Yash: పెద్ద స్పీకర్లలో శివుడి పాటలు.. అందరికీ ఇబ్బందే.. కానీ అలాగే రావణుడి పాత్రలోకి పరకాయ ప్రవేశం: యష్ కామెంట్లు వైరల్

Yash: శాన్ డియాగో కామిక్-కాన్‌లో 'రామాయణం' మూవీ విశేషాలను పంచుకున్న కేజీఎఫ్ స్టార్ యష్.. ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించాడు. రావణుడి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడానికి భారీ స్పీకర్లలో శివ తాండవ స్తోత్రాలు బిగ్గరగా ప్లే చేస్తూ సెట్ వైబ్‌ను మార్చేసేవాడినని వెల్లడించాడు.

Published on: Jul 26, 2026, 19:14:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Yash: భారతీయ చిత్రసీమలో అత్యంత భారీ బడ్జెట్‌తో, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న పౌరాణిక దృశ్యకావ్యం 'రామాయణం' (Ramayana). నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కే ఈ బిగ్ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తుండగా, కన్నడ రాకింగ్ స్టార్ యష్ లంకేశ్వరుడు రావణాసురుడిగా నటిస్తున్నాడు.

రావణుడి పాత్ర గురించి యష్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు
రావణుడి పాత్ర గురించి యష్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు

యష్ కామెంట్లు

ఇటీవల ప్రఖ్యాత 'శాన్ డియాగో కామిక్-కాన్' (San Diego Comic-Con) వేడుకలో పాల్గొన్న రామాయణ చిత్ర యూనిట్ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. ఈ సందర్భంగా రావణుడి పాత్ర కోసం తాను చేసిన హోమ్‌వర్క్ గురించి యష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

పెద్ద స్పీకర్లలో శివ పాటలు

రివ్యూ నేషన్ యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడిన యష్.. రావణుడి పాత్రలోకి తానెలా మారేవాడో వివరించాడు. "ప్రతి రోజు షూటింగ్ సెట్‌లోకి రాగానే ఆ భారీ కిరీటం ధరించగానే రావణుడి గంభీరత వచ్చేది. అయితే ఆ డివైన్ అండ్ అగ్రెసివ్ మోడ్‌లోకి వెళ్లడానికి నేను ఒక ప్రత్యేకమైన పని చేసేవాడిని. దానివల్ల సెట్‌లో అందరికీ కాస్త ఇబ్బంది కలిగేది (నవ్వుతూ)’’ అని యష్ చెప్పాడు.

‘‘పెద్ద స్పీకర్లు తెప్పించి, ఫుల్ వాల్యూమ్‌తో శివుడి పాటలు, స్తోత్రాలు ప్లే చేసేవాడిని. రావణుడు గొప్ప శివభక్తుడు. అందుకే ఆ ట్రాన్స్‌లో ఉండటానికి బిగ్గరగా లార్డ్ శివ సాంగ్స్ వినేవాడిని. నా స్పీకర్ల సౌండ్ వల్ల అక్కడ ఉన్నవాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడేవారు" అని యష్ వెల్లడించాడు.

డైరెక్టర్ ఏమన్నాడంటే?

దర్శకుడు నితీష్ తివారీ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ యష్ సెట్ అట్మాస్ఫియర్‌ను సీరియస్‌గా మార్చేసేవాడని చెప్పాడు. రణ్‌బీర్ కపూర్ స్పందిస్తూ.. తాను ఇంకా యష్‌తో కలసి కాంబినేషన్ సీన్లు షూట్ చేయనప్పటికీ, అతను తెచ్చే హై-వోల్టేజ్ ఎనర్జీ గురించి సెట్‌లో అందరూ గొప్పగా చెప్పుకునేవారని తెలిపాడు.

లీక్‌ల కలకలం

జూలై 18న ఢిల్లీలోని 'ప్రథమ్ సంకల్ప' వేడుకలో, ఆపై కామిక్-కాన్‌లో ప్రదర్శించిన 'రామాయణం' ట్రైలర్ క్లిప్‌లను కొందరు సోషల్ మీడియాలో లీక్ చేయడం తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలో నెట్‌లో అధికారిక డిజిటల్ ట్రైలర్ విడుదలను నిర్మాతలు వాయిదా వేశారు.

ప్రతిష్టాత్మక హాలీవుడ్ నిర్మాణ సంస్థ 'సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్' (Sony Pictures Entertainment) తో గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ ఒప్పందం కుదిరినందున, హాలీవుడ్ రేంజ్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేసేలా త్వరలోనే కొత్త తేదీన గ్రాండ్‌గా ట్రైలర్‌ను లాంచ్ చేస్తామని నిర్మాత నమిత్ మల్హోత్రా స్పష్టం చేశారు.

రిలీజ్ డేట్

పాన్-వరల్డ్ స్థాయిలో రాబోతున్న ఈ పౌరాణిక ఎపిక్‌లో సీతగా సాయి పల్లవి, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. భారతీయ సినిమా చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించనున్న ఈ మూవీ మొదటి భాగాన్ని 2026 దీపావళి కానుకగా, రెండో భాగాన్ని 2027లో విడుదలకు సిద్ధం చేస్తున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More