిద్దుకుంటున్న అత్యంత భారీ ప్రాజెక్ట్‌కు సన్నాహాలు చేస్తున్నారు. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న 'వారణాసి' చిత్రంలో మహేశ్ బాబు నటిస్తున్న విషయం తెలిసిందే.

వారణాసిలో ప్రియాంక, పృథ్వీరాజ్

వారణాసి చిత్రంలో మహేశ్ బాబుతోపాటు ప్రియాంక చోప్రా జోనాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ మరో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పాన్-వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతున్న వారణాసి సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More