Ramayana Collections: రామాయణం సినిమాకు తొలిరోజు 160 కోట్లు- పాజిటివ్ రివ్యూలతో కూడా దాటని ప్రభాస్ ఆదిపురుష్ కలెక్షన్స్
Ramayana Box Office Collection Day 1: నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన రూ.1600 కోట్ల భారీ చిత్రం 'రామాయణం' ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది. తొలిరోజే రూ.64.85 కోట్ల నెట్ కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర మొదలుపెట్టింది. అయితే ప్రభాస్ ఆదిపురుష్ సినిమా కలెక్షన్స్ మాత్రం దాటలేకపోయింది.
Ramayana 1st Day Worldwide Box Office Collection: భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన పౌరాణిక దృశ్యకావ్యం 'రామాయణం' థియేటర్లలోకి అడుగుపెట్టింది. నితేష్ తివారీ దర్శకత్వంలో రూ.1600 కోట్ల భారీ వ్యయంతో రూపొందిన ఈ చిత్రం దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా నిన్న గురువారం (నవంబర్ 5) విడుదలయింది.

విడుదలైన మొదటి రోజే విశేష ప్రజాదరణ పొందుతూ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది రామాయణ పార్ట్ 1. టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు విదేశాల్లోనూ ఈ సినిమాకి మొదటి రోజు హౌస్‌ఫుల్ కలెక్షన్లు నమోదయ్యాయి.
రూ.200 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్
విజయదశమి రోజు నుంచే ప్రారంభమైన రామాయణం సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ సరికొత్త చరిత్ర సృష్టించాయి. ప్రదర్శనకారులు, పంపిణీదారుల నడుమ ఉన్న వివాదాలు తొలగిపోవడంతో అడ్వాన్స్ బుకింగ్స్ జోరందుకున్నాయి.
చిత్రం విడుదలయ్యే సమయానికే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల విలువైన టికెట్లు అమ్ముడయ్యాయి. భారతదేశం నుంచే రూ.120 కోట్లకు పైగా బుకింగ్స్ రావడం విశేషం. కేవలం మొదటి రోజు గ్రాస్ వసూళ్ల కోసమే రూ.45 కోట్ల టికెట్లు విక్రయించారు.
మొదటి రోజు రూ.64.85 కోట్ల నెట్ వసూళ్లు
తొలిరోజు గురువారం ఉదయం నుంచే దేశమంతటా థియేటర్లు ప్రేక్షకులతో కిక్కిరిసిపోయాయి. భారతదేశంలో ఈ సినిమా మొదటి రోజు రూ. 64.85 కోట్ల నికర (Net) వసూళ్లను రాబట్టింది. హిందీ వెర్షన్ అత్యద్భుతమైన ఆదరణ పొందడం ఈ భారీ వసూళ్లకు ప్రధాన కారణమైంది.
కన్నడ నటుడు యశ్ 'రావణాసురుడి' పాత్ర పోషించినప్పటికీ, కన్నడ నాట ఈ చిత్రం నెమ్మదిగా ప్రారంభమై రూ.7.25 కోట్లు మాత్రమే రాబట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవిల నటనకు మంచి స్పందన లభించడంతో తెలుగు వెర్షన్ గణనీయమైన వసూళ్లను సాధించగా, తమిళం, మలయాళం వెర్షన్లు పర్వాలేదనిపించాయి.
పఠాన్, యానిమల్‌ను దాటి..
బాక్సాఫీస్ పోటీలో 'రామాయణం' పలు బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ల రికార్డులను తిరగరాసింది. షారుఖ్ ఖాన్ 'పఠాన్' (రూ.57 కోట్లు), రణ్‌బీర్ కపూర్ 'యానిమల్' (రూ.63 కోట్లు), అజయ్ దేవగన్ 'దృశ్యం 2' (రూ.62 కోట్లు) తొలిరోజు వసూళ్లను రామాయణం సునాయాసంగా దాటేసింది.
ధురంధర్ మొదటి భాగం రాబట్టిన రూ.28 కోట్ల వసూళ్లను మధ్యాహ్నానికే దాటేసింది. అయితే షారుఖ్ ఖాన్ 'జవాన్' (రూ.75 కోట్లు), ఈ ఏడాది సంచలనం సృష్టించిన 'ధురంధర్ 2' (రూ.102 కోట్లు) తొలిరోజు రికార్డులను మాత్రం అందుకోలేకపోయింది రామాయణం సినిమా.
ఆదిపురుష్‌కి దూరంగా
అయితే టాలీవుడ్ అభిమానులను, సినీ విశ్లేషకులను ఆశ్చర్యపరిచిన విషయమేంటంటే.. 2023లో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ప్రభాస్ 'ఆదిపురుష్' చిత్రం తొలిరోజు సాధించిన రూ.86.75 కోట్ల ఓపెనింగ్ రికార్డును రామాయణం అధిగమించలేకపోవడమే. రామాయణం సినిమాకు ఫుల్ పాజిటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ ప్రభాస్ ఆదిపురుష్ కలెక్షన్స్ దాటకపోవడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.
ఇకపోతే రామాయణం సినిమాకు ఇండియాలో 64.85 కోట్ల నెట్ కలెక్షన్స్ రాగా రూ. 77.50 కోట్ల గ్రాస్ కలెక్ట్ అయింది. అలాగే, వరల్డ్ వైడ్‌గా రూ. 150 నుంచి రూ. 160 కోట్ల మధ్య గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. అలాగే, ఓవర్సీస్‌లో 60 కోట్ల వరకు వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది.
రెండు భాగాలుగా మైండ్ బ్లోయింగ్ విజువల్స్
ఇకపోతే నమిత్ మల్హోత్రాకి చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డిఎన్‌ఈజీ (DNEG), యశ్ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ దృశ్యకావ్యాన్ని రెండు భాగాలుగా నిర్మిస్తున్నాయి. ఇందులో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, యశ్ రావణాసురుడిగా నటించిన విషయం తెలిసిందే.
లక్ష్మణుడి పాత్రలో రవి దూబే, ఆంజనేయుడిగా సన్నీ డియోల్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ కనిపించారు. మొదటి భాగం 2026 దీపావళి కానుకగా విడుదల కాగా, రెండవ భాగం కూడా 2028 దీపావళికి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


