Prabhas Fauzi Netaji: వివాదంలో ప్రభాస్, హను రాఘవపూడి ఫౌజీ.. దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని నేతాజీ మనవడి ఆగ్రహం!

Prabhas Fauzi Controversy Netaji Grandnephew: ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న 'ఫౌజీ' చిత్రం వివాదంలో చిక్కుకుంది. చిత్రంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రను, ఆయన హిట్లర్‌ను కలిసిన తీరును తప్పుగా చూపించారంటూ నేతాజీ మనవడు చంద్రకుమార్ బోస్ దర్శకుడిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Published on: Oct 26, 2026, 13:26:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Prabhas Fauzi Controversy Netaji Grandnephew: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, 'సీతారామం' ఫేమ్ హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ' వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. ఈ చిత్రానికి సంబంధించి ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఇటీవల విడుదలైన 'ఫైల్ నంబర్ 25' గ్లింప్స్ తీవ్ర దుమారం రేపుతోంది.

వివాదంలో ప్రభాస్, హను రాఘవపూడి ఫౌజీ.. దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని నేతాజీ మనవడి ఆగ్రహం!
వివాదంలో ప్రభాస్, హను రాఘవపూడి ఫౌజీ.. దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని నేతాజీ మనవడి ఆగ్రహం!

నేతాజీ ప్రతిష్టను దిగజార్చేలా చూపించారంటూ

స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రను ఫౌజీ చిత్రంలో అవమానపరిచేలా, ఆయన ప్రతిష్టను దిగజార్చేలా చూపించారంటూ నేతాజీ మనవడు చంద్రకుమార్ బోస్ బహిరంగంగా మండిపడ్డారు. దేశ ప్రజలకు, స్వాతంత్ర్య పోరాటాన్ని గౌరవించే వారందరికీ దర్శకుడు హను రాఘవపూడి తక్షణమే క్షమాపణ చెప్పాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు.

హిస్టారికల్ ఫ్యాక్ట్స్ మార్చడం నేరం!

సినిమా నిర్మించే క్రమంలో దర్శకులకు, నిపుణులకు సృజనాత్మక స్వేచ్ఛ (Creative Freedom) ఉంటుందనే విషయాన్ని ఒప్పుకున్న చంద్రకుమార్ బోస్, ఆ స్వేచ్ఛ చారిత్రక సత్యాలను మరుగున పరిచేలా ఉండకూడదని స్పష్టం చేశారు.

కల్పిత కథలతో నిజమైన చరిత్ర వక్రీకరించడం

జాతీయ నాయకుల, జాతిపితల పాత్రలను సినిమా కోసం కల్పిత కథలతో మార్చేయడం, వారి నిజమైన చరిత్రను వక్రీకరించడం తీవ్రమైన నేరమని చంద్రకుమార్ బోస్ వ్యాఖ్యానించారు. ఇటువంటి సన్నివేశాలు నేతాజీ వంటి మహానాయకుడి గంభీరమైన వ్యక్తిత్వాన్ని, సమాజంలో ఆయనకున్న స్థానాన్ని తగ్గించి చూపిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.

హిట్లర్‌తో నేతాజీ భేటీ వెనుక నిజమైన చరిత్ర ఏంటి?

రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో భారతదేశానికి బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కలిగించేందుకు నేతాజీ జర్మనీ, జపాన్ దేశాల మద్దతు కోరారు. జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్‌ను కలిసినప్పుడు నేతాజీ ఒక దేశ ప్రతినిధిగా, సమానమైన హోదాలోనే మాట్లాడారు తప్ప ఎప్పుడూ లోకువ కాలేదు.

హీరో పాత్రను ఎలివేట్చేయడం కోసం

ఫాసిజానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య హక్కులకు అనుకూలంగా నిలబడిన నాయకుడు నేతాజీ. అయితే, 'ఫౌజీ' గ్లింప్స్‌లో చూపించిన విధంగా కల్పిత కథానాయకుడి పాత్రను ఎలివేట్ చేయడం కోసం నేతాజీని హిట్లర్ ముందు తక్కువ చేసి చూపించడం ఏమాత్రం సరికాదని, అందుకు దేశ ప్రజలకు మేకర్స్ క్షమాపణ చెప్పాలని చంద్రకుమార్ బోస్ డిమాండ్ చేశారు.

'ఫైల్ నంబర్ 25' సీన్‌లో ఏముంది?

ఈ వివాదానికి ప్రధాన కారణం ఫౌజీ సినిమా నుంచి వచ్చిన 'ఫైల్ నంబర్ 25' గ్లింప్స్. బెర్లిన్‌లో నేతాజీ, హిట్లర్ మధ్య సంభాషణతో ఈ వీడియో ప్రారంభమవుతుంది. అందులో ప్రభాస్ నటించిన ఒక కల్పిత క్యారెక్టర్ గురించి నేతాజీ హిట్లర్‌కు వివరిస్తున్నట్లు చూపించారు.

తప్పుబట్టిన నెటిజన్లు

ఒక ఊహాజనిత హీరో పాత్రకు బిల్డప్ లేదా ఎలివేషన్ ఇవ్వడానికి, మనదేశ గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడిని వాడడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చరిత్రను సినిమా రంగుల కోసం వక్రీకరించకుండా అసలు నేపథ్యాన్ని సరిగ్గా చూపించాలని, ఈ విషయంలో చిత్ర యూనిట్ స్పందించాలని అభిమానులు, నెటిజన్లు సైతం కోరుతున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More