Ramayana Trailer: విజువల్ వండర్ ‘రామాయణ’ ట్రైలర్ రిలీజ్- గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో- అదొక్కటే మిస్సింగ్!

Ramayana Trailer: నితేష్ తివారీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న భారతీయ పౌరాణిక దృశ్యకావ్యం ‘రామాయణ’ ట్రైలర్ బ్రహ్మముహూర్తంలో విడుదలైంది. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యష్ లతో కూడిన ఈ విజువల్ వండర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. కానీ ట్రైలర్ లో ఒకటి మిస్ అయింది.

Published on: Jul 30, 2026, 06:03:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ramayana Trailer: భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, గ్లోబల్ విజువల్ ప్రమాణాలతో తెరకెక్కుతున్న చిత్రం 'రామాయణ' (Ramayana). 'దంగల్' ఫేమ్ నితేష్ తివారీ దర్శకత్వంలో ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ అధినేత నమిత్ మల్హోత్రా నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ పౌరాణిక మహాకావ్యం మొదటి భాగం (Part 1) కి సంబంధించిన ట్రైలర్‌ను బ్రహ్మముహూర్తాన మేకర్స్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు.

విజువల్ వండర్ ‘రామాయణ’ ట్రైలర్ రిలీజ్- గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో- అదొక్కటే మిస్సింగ్!
విజువల్ వండర్ ‘రామాయణ’ ట్రైలర్ రిలీజ్- గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో- అదొక్కటే మిస్సింగ్!

రామాయణ ట్రైలర్

అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన రామాయణ ట్రైలర్ వచ్చేసింది. ఇవాళ (జూలై 30) బ్రహ్మ ముమూర్తంలో ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. గతంలో వచ్చిన టీజర్‌పై వచ్చిన విమర్శలను పరిగణనలోకి తీసుకుని, అత్యున్నత క్వాలిటీతో కట్ చేసిన ఈ ట్రైలర్ సినీ ప్రియులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.

అయోధ్య భవ్యం.. లంక ప్రాభవం!

ట్రైలర్ ప్రారంభంలోనే రావణాసురుడు (యష్) ఒక రాజభవన ద్వారాన్ని తట్టి, భయాందోళనల మధ్య "ఇది రావణ రాజ్యానికి ఆరంభం" అంటూ చేసే సింహగర్జనతో కథనంలోని ఇంటెన్సిటీ స్పష్టమవుతుంది. లోకాలను కాపాడేందుకు శ్రీమహావిష్ణువు అయోధ్య రాజైన దశరథుడి (అరుణ్ గోవిల్) పుత్రుడిగా రాముడి (రణ్‌బీర్ కపూర్) రూపంలో జన్మించడం, సోదరుడు లక్ష్మణుడి (రవి దూబే)తో కలిసి రాక్షస సంహారం చేయడం అద్భుతంగా చూపించారు.

వనవసానికి

కైకేయి (లారా దత్తా) కోరిక మేరకు రాముడు 14 ఏళ్ల వనవాసానికి బయలుదేరడం, ఆయనను అనుసరిస్తూ సీతాదేవి (సాయి పల్లవి) అడవులకు వెళ్లడం వంటి సన్నివేశాలు ఎమోషనల్‌గా అలరిస్తున్నాయి. గత టీజర్‌లో కనిపించిన సిజిఐ (CGI) లోపాలను అధిగమించి.. ఈసారి అయోధ్య, లంకల భవ్యమైన వైభవంపై, డ్రామాపై ఎక్కువ దృష్టి పెట్టడం ప్లస్ పాయింట్‌గా మారింది.

రకుల్ ప్రీత్ సింగ్

శుర్ఫణఖగా రకుల్ ప్రీత్ సింగ్ ట్రైలర్ లో కనిపించింది. సీతాదేవిని రావణుడు అపహరించడం, యుద్ధానికి రాముడు వానర సైన్యాన్ని సిద్ధం చేయడం లాంటి సీన్లు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. లాస్ట్ లో కుంభకర్ణుడు లాంటి భారీకాయుడిని గ్రాఫిక్స్ లో చూపించడం, యుద్ధం సన్నివేశాలు హైలైట్ గా నిలిచాయి.

అదొక్కటే మిస్సింగ్

రామాయణంలో హనుమంతుడు లేకపోతే ఎలా? కానీ ఈ రామాయణ ఫస్ట్ పార్ట్ ట్రైలర్ లో హనుమంతుడు కనిపించలేదు. మరి కావాలనే రివీల్ చేయలేదా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. హనుమంతుడి (సన్నీ డియోల్) పాత్రను ఈ ట్రైలర్‌లో దాచిపెట్టి, పార్ట్-2 పై ఆసక్తిని రెట్టింపు చేశారు. అలాగే రాముడు, రావణుడు నేరుగా తలపడటం కూడా చూపించలేదు.

రూ.75 కోట్ల మ్యూజిక్ డీల్

రామాయణ చిత్రం అంతర్జాతీయంగా భారతీయ సంస్కృతిని ఆవిష్కరించేలా రూపొందుతోంది.

  • ఆస్కార్ దిగ్గజాల కలయిక: తొలిసారిగా ఆస్కార్ విజేతలు ఏఆర్‌ రెహమాన్ (A.R. Rahman), హాలీవుడ్ లెజెండరీ కంపోజర్ హన్స్ జిమ్మర్ (Hans Zimmer) కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
  • ’రికార్డ్ స్థాయిలో నాన్-థియేట్రికల్ బిజినెస్: ఈ సినిమా రెండు భాగాలకు సంబంధించిన ఆడియో హక్కులను ప్రముఖ ఆడియో సంస్థ టి-సిరీస్ (T-Series) ఏకంగా రూ. 75 కోట్లకు కొనుగోలు చేసి ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది.
  • హాలీవుడ్ విఎఫ్ఎక్స్ & గ్లోబల్ రిలీజ్: ఆస్కార్ గెలుచుకున్న విజువల్ ఎఫెక్ట్స్ సంస్థ 'DNEG' విఎఫ్ఎక్స్ బాధ్యతలు తీసుకోగా, సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్‌మెంట్ (Sony Pictures) భాగస్వామ్యంతో హాలీవుడ్ సినిమాల తరహాలో ప్రపంచవ్యాప్తంగా వేల స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు.

విడుదల తేదీ

ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా పేర్కొన్నట్లుగా 100 ఏళ్ల భారతీయ సినిమా చరిత్రలోనే ‘రామాయణ’ ఒక గర్వకారణమైన ఘట్టంగా నిలవనుంది. నవంబర్ 8, 2026 న దీపావళి కానుకగా ఈ చిత్ర మొదటి భాగం విడుదల కానుండగా, రెండవ భాగాన్ని 2027లో తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. సరైన కథనం, అంతర్జాతీయ స్థాయి విజువల్స్ తోడైతే ఈ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.వెయ్యి కోట్ల క్లబ్‌ను అత్యంత వేగంగా దాటే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More