Amba's Revenge Teaser: మైథలాజికల్ థ్రిల్లర్‌గా అంబా'స్ రివెంజ్.. మొట్టమొదటి తెలుగు ఏఐ సినిమా.. టీజర్ రిలీజ్
Amba's Revenge Teaser Released: తెలుగులో మొట్టమొదటి ఏఐ టెక్నాలజీతో తెరకెక్కిన సినిమా అంబా'స్ రివేంజ్. మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన అంబా'స్ రివెంజ్ మూవీ టీజర్‌ను తాజాగా ఆగస్ట్ 27న విడుదల చేశారు. ఈ టీజర్‌లో విజువల్స్ అదిరిపోయాయి. ఈ సందర్భంగా మూవీ యూనిట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Amba's Revenge Teaser Released: నక్క తోక ఫిలిమ్స్ బ్యానర్‌పై జైవర్ధన్ మేడి దర్శకత్వంలో యోగేంద్ర ప్రసాద్ పొట్లూరి, రాణి మాడిసన్ నిర్మాతలుగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఏఐ (AI) చిత్రం "అంబా'స్ రివెంజ్". ప్రమోద్ ఎంసి సంగీతం అందించిన ఈ ఏఐ చిత్రానికి హ్యారీ బ్రెయిన్ ఎడిటింగ్ అండ్ డీఐ చేయగా కిషోర్ కుమార్ ఏనుగు డైలాగ్స్, లిరిక్స్ అందించారు.

మహాభారతంలోని అంబ ప్రతీకారం
ప్రస్తుతం ప్రజలకు చేరువ అవుతున్న లేటెస్ట్ ఏఐ టెక్నాలజీ ద్వారా రూపొందిన ఈ విజువల్ ఫీస్ట్ చిత్రం భారత దేశపు ఇతిహాసాలలో ప్రత్యేక గుర్తింపు పొందిన మహాభారతంలోని అంబ ప్రతీకారం ఆధారంగా తెరకెక్కించారు. మహాభారతంలో భీష్ముని వల్ల ఒక జన్మలో మరణించిన కారణం, మరో జన్మలో భీష్మునిపై ఆమె పగ తీర్చుకున్న ప్రయాణాన్ని చూపించే దిశగా ఈ చిత్రం ఉంటుంది.
అంబా'స్ రివేంజ్ టీజర్ రిలీజ్
మనుషులు ఎవరు నటించకుండా కేవలం ఏఐ ద్వారా రూపొందించిన అంబా'స్ రివెంజ్ సినిమా టీజర్ తాజాగా మీడియా సమక్షంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా విజువల్ డైరెక్టర్ సాయి నేత మాట్లాడుతూ... "ఈ కార్యక్రమానికి వచ్చి మాకు సపోర్ట్ అందిస్తున్న అందరికీ నమస్కారం. ఈ సినిమా కోసం చాలా కష్టపడి పనిచేయడం జరిగింది. ప్రేక్షకులు అందరూ మా సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.
అలాగే, సంగీత దర్శకుడు ప్రమోద్ ఎంసీ మాట్లాడుతూ... "మహాభారతంలోని ఒక అంశాన్ని తీసుకుని సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానున్నాము. మీడియా వారి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాము" అని కోరారు.
ఈ సినిమాలో 2 పాటలుంటాయి
"నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఈ సినిమాలో 2 పాటలు ఉంటాయి. నేటి తరానికి అర్థం అయ్యేలా ఈ చిత్రాన్ని తెరకి ఎక్కించడం జరిగింది" అని డైలాగ్స్, లిరిక్స్ రైటర్ కిషోర్ కుమార్ ఏనుగు చెప్పారు.
"నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ప్రస్తుతం వస్తున్న కొన్ని ఏఐ రీల్స్ వల్ల ప్రేక్షకులకు ఏఐ సినిమా అంటే ఒక అవగాహన ఉంది. ఈ సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా మంచి విజువల్ ఫీస్ట్ ఇస్తుంది. అందరూ సినిమాను ఆదరించవలసిందిగా కోరుకుంటున్నాను" అని ఆకాంక్షించారు ఎడిటర్ హ్యారీ బ్రెయిన్.
చాలా ఖర్చుతో కూడింది
"ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ థాంక్స్. నాకు అవకాశం ఇచ్చి, చిత్రంలో నాకు సపోర్ట్ అందించిన చిత్ర బృందం అందరికీ థాంక్స్" అని క్యారెక్టర్ డిజైనర్ చందు గోసంగి తెలిపారు.
నిర్మాత యోగేంద్ర ప్రసాద్ పొట్లూరి మాట్లాడుతూ... "ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఏఐలో సినిమా చేయడం చాలా ఖర్చుతో కూడిన విషయం. సాధారణంగా ఇటువంటి సినిమా చేయాలంటే తక్కువ ఖర్చు అనుకుంటారు. కానీ మేము ఒక టూల్ ఉపయోగించేలోపు మరొక టూల్ వస్తుంది. అలా ఖర్చు ఎక్కువ అయింది. ప్రస్తుతం అందరూ రీల్స్‌లో ఏఐ చూస్తున్నారు కానీ ఈ సినిమా చాలా అద్భుతంగా ఉండబోతుంది" అని ధీమా వ్యక్తం చేశారు.
శిఖండి నుంచి చూస్తాం
దర్శకుడు జైవర్ధన్ మేడి మాట్లాడుతూ... "సినిమా అంబ అయినప్పటికీ ఈ సినిమా శిఖండి నుంచి చూడబోతున్నాము. సినిమాలో ప్రముఖ పాత్రలు ప్రేక్షకులకు పరిచయం చేయడం కోసం ఈ టీజర్ విడుదల చేయడం జరిగింది. టీజర్‌లో డైలాగ్స్ కూడా లేవు, త్వరలో ట్రైలర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాము" అని పేర్కొన్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


