Jailer 2 Collection: జైలర్ 2కి 125 కోట్ల ఓపెనింగ్ కలెక్షన్స్- ప్రభాస్ తర్వాత రజనీకాంత్- తమిళ సినీ చరిత్రలో 4వ మూవీగా!
Rajinikanth Jailer 2 Box Office Collection Day 1: సూపర్‌స్టార్ రజనీకాంత్ 'జైలర్ 2' చిత్రం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 125 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. 75 ఏళ్ల వయసులోనూ అదరగొట్టిన రజనీకాంత్ సీక్వెల్ మూవీ అనేక పాన్-ఇండియా రికార్డులను తిరగరాసింది.
Rajinikanth Jailer 2 Worldwide Box Office Collection: సూపర్‌స్టార్ రజనీకాంత్ థియేటర్లలోకి అడుగుపెడితే రికార్డులు తిరగరాయాల్సిందేనని మరోసారి నిరూపితమైంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'జైలర్ 2' చిత్రం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లను ఊపేసింది.

75 ఏళ్ల వయసులో పోటీ
75 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ, రజనీకాంత్ బాక్సాఫీస్ వద్ద తన తిరుగులేని ఆధిపత్యం చాటుకున్నారు. మొదటి రోజే ఊహించని రీతిలో భారీ కలెక్షన్లు సాధించి, భారతీయ సినిమాలో తన పేరున మరో ఘనత రాసుకున్నారు.
ఇండియాలో 70 కోట్లు
అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే ప్రకంపనలు సృష్టించిన జైలర్ 2 సినిమా తొలి రోజే భారత్‌లో రూ. 59.70 కోట్ల నెట్, రూ. 70.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో తమిళ సినీ చరిత్రలోనే భారతదేశంలో 4వ అతిపెద్ద ఓపెనింగ్ సాధించిన చిత్రంగా జైలర్ 2 నిలిచింది. ఈ జాబితాలో ముందున్న రోబో '2.0', 'కూలీ' చిత్రాల్లో కూడా రజనీకాంతే హీరో కావడం ఆయనకున్న క్రేజ్‌కు నిదర్శనం.
రూ. 125 కోట్ల రికార్డు ఓపెనింగ్స్
ఓవర్సీస్లోనూ రజనీ మేనియా పీక్స్‌కు చేరింది. అమెరికా, ఆగ్నేయాసియా దేశాల్లో తొలి రోజే ఏకంగా 6 మిలియన్ డాలర్లు కొల్లగొట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 'జైలర్ 2' మొదటి రోజు ఏకంగా రూ. 125 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. తెలుగు రాష్ట్రాల్లోనూ 'టైగర్ ముత్తువేల్ పాండియన్' హవా సాగింది.
టాప్ 20 జాబితాలో జైలర్ 2
రూ. 125 కోట్ల తొలి రోజు వసూళ్లతో 'జైలర్ 2' భారతీయ సినీ చరిత్రలోనే టాప్-20 బిగ్గెస్ట్ ఓపెనర్ల జాబితాలో చేరింది. తమిళ చిత్రాల పరంగా 'కూలీ' (రూ. 151 కోట్లు), విజయ్ 'లియో' (రూ. 143 కోట్లు) తర్వాత మూడో స్థానంలో నిలిచింది.
భారీ పాన్ ఇండియా చిత్రాల రికార్డులు డౌన్
బాలీవుడ్, పాన్ ఇండియా బ్లాక్బస్టర్లు అయిన 'పఠాన్' (రూ. 105 కోట్లు), 'యానిమల్' (రూ. 116 కోట్లు), 'గోట్' (రూ. 101 కోట్లు) చిత్రాల తొలి రోజు రికార్డులను జైలర్ 2 సునాయాసంగా దాటేసింది. ఈ ఘనతతో రజనీకాంత్ తన కెరీర్లో మూడోసారి రూ. 100 కోట్ల కంటే ఎక్కువ ఓపెనింగ్ సాధించిన ఏకైక తమిళ నటుడిగా చరిత్ర సృష్టించారు.
ప్రభాస్ తర్వాత రజనీకాంత్
భారతీయ సినిమాలో ఇప్పటివరకు ప్రభాస్ మాత్రమే 5 సార్లు వంద కోట్లకు పైగా ఓపెనింగ్స్ సాధించి మొదటి స్థానంలో ఉన్నారు. ప్రభాస్ తర్వాత మూడు సార్లు ఈ మార్కు దాటిన రెండో భారతీయ హీరోగా రజనీకాంత్ నిలిచారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, విజయ్, యశ్, షారుఖ్ ఖాన్ రెండేసి సార్లు ఈ ఘనత సాధించారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


