Rajeev Kanakala: ఆ ట్రెండ్ మార్చారు.. ఇప్పుడు రాజీవ్ కనకాల బతికితే మూవీ హిట్.. కమెడియన్ సుదర్శన్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు

Rajeev Kanakala: చాలా కాలంగా తెలుగు సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాజీవ్ కనకాల. అయితే సినిమాల్లో ఆయన క్యారెక్టర్ చనిపోయినట్లు చూపిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిందని కమెడియన్ సుదర్శన చేసిన కామెంట్లు ఇంట్రెస్టింగ్ గా మారాయి. 

Published on: Apr 28, 2026, 08:53:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Rajeev Kanakala: రాజీవ్ కనకాల ప్లే చేసిన క్యారెక్టర్ చస్తే సినిమా హిట్.. ఇదీ ఇన్ని రోజులూ టాలీవుడ్ లో సరదాగా వినిపించిన మాట. కానీ ఇప్పుడా ట్రెండ్ మారిందని, ఆయన బతికి ఉంటే మూవీస్ హిట్ అవుతున్నాయని తాజాగా కమెడియన్ సుదర్శన్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. గోదారి గట్టుపైన మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో సుదర్శన్ కామెంట్లు వైరల్ గా మారాయి.

సుదర్శన్ కామెంట్లు (x)
సుదర్శన్ కామెంట్లు (x)

రాజీవ్ కనకాల బతికి ఉంటే

గోదారి గట్టుపైన మూవీ ట్రైలర్ ఈవెంట్ తాజాగా జరిగింది. ఈ ఈవెంట్లో కమెడియన్ సుదర్శన్ మాట్లాడాడు. మధ్యలో రాజీవ్ కనకాల గురించి కూడా చెప్పాడు. ఆ సమయంలోనే యాంకర్ స్రవంతి చొక్కారపు వచ్చి రాజీవ్ గురించి అడిగింది. ఈ సినిమాలో ఆయన బతికే ఉంటారా? అని ప్రశ్నించింది.

ట్రెండ్ మారిందని

స్రవంతి ప్రశ్నకు సుదర్శన్ నవ్వుతూ ఆన్సర్ ఇచ్చాడు. ‘‘ఇప్పుడు ట్రెండ్ మారింది’’ అని సుదర్శన్ చెప్పాడు. ఏమో డైరెక్టర్ మళ్లీ చంపేశారేమోనని స్రవంతి అడుగుతుంది. ‘‘ఇప్పుడు ట్రెండ్ మార్చారు. ఆయన (రాజీవ్ కనకాల) బతికి ఉంటే సినిమా హిట్’’ అని సుదర్శన్ చెప్పాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

అదో మీమ్ గా

సుదీర్ఘ కాలంగా సినిమా ఇండస్ట్రీలో రాజీవ్ కనకాల కొనసాగుతున్నాడు. మూవీస్ లో కీలక పాత్రలు చేస్తూ అదరగొడుతున్నాడు. ఓటీటీ సినిమాలు, సిరీస్ లోనూ తన యాక్టింగ్ తో సత్తాచాటుతున్నాడు. అయితే ఇప్పటివరకూ ఆయన నటించిన మెజారిటీ మూవీస్ లో రాజీవ్ కనకాల క్యారెక్టర్ చనిపోయినట్లు చూపించారు. దీంతో రాజీవ్ కనకాల పాత్ర చనిపోతే సినిమా హిట్ అనే మీమ్స్ చాలా వచ్చాయి.

గోదారి గట్టుపైన గురించి

‘మేం ఫేమస్’ సినిమాతో ఫేమస్ అయిన సుమంత్ ప్రభాస్ హీరోగా నటించిన మూవీ ‘గోదారి గట్టుపైన’. ఈ చిత్రంలో నిధి ప్రదీప్ హీరోయిన్. జగపతి బాబు ప్రధాన పాత్ర పోషించాడు. ఈ గోదారి గట్టుపైన మూవీకి సుభాష్ చంద్ర డైరెక్టర్. ఈ సినిమా మే 8న రిలీజ్ కానుంది.

ముగ్గురి కథతో

గోదారి గట్టుపైన మూవీ ముఖ్యంగా మూడు ప్రధాన పాత్రలు చుట్టూ సాగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కాలేజీకి వెళ్లే అమ్మాయిని ఓ ఆటో డ్రైవర్ గా పని చేసే యువకుడు ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి అంటే పంచ ప్రాణాలు పెట్టుకున్న తండ్రికి ఇది నచ్చదు.

తండ్రి, అమ్మాయి, అమ్మాయి లవర్ మధ్య సంఘర్షణలతో తెరకెక్కిన మూవీనే గోదారి గట్టుపైన. మే ఫేమస్ తో అదరగొట్టిన సుమంత్ ప్రభాస్ ఈ సినిమాలోనూ మరోసారి చలాకీగా కనిపించాడు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More