Zee5 OTT AI: మారిపోయిన జీ5 ఓటీటీ రూపురేఖలు- 5 విభాగాలతో రీ లాంచ్- ఉచితంగా చూసేందుకు ఫ్రీ5- 190కిపైగా దేశాల్లో కంటెంట్!

Zee5 OTT Re Launch By New AI Features With 5 Categories: భారతదేశపు ప్రముఖ ఓటీటీ దిగ్గజం జీ5 సరికొత్త రూపురేఖలతో రీలాంచ్ అయింది. కృత్రిమ మేధ (AI) సాంకేతికత, ఎటువంటి చందా లేకుండా వినోదాన్ని అందించే 'ఫ్రీ 5', ఫిఫా ప్రపంచ కప్ ప్రత్యక్ష ప్రసార హక్కులతో సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది.

Published on: Sep 12, 2026, 13:50:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Zee5 OTT Re Launch By New AI Features With 5 Categories: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఓటీటీ వినియోగం సరికొత్త ఎత్తులకు చేరుతోంది. డిజిటల్ మీడియా పోటీ తీవ్రమవుతున్న తరుణంలో, ప్రముఖ వీడియా స్ట్రీమింగ్ సంస్థ 'జీ5' (ZEE5) తమ ప్లాట్‌ఫామ్‌ను అత్యాధునికంగా అప్‌గ్రేడ్ చేసింది. యూజర్లకు డిజిటల్ వినోదాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు కృత్రిమ మేధ (AI) సాంకేతికతను జోడించి ప్లాట్‌ఫారమ్‌ను సంస్కరించింది.

మారిపోయిన జీ5 ఓటీటీ రూపురేఖలు- 5 విభాగాలతో రీ లాంచ్- ఉచితంగా చూసేందుకు ఫ్రీ5- 190కిపైగా దేశాల్లో కంటెంట్!
మారిపోయిన జీ5 ఓటీటీ రూపురేఖలు- 5 విభాగాలతో రీ లాంచ్- ఉచితంగా చూసేందుకు ఫ్రీ5- 190కిపైగా దేశాల్లో కంటెంట్!

ఒకేరకమైన వ్యూయింగ్ ఎక్స్‌పీరియెన్స్

స్మార్ట్ టీవీలు, మొబైల్ ఫోన్లలో ఒకే రకమైన వీక్షణ అనుభవాన్ని అందించడమే కాకుండా, యూజర్లు కోరుకునే కంటెంట్‌ను క్షణాల్లో గుర్తించేలా నావిగేషన్ వ్యవస్థను తీర్చిదిద్దారు. దేశవ్యాప్తంగా విభిన్న ప్రాంతాల ప్రేక్షకుల అభిరుచులను విశ్లేషించి, నిపుణులతో 'బగ్‌థాన్స్' నిర్వహించిన తర్వాతే ఈ మార్పులను అమల్లోకి తెచ్చారు.

ఏఐ ఆధారిత సెర్చ్.. క్లౌడ్ సెక్యూరిటీ

ఈ అప్‌డేట్‌లో ప్రధాన ఆకర్షణ ఏఐ పర్సనలైజేషన్. ప్రతీ వీక్షకుడి ఇష్టాయిష్టాలకు అనుగుణంగా కంటెంట్‌ను ఏఐ సిఫార్సు చేస్తుంది. మొబైల్‌లో చూస్తున్న సినిమాను లేదా సిరీస్‌ను టీవీలో కొనసాగించేటప్పుడు ఎలాంటి అంతరాయం కలగకుండా స్లాట్-రహిత క్రాస్-స్క్రీన్ సాంకేతికతను అందుబాటులోకి తెచ్చారు.

సబ్‌స్క్రిప్షన్లు, ప్లేబ్యాక్ లేదా యాప్ లాగిన్ సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి ప్రత్యేకంగా 'నెక్ట్స్-జెన్ ఏఐ కస్టమర్ అసిస్టెంట్' సేవలను ప్రవేశపెట్టారు. వినియోగదారుల వ్యక్తిగత వివరాల భద్రత కోసం అత్యున్నత స్థాయి క్లౌడ్ డేటా ప్రైవేసీ ప్రమాణాలను పాటించనున్నారు.

ఐదు విభాగాలు.. చందా లేని 'ఫ్రీ 5' ప్రపంచం

యూజర్ల సౌకర్యం కోసం ప్లాట్‌ఫారమ్‌ను ఐదు ప్రత్యేక విభాగాలుగా విభజించారు. ప్రీమియం ఎంటర్‌టైన్‌మెంట్, ఫ్రీ 5, కిడ్జ్, టీవీ, స్పోర్ట్స్ పేరిట వీటిని అందుబాటులో ఉంచారు. వీటిలో 'ఫ్రీ 5' విభాగం ఉచిత వినోదానికి సరికొత్త వేదికగా మారనుంది.

ఎలాంటి చందా రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండానే సినిమాలు, వెబ్ సిరీస్‌లు, కొరియన్-చైనీస్ డ్రామాలు, యానిమే, మైక్రో డ్రామాలు, వార్తలను జీ5 ఓటీటీలో ఉచితంగా వీక్షించవచ్చు.

ఫిఫా వరల్డ్ కప్, హాలీవుడ్ వినోదం

క్రీడాభిమానుల కోసం అత్యంత ప్రజాదరణ పొందిన ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026, 2030) డిజిటల్ ప్రసార హక్కులను జీ5 కైవసం చేసుకుంది. వీటితో పాటు ప్రముఖ అంతర్జాతీయ సంస్థలైన PVR INOX PICTURES, LIONSGATE PLAY లతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది.

బాబ్ ఒడెన్‌కిర్క్ నటించిన 'నార్మల్', సెత్ రోజెన్ 'ది ఇన్‌వైట్', ఏంజెలీనా జోలీ 'యాంగ్జియస్ పీపుల్' వంటి అంతర్జాతీయ సినిమాలను తెలుగు సహా ఏడు ప్రాంతీయ భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారు.

190కిపైగా దేశాల్లో కంటెంట్

"వినోదాన్ని ప్రతి ఒక్కరికీ సులభంగా, వేగంగా చేరువ చేయడమే మా ప్రాథమిక లక్ష్యం. ఏఐ, పర్సనలైజేషన్ సాంకేతికతతో మొబైల్, స్మార్ట్ టీవీ స్ట్రీమింగ్ విధానాన్ని పూర్తిగా మార్చేశాం. ప్రాంతీయ కంటెంట్‌తో పాటు అంతర్జాతీయ హాలీవుడ్ చిత్రాలు, గ్లోబల్ స్పోర్ట్స్ ఈవెంట్లను వీక్షకులకు అందిస్తున్నాం" అని జీ5 ఇండియా హెడ్ తేజ్‌కరణ్ సింగ్ బజాజ్ తెలిపారు.

స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫారమ్‌లో సాంకేతికత వెనుక ఉండి నడుస్తుంటే, వినోదం ముందడుగులో ఉండాలన్నదే తమ వ్యూహమని జీ ఎంటర్‌టైన్‌మెంట్ సీటీఓ ప్రమోద్ ప్రకాష్ స్పష్టం చేశారు. 190కి పైగా దేశాల్లో సౌత్ ఏషియన్ కంటెంట్‌ను అందిస్తున్న జీ5, ఈ కొత్త అప్‌డేట్‌తో ఓటీటీ రంగంలో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More