Prabhas Japan Fans: డార్లింగ్ ప్రభాస్.. పుట్టినరోజు శుభాకాంక్షలు.. తెలుగులో జపాన్ ఫ్యాన్స్ విషెస్.. ఇంటి ముందు హంగామా

Prabhas Japan Fans: ప్రభాస్ అక్టోబర్ 23న తన 47వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. దీంతో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వద్ద అర్ధరాత్రి వేల సంఖ్యలో అభిమానులు చేరుకుని బర్త్‌డే హంగామా సృష్టించారు. అటు జపాన్‌లోని అభిమానులు కేక్ కట్ చేసి, ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

Published on: Oct 23, 2026, 10:05:02 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Prabhas Japan Fans: 'పాన్ ఇండియా' అనే పదానికి నిలువెత్తు రూపంగా మారిన రెబెల్ స్టార్ ప్రభాస్ ఈరోజు (అక్టోబర్ 23) తన 47వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ఉన్న ఆయన అభిమానులు గురువారం రాత్రి నుంచే పుట్టినరోజు సంబరాలను పండగలా ప్రారంభించారు.

Prabhas Japan Fans: డార్లింగ్ ప్రభాస్.. పుట్టినరోజు శుభాకాంక్షలు.. తెలుగులో జపాన్ ఫ్యాన్స్ విషెస్.. ఇంటి ముందు హంగామా
Prabhas Japan Fans: డార్లింగ్ ప్రభాస్.. పుట్టినరోజు శుభాకాంక్షలు.. తెలుగులో జపాన్ ఫ్యాన్స్ విషెస్.. ఇంటి ముందు హంగామా

సోషల్ మీడియా వేదికగా హ్యాష్‌టాగ్స్ విపరీతంగా ట్రెండ్ అవుతుండగా, ఇటు ఇండియాలో, అటు విదేశాల్లోనూ ప్రభాస్ మానియా పీక్స్‌కు చేరింది. హైదరాబాద్‌లోని ఆయన నివాసం వద్ద మొదలుకొని జపాన్ వీధుల వరకు డార్లింగ్ బర్త్‌డే వేడుకలు అంబరాన్నంటాయి.

జపాన్‌లో డార్లింగ్ మానియా.. 'ప్రభాస్-సాన్'కు స్పెషల్ వీడియో

'బాహుబలి', 'సాహో' చిత్రాల నుంచి జపాన్‌లో ప్రభాస్‌కు మైండ్ బ్లాకింగ్ క్రేజ్ సొంతమైంది. గత ఏడాది ప్రభాస్ జపాన్ పర్యటన తర్వాత అక్కడి అభిమానులకు ఆయనపై ఉన్న ప్రేమ రెట్టింపైంది. ప్రభాస్ 47వ బర్త్‌డే సందర్భంగా జపాన్‌కు చెందిన అభిమానులు ప్రత్యేకంగా నలుపు, బంగారు వర్ణం (Black and Gold) దుస్తులను ధరించి బర్త్‌డే పార్టీ చేసుకున్నారు.

పుట్టిన రోజు శుభాకాంక్షలు డార్లింగ్ ప్రభాస్ అంటూ వాళ్లు తెలుగులో విషెస్ చెప్పడం విశేషం. అంతేకాదు కేకులు, బెలూన్లు, డార్లింగ్ సినిమాల పోస్టర్లతో అలంకరించిన వేదికపై 'హ్యాపీ బర్త్‌డే ప్రభాస్-సాన్' అంటూ జపనీస్ భాషలో పాటలు పాడి శుభాకాంక్షలు తెలిపారు. "గత ఏడాది మీరు జపాన్ రావడం మా హృదయాలను తాకింది. మీ కొత్త సినిమా విడుదల కాగానే భారతదేశం వచ్చి థియేటర్లలో చూస్తాం" అంటూ నెట్టింట షేర్ చేసిన వీడియో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది.

జూబ్లీహిల్స్ నివాసం వద్ద ఫ్యాన్స్ రచ్చ

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ప్రభాస్ నివాసం వద్ద అర్ధరాత్రి 12 గంటల ముందే వేల సంఖ్యలో అభిమానులు క్యూ కట్టారు. డార్లింగ్ ఫ్లాగ్‌లు, భారీ కటౌట్లతో జూబ్లీహిల్స్ వీధులన్నీ ప్రభాస్ నినాదాలతో హోరెత్తిపోయాయి. కొంతమంది అభిమానులు ఏకంగా కదులుతున్న ట్రక్కులపై నిలబడి ఫ్లాగ్‌లు ఊపుతూ సందడి చేయగా, భీమవరంలో అభిమానులు బ్లోటార్చ్‌లు, బైక్ ఇంజన్ల శబ్దాలతో వినూత్నంగా వేడుకలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

'ఈశ్వర్' నుంచి ప్రపంచ స్థాయి సూపర్ స్టార్ వరకు..

2002లో 'ఈశ్వర్' సినిమాతో వెండితెరకు పరిచయమైన ప్రభాస్, 'వర్షం' (2004), 'ఛత్రపతి' (2005) చిత్రాలతో మాస్ హీరోగా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత 'బుజ్జిగాడు', 'బిల్లా', 'డార్లింగ్', 'మిస్టర్ పర్ఫెక్ట్', 'మిర్చి' వంటి చిత్రాలతో ఫ్యామిలీ, యూత్ ఆడియెన్స్‌కు దగ్గరయ్యారు.

అయితే, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' (2015, 2017) సిరీస్ ప్రభాస్ జీవితాన్నే మార్చేసింది. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ సినిమా స్థాయిని చాటిచెప్పిన తొలి నటుడిగా ఆయన చరిత్ర సృష్టించారు.

ఈ ఏడాది 'ది రాజా సాబ్' చిత్రంతో అలరించిన ప్రభాస్.. గ్లోబల్ హిట్ 'కల్కి 2898 AD' సీక్వెల్‌లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌లతో కలిసి నటించనున్నారు. అంతేకాకుండా, హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ', సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మోస్ట్ అవేటెడ్ పోలీస్ డ్రామా 'స్పిరిట్' (2027) చిత్రాలతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడానికి సిద్ధమవుతున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More