Karikaala Pooja: 2 పార్టులుగా సందీప్ కిషన్ కరికాల- ముగ్గురు హీరోయిన్లు, శంబాల డైరెక్టర్- నాగలోకం, వానరలోకంతో ఊహా ప్రపంచం

Sundeep Kishan Karikaala Movie Pooja Ceremony: సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కరికాల. రెండు పార్టులుగా రానున్న కరికాల మూవీ పూజా కార్యక్రమాలను తాజాగా ఇవాళ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో సందీప్ కిషన్, డైరెక్టర్ యుగంధర్ ముని,నిర్మాత రాజశేఖర్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.

Published on: Oct 15, 2026, 17:58:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Sundeep Kishan Karikaala Movie Pooja Ceremony: షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మాణంలో తెరకెక్కుతోన్న సినిమా కరికాల. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ సినిమాకు యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. ‘కరికాల’ మూవీని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.

2 పార్టులుగా సందీప్ కిషన్ కరికాల- ముగ్గురు హీరోయిన్లు, శంబాల డైరెక్టర్- నాగలోకం, వానరలోకంతో ఊహా ప్రపంచం
2 పార్టులుగా సందీప్ కిషన్ కరికాల- ముగ్గురు హీరోయిన్లు, శంబాల డైరెక్టర్- నాగలోకం, వానరలోకంతో ఊహా ప్రపంచం

రెండు చాప్టర్లుగా కరికాల

‘కరికాల’ మొదటి చాప్టర్‌ 2027 జూలై 2న , రెండో చాప్టర్ 2027 అక్టోబర్ 28న విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా గురువారం (అక్టోబర్ 15, 2026) నాడు కరికాల చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముగ్గురు హీరోయిన్లు కేథరిన్ థ్రెసా, గాయత్రి భరద్వాజ్, సాక్షి మడోల్కర్ సందడి చేశారు.

ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రాజశేఖర్ తల్లి సత్యవతి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, మహిధర్ తల్లి పద్మారెడ్డి క్లాప్ కొట్టారు. తొలి సన్నివేశానికి హీరో ఆది సాయి కుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత రాజశేఖర్ తండ్రి వీరభద్రాచారి స్క్రిప్ట్‌ను అందజేశారు. పూజా కార్యక్రమాల అనంతరం చిత్రయూనిట్ మీడియాతో ముచ్చటించింది.

ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టలేదు

సందీప్ కిషన్ మాట్లాడుతూ .. "‘కరికాల’ చిత్ర ప్రారంభోత్సవంలో నేను ముందుగా నా ఫ్రెండ్ ఆదికి థాంక్స్ చెప్పాలి. ఆది ‘శంబాల’ వల్లే యుగంధర్ గారు, రాజశేఖర్ గారు, మహిధర్ గారు పరిచయం అయ్యారు. కథ చెప్పడమే రెండు పార్టులుగా ఉంటుందని వివరించారు. అయితే నాకు ఒక్క నిమిషం కూడా బోర్ అనిపించలేదు" అని అన్నారు.

"ఆరేడు నెలలుగా మా దర్శకుడు 24 గంటలు ఈ ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనే బిజీగా ఉంటూ వచ్చారు. నిర్మాతలు కూడా ఎప్పుడూ సినిమా గురించే ఆలోచిస్తుంటారు. ఇలాంటి దర్శక, నిర్మాతలు నాకు దొరకడం ఆనందంగా ఉంది. ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ అవుతుందని అనుకుంటున్నాను" అని సందీప్ కిషన్ తెలిపాడు.

ముగ్గురు హీరోయిన్లకు థ్యాంక్స్

"మా కథకు ఓకే చెప్పిన సాక్షి, గాయత్రి, కేథరిన్‌లకు థాంక్స్. శ్రీ చరణ్ ఈ సినిమాకి అద్భుతమైన ఆల్బమ్ రెడీ చేస్తున్నారు. ప్రతీ పాట అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. మాకెప్పుడూ సపోర్ట్ చేస్తున్న మీడియాకి థాంక్స్" అని పేర్కొన్నాడు హీరో సందీప్ కిషన్.

దర్శకుడు యుగంధర్ ముని మాట్లాడుతూ .. "‘నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాతలు రాజశేఖర్ గారు, మహిధర్ గారికి థాంక్స్. నాపై నమ్మకం పెట్టుకుని సినిమాకి ఓకే చెప్పిన సందీప్ కిషన్ గారికి థాంక్స్" చెప్పారు.

నాగలోకం, వానర లోకంతో ఊహా ప్రపంచం

"అందమైన చందమామ కథలా ఈ చిత్రం ఉంటుంది. అందమైన ఊహా ప్రపంచం, నాగలోకం, వానర లోకం అని ఇలా ఓ ప్రపంచాన్ని క్రియేట్ చేయబోతోన్నాం. మేం రెండు పార్టులుగా సినిమాని ప్లాన్ చేశాం. వచ్చే ఏడాది మూవీని రిలీజ్ చేస్తాం" అని డైరెక్టర్ యుగంధర్ ముని పేర్కొన్నారు.

నిర్మాత రాజశేఖర్ మాట్లాడుతూ .. "‘మా ‘శంబాల’ సినిమాకి మీడియా సపోర్ట్ చేసింది. అలానే మా ‘కరికాల’ చిత్రాన్ని కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. వచ్చే వారం నుంచి మూవీ షూటింగ్‌ను ప్రారంభిస్తున్నాం. యుగంధర్ గారు ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించబోతోన్నారు. కథ విన్న వెంటనే సందీప్ గారు ఓకే చెప్పారు. మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతీ ఒక్కరికీ థాంక్స్" అని అన్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More