Fauzi Glimpse: ప్రభాస్ ఫౌజీ గ్లింప్స్ వచ్చేసింది- ఏకంగా నేతాజీతోనే ఎలివేషన్- నెక్ట్స్ లెవెల్ డైలాగ్స్, బీజీఎమ్!

Prabhas Fauzi Glimpse Released On His Birthday: రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా తాజాగా ఫౌజీ నుంచి స్పెషల్ గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు. హనురాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా గ్లింప్స్‌లో ఏకంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్‌తోనే ప్రభాస్‌కు ఎలివేషన్ ఇచ్చిన సీన్ హైలెట్‌గా నిలిచింది.

Published on: Oct 23, 2026, 22:16:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Prabhas Fauzi Glimpse Released On His Birthday: పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు (అక్టోబర్ 23) వేడుకల వేళ ఆయన అభిమానులకు చిత్రబృందం అదిరిపోయే కానుక అందించింది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రీమ్ ప్రాజెక్ట్ 'ఫౌజీ' (వర్కింగ్ టైటిల్ / #Prabhas25) నుంచి మేకర్స్ తాజాగా రాత్రి తొమ్మిదన్నర గంటల సమయంలో అదిరిపోయే గ్లింప్స్ రిలీజ్ చేశారు.

ప్రభాస్ ఫౌజీ గ్లింప్స్ వచ్చేసింది- ఏకంగా నేతాజీతోనే ఎలివేషన్- నెక్ట్స్ లెవెల్ డైలాగ్స్, బీజీఎమ్!
ప్రభాస్ ఫౌజీ గ్లింప్స్ వచ్చేసింది- ఏకంగా నేతాజీతోనే ఎలివేషన్- నెక్ట్స్ లెవెల్ డైలాగ్స్, బీజీఎమ్!

నేతాజీతో ఎలివేషన్

సుమారు 2 నిమిషాల 31 సెకన్లపాటు సాగిన ఈ స్పెషల్ వీడియోలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేత ప్రభాస్ పాత్రకు ఎలివేషన్ ఇప్పించడం గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. వరల్డ్ వార్ 2 సమయంలో 1942 సంవత్సరం మే 29న జెర్మనీలోని బెర్లిన్‌లో హిట్లర్‌ను సుభాష్ చంద్రబోస్ కలుస్తారు.

"మనకున్న ఏకైక శత్రువు బ్రిటన్. ఆ బ్రిటన్‌ను ఓడించడానికి మా దగ్గర ఓ మనిషి ఉన్నాడు. అతనికి పేరు లేదు. కానీ, అతన్ని అంతా ఫౌజీ అని పిలుస్తారు. ప్రస్తుతం నా దేశాన్ని కాపాడే బాధ్యతలో కలకత్తాలో ఉన్నాడు" అని ప్రభాస్ గురించి నేతాజీ చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి.

రెండు వైపులా ప్రభాస్

ఆ తర్వాత "ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్" అంటూ ప్రభాస్ చేతులతో రక్తం చిందించే సీన్ నెక్ట్స్ లెవెల్ ఉంది. అనంతరం "1932 నుంచి మోస్ట్ వాంటెడ్" అంటూ భారీ రైఫిల్‌ను తిప్పే ప్రభాస్‌ను చూపించడం, అప్పుడు వచ్చే బీజీఎమ్ విజిల్స్ వేయించేలా ఉన్నాయి.

అరే వో ఫిరంగీ.. (బ్రిటీషర్) నా దేశం కోసం నీ రక్తాన్ని చీలుస్తా" అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ హైలెట్‌గా నిలిచింది. హిట్లర్, నేతాజీ సంభాషణలో వచ్చే భగవద్గీత లైన్ కూడా అదుర్స్ అనిపించేలా ఉంది. ఇక వీడియో ఎండింగ్‌లో ప్రభాస్‌ను రెండు వైపులా చూపిస్తూ హ్యాపీ బర్త్ డే చెప్పిన తీరు నెక్ట్స్ లెవెల్‌లో ఉంది.

ఇలా మొత్తంగా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఫౌజీ నుంచి వచ్చిన ఈ వీడియో డార్లింగ్ అభిమానులకు ఫుల్ ఫీస్ట్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఆకట్టుకుంటున్న వింటేజ్ నాణెం, కమాండింగ్ లుక్

ఇకపోతే ఈ వీడియోకు ముందు ఇవాళ విడుదల చేసిన పోస్టర్‌లో ఒక పాతకాలపు బంగారు నాణెంపై యూనిఫాంలో ఉన్న ప్రభాస్ సైడ్ ప్రొఫైల్ కనిపించింది. చుట్టూ మంటల వెలుగులు, నాణెంపై ప్రభాస్ రోల్ గంభీరంగా చూపించారు.

"డీక్లాసిఫైయింగ్ ఫైల్ నంబర్: #025.. 'ఎవరా వ్యక్తి?' అనే ప్రశ్నకు త్వరలోనే వీడియో రూపంలో సమాధానం ఇస్తాం" అని నిర్మాణ సంస్థ పేర్కొంది. 'ఒంటరిగా పోరాడే ఒక సైన్యం' (A Battalion Who Fights Alone) అనే క్యాప్షన్ ఇవ్వడం, తాజాగా వీడియో రిలీజ్ చేసి ఫౌజీ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశారు.

1940ల కాలంనాటి చారిత్రక కథాంశంతో..

'సీతారామం' వంటి క్లాసిక్ అందించిన హను రాఘవపూడి ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. స్వాతంత్య్రానికి పూర్వం, అంటే 1940ల కాలంనాటి చారిత్రక సంఘటనల నేపథ్యంలో ఈ కథ సాగనుంది. ఇందులో ప్రభాస్ ఒక వీరోచిత సైనిక అధికారి పాత్రలో కనిపిస్తారని అర్థమైపోయింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More