ఫెయిల్యూర్ బాయ్స్ సినిమాకు కమెడియన్ బాబు మోహన్ సపోర్ట్- నిర్మాతలు యుద్ధ వీరులు అంటూ హీరో అవి తేజ్ కామెంట్స్

ఫెయిల్యూర్ బాయ్స్ సినిమాకు కమెడియన్, నటుడు బాబు మోహన్ సపోర్ట్‌గా నిలిచారు. అవి తేజ్, క్రాంతి, ప్రదీప్, సుపర్ణ, పవని మెయిన్ లీడ్స్‌గా నటించిన ఫెయిల్యూర్ బాయ్స్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు బాబు మోహన్. ఈ సందర్భంగా హీరో అవితేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Dec 8, 2025, 13:44:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

క్రాంతి, అవి తేజ్, ప్రదీప్, సుపర్ణ, పవని ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఫెయిల్యూర్ బాయ్స్. ఇతర కీలక పాత్రల్లో సుమన్, నాజర్, తనికెళ్ల భరణి నటించారు. ఈ చిత్రాన్ని శ్రీ గురుదక్షిణ మూర్తి ఫిలింస్ బ్యానర్‌పై విఎస్‌ఎస్ కుమార్, ధన శ్రీనివాస్ జామి, లక్ష్మి వెంకట్ రెడ్డి నిర్మించారు.

ఫెయిల్యూర్ బాయ్స్ సినిమాకు కమెడియన్ బాబు మోహన్ సపోర్ట్- నిర్మాతలు యుద్ధ వీరులు అంటూ హీరో అవి తేజ్ కామెంట్స్
ఫెయిల్యూర్ బాయ్స్ సినిమాకు కమెడియన్ బాబు మోహన్ సపోర్ట్- నిర్మాతలు యుద్ధ వీరులు అంటూ హీరో అవి తేజ్ కామెంట్స్

ఫెయిల్యూర్ బాయ్స్ రిలీజ్ డేట్

వెంకట్ త్రినాథ రెడ్డి ఉసిరిక దర్శకత్వం వహించిన ఫెయిల్యూర్ బాయ్స్ మూవీకి విజయ్ సంగీతం అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న "ఫెయిల్యూర్ బాయ్స్" సినిమా డిసెంబర్ 12వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైంది.

బాబు మోహన్ సపోర్ట్

విడుదల తేదీ దగ్గరవుతున్న సమయంలో చిత్ర బృందం ఫెయిల్యూర్ బాయ్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన కమెడియన్, నటుడు బాబు మోహన్ ఫెయిల్యూర్ బాయ్స్ సినిమాకు సపోర్ట్‌గా నిలిచారు. ఈ సందర్భంగా మూవీకి బెస్ట్ విషెస్ అందించారు.

అద్భుతంగా ఉండబోతుంది

ఫెయిల్యూర్ బాయ్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాబు మోహన్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఈ సినిమా ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ సినిమాకు పాటలు ఎంతో బలాన్ని చేకూరుస్తాయి. ప్రేక్షకులంతా ఇటువంటి సినిమాలను సపోర్ట్ చేసి విజయాన్ని అందజేయాల్సిందిగా కోరుకుంటున్నాను" అని అన్నారు.

యుద్ధ వీరులు మా నిర్మాతలు

హీరో అవితేజ్ మాట్లాడుతూ.. "ఫెయిల్యూర్ అంటే విజయానికి మరొక మెట్టు. ఫెయిల్యూర్ బాయ్స్ అనే చిత్రం ఒక యుద్ధం అనుకుంటే ఆ యుద్ధంలో యుద్ధ వీరులు మా నిర్మాతలు. ఎందుకంటే ఈ చిత్రానికి వారే హీరోలు" అని అన్నారు.

వెన్నెముకల నిలబడతారు

"ఒక నిర్మాత సంస్థను నడిపించడం అంత సులువైన విషయం కాదు. సినిమాలోని క్వాలిటీ చూస్తే అది మీకు అర్థమవుతుంది. సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీశారు. ఒక సినిమాకు నిర్మాత వెన్నెముకల నిలబడతారు. ఈ సినిమాని నిర్మాతలు మాకు అలా నిలబడ్డారు" అని అవి తేజ్ తెలిపారు.

రోజుకు ఒక్క సీన్ మాత్రమే

"మా చిత్ర దర్శకులు నాకు కథ చెప్పినప్పుడు నాకు సెట్ అవుతుందా లేదా అనుకున్నాను. కానీ, దర్శకులు నన్ను ప్రతి విషయంలో గైడ్ చేస్తూ నాతో సరైన అవుట్ పుట్ వచ్చేలా, నటించేలా చేశారు. రోజుకు ఒక్క సీన్ మాత్రమే ప్లాన్ చేసేవారు" అని అవి తేజ్ పేర్కొన్నారు.

డ్యాన్స్ బాగా చేస్తాడు

"నా స్నేహితుడు ప్రదీప్ ఎంతో టాలెంట్‌ ఉన్న నటుడు. సెట్‌లో ప్రదీప్ ఉంటే ఆ ఎనర్జీ వేరేలా ఉంటుంది. చాలా బాగా డాన్స్ చేస్తాడు. తనను తాను వెండి తెరపై చూసుకోవాలని ఎన్నో కలలు కన్నాడు. అంత సరదా మనిషి ఈరోజు మన మధ్య లేడు" అని ఎమోషనల్ అయ్యారు హీరో అవి తేజ్.

అతనికి అంకితం

"దయచేసి ఎవరు తమ జీవితంలో జరిగే సంఘటనలకు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మీ కుటుంబం గురించి ఆలోచించండి. ఈ సినిమాను అతనికి (ప్రదీప్) అంకితం చేస్తున్నాము" అంటూ అవి తేజ్ తన స్పీచ్ ముగించారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More