Sairabanu: ఎంటర్‌టైన్మెంట్ గ్యారెంటీ- శంబాల తర్వాత ఆది సాయికుమార్ మూవీ- ముస్లిం అమ్మాయితో హిందూ అబ్బాయి లవ్-ఫస్ట్ లుక్
Sairabanu: ‘శంభాల’ సినిమాతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్న యంగ్ హీరో ఆది సాయికుమార్ (Aadi Sai Kumar) తన తదుపరి ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు. తన కొత్త సినిమా 'సైరాబాను' చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మేకర్స్ విడుదల చేశారు.
Sairabanu: టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్, బంధవి శ్రీధర్ (Bandhavi Sridhar) జంటగా నటిస్తున్న సినిమా 'సైరాబాను'. ఇవాళ (ఆగస్టు 15) ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైన నిమిషాల్లోనే డిజిటల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకున్న సందర్భంగా విడుదల చేసిన ఫన్నీ బీటీఎస్ (BTS) వీడియో సినిమాపై ఆసక్తిని రేపగా, ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా స్టోరీపై ఓ క్లారిటీనిచ్చింది.

హిందూ, ముస్లిం ప్రేమ
శనివారం రిలీజ్ చేసిన సైరాబాను మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. బైక్ నడుపుతున్న హిందూ యువకుడిగా ఆది సాయికుమార్, అతని వెనుక సాంప్రదాయ ముస్లిం దుస్తుల్లో కూర్చున్న యువతిగా బంధవి శ్రీధర్ కనిపించిన ఈ పిక్చర్ సినిమా మూడ్‌ను స్పష్టం చేస్తోంది. ఇద్దరి మధ్య నడిచే ఎమోషనల్ లవ్ స్టోరీ మూవీకి కీలకం కానుంది.
ఎంటర్ టైన్మెంట్ గ్యారంటీ
‘‘ఎంటర్ టైన్మెంట్ గ్యారెంటీ. మిమ్మల్ని ఎంటర్ టైన్ చేసేందుకు సైరాబాను వచ్చేస్తుంది. అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ప్రతి హద్దును దాటేసి ప్రేమ ఎగరాలి’’ అని ఆది సాయికుమార్ సోషల్ మీడియాలో ఈ పోస్టర్ ను పంచుకున్నాడు. ఈ పోస్టర్లో ఓ వైపు గుడి, మరోవైపు మసీద్ కూడా కనిపిస్తోంది.
షూటింగ్ స్పీడ్
'సామజవరగమన' వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా ఈ సైరాబాను చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు ఫణి కృష్ణ సిరికి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
‘శంభాల’తో కంబ్యాక్
చాలా కాలంగా సక్సెస్ కోసం వెయిట్ చేసిన ఆది సాయికుమార్ కు శంభాలతో బ్లాక్ బస్టర్ హిట్ దక్కింది. శంభాల మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లు సాధించి, ఆది సాయికుమార్ మార్కెట్‌ను ఒక్కసారిగా పెంచేసింది. ఆ ఘన విజయం తర్వాత ఆది నటిస్తున్న మొదటి సినిమా కావడంతో 'సైరాబాను'పై ట్రేడ్ వర్గాల్లో మంచి బిజినెస్ అంచనాలు ఏర్పడ్డాయి.
రొటీన్ మాస్/యాక్షన్ సినిమాల జోలికి పోకుండా 'శంభాల' తర్వాత అంతకంటే భిన్నమైన, బలమైన భావోద్వేగాలు ఉన్న కథను ఎంచుకోవడంలో ఆది మార్క్ స్ట్రాటజీ కనిపిస్తోందని చెప్పొచ్చు.
యూత్ అండ్ ఫ్యామిలీ కనెక్ట్
హిందూ-ముస్లిం ప్రేమకథా చిత్రాలకు సౌత్ ఆడియన్స్ ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు. ప్రేమకథకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్ యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించే అవకాశం ఉంది.
శంభాల విజయం తెచ్చిన ఊపును కాపాడుకోవడానికి ఆది సాయికుమార్ ‘సైరాబాను’ రూపంలో ఒక వినూత్నమైన రొమాంటిక్ డ్రామాను ఎంచుకున్నాడు. రాజేష్ దండా మేకింగ్ స్టాండర్డ్స్, ఆది కంబ్యాక్ క్రేజ్ తోడవ్వడం ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద ప్రీ-రిలీజ్ బిజినెస్‌ను భారీగా పెంచడంలో కీలకంగా మారనుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


