TV OTT: టీవీ, ఓటీటీలో దివాళి ధమాకా- యాంకర్ సుమ స్పెషల్ షో- నారా లోకేశ్ పర్సనల్ లైఫ్ సీక్రెట్స్- మానస వారణాసి, నివేదాతో!
Kutumbam Awards Part 2 TV Premiere Jayammu Nischayammu Raa 2 OTT: దీపావళి పండుగ సందడిని మరింత పెంచేందుకు జీ తెలుగు, జీ5 ఓటీటీ ముందుకొచ్చాయి. ఈ వారాంతంలో ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’ టీవీ ప్రీమియర్ కావడంతోపాటుగా మంత్రి నారా లోకేశ్ పాల్గొనే ‘జయమ్ము నిశ్చయమ్మురా 2’ షో ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది.
Kutumbam Awards Part 2 TV Premiere Jayammu Nischayammu Raa 2 OTT: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఈ దీపావళి పండుగ వేళ డబుల్ ధమాకా వినోదాన్ని పంచేందుకు జీ తెలుగు సిద్ధమైంది. అంగరంగ వైభవంగా సాగే అవార్డుల వేడుక ఒకవైపు, పాలిటిక్స్ విత్ ఎంటర్‌టైన్‌మెంట్ కాంబినేషన్‌లో సాగే స్పెషల్ టాక్ షో మరొకవైపు ప్రేక్షకులను అలరించనున్నాయి.

పండుగ సీజన్ టార్గెట్ చేస్తూ
నవంబర్ 7, 8 తేదీల్లో ప్రసారం కానున్న ఈ ప్రత్యేక కార్యక్రమాలు బుల్లితెర ప్రియులకు దివాళఇ పండగ వాతావరణాన్ని ముందే తీసుకురానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పండుగ రోజుల్లో టీవీ వినోదానికి ఎప్పుడూ భారీ ఆదరణ ఉంటుంది. కుటుంబ సమేతంగా కూర్చుని చూసే షోలు రేటింగ్స్‌లో కొత్త రికార్డులు సృష్టిస్తాయి. అందుకే ఈ పండుగ సీజన్‌ను టార్గెట్ చేస్తూ సినీ, రాజకీయ ప్రముఖుల కాంబినేషన్‌తో జీ తెలుగు భారీ ప్లాన్ రూపొందించింది.
బుల్లితెర నక్షత్రాల కోలాహలం: కుటుంబం అవార్డ్స్ పార్ట్-2
నవంబర్ 7 (శనివారం) సాయంత్రం 5 గంటలకు ‘జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’ టీవీ ప్రీమియర్ కానుంది. బుల్లితెర మహారాణి యాంకర్ సుమ కనకాల ఈ వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. టెలివిజన్ రంగంలో సుమ 25 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఘనమైన పరిచయ ఘట్టంతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.
అవార్డ్స్ క్యాటగిరీలు
ఈ వేడుకలో మహానాయకుడు, ఐకానిక్ కపుల్, లవర్ బాయ్ ఆఫ్ జీ తెలుగు, సూపర్ క్వీన్, పాపులర్ ఫేస్ ఆఫ్ ప్రైమ్ టైమ్, ఉత్తమ కథానాయకుడు, నవనాయకి, ఉత్తమ కోడలు వంటి విభిన్న విభాగాల్లో నటీనటులకు అవార్డులు అందజేస్తారు.
బుల్లితెర షోకి వెండితెర తారలు
ఈ అవార్డుల రాత్రికి సినీ రంగం నుంచి బాబు మోహన్, లయ, రాజీవ్ కనకాల, శివ బాలాజీ, మధుమిత, బ్రహ్మాజీ, బాబా భాస్కర్, హీరోయిన్లు నివేదా పేతురాజ్, గెహనా సిప్పీ, మానస వారణాసి వంటి సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. నటీనటుల రంగురంగుల డాన్స్ పెర్ఫార్మెన్స్‌లు, అభిమానుల సర్‌ప్రైజ్‌లు ఈ ఎపిసోడ్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
జగపతి బాబుతో మంత్రి నారా లోకేశ్ ముచ్చట్లు
ఇక పండుగ మరుసటి రోజు నవంబర్ 8 (ఆదివారం) రాత్రి 7:30 గంటలకు ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’ ప్రత్యేక ఎపిసోడ్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ టాక్ షోలో ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యుత్ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు.
విద్యార్థి రోజులు, రాజకీయ ప్రయాణం
వర్సటైల్ నటుడు జగపతి బాబు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. సాధారణ రాజకీయ వేదికలపై కనిపించే నారా లోకేశ్‌ను ఈ షోలో పూర్తి భిన్నమైన కోణంలో చూడవచ్చు. తన వ్యక్తిగత జీవితం, విద్యార్థి రోజులు, ఇష్టాయిష్టాలు, రాజకీయ ప్రయాణంలో ఎదురైన అనుభవాలను జగపతి బాబుతో లోకేశ్ పంచుకున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


